DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రపంచంలో అత్యంత విచిత్రం హేమాచల నరసింహుడు . . . 

https://youtu.be/4czACSAO9OE

">

మానవ స్పర్శగా స్పందించే విగ్రహం. 

శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయం,

రాజమహేంద్రవరం, జూన్ 2 ,2019  (DNS Online ) : à°ˆ ప్రపంచంలోనే అత్యంత అరుదైన వింతలకు ఆలవాలంగా

నిలిచిన హిందూ ఆలయాల్లో అత్యంత ప్రాధాన్యత కల్గిన ఆలయం శ్రీ హేమాచల క్షేత్రం. వరంగల్ కి 130 కి.మీ. ల దూరంలో అటవీ ప్రాంతంలో వున్నదీ ఆలయం. అత్యంత కీకారణ్యంగా ఉండే ఈ

ప్రాంతంలోని à°ˆ ఆలయం దర్శనం ఉదయం 10 à°—à°‚à°Ÿà°² నుంచి సాయంత్రం 4 à°—à°‚à°Ÿà°² వరకే లభిస్తుంది. à°† తర్వాత మానవ మాత్రులు ఆలయ ప్రాంతంలో సంచరించే సాహసం చెయ్యరు. 
 
ఆలయ రహదారి

మార్గం:

హనుమకొండనుంచి ఏటూరునాగారం వెళ్ళే మార్గంలో వున్న మల్లూరుదాకా (మంగపేట వెళ్ళే బస్సు)  à°¬à°¸à±à°¸à± సౌకర్యం వున్నది.  à°…క్కడనుంచి ఆలయానికి 4 à°•à°¿.మీ.లు

లోపలకెళ్ళాలి. మార్గం, ఆలయ పరిసరాలు పచ్చని చెట్లతో అందంగా వుంటాయి.  à°†à°Ÿà±‹ సౌకర్యం వుంటుందిగానీ రేట్లు కొంచెం ఎక్కువన్నారు.  à°µà°°à°‚గల్ à°•à°¿ 130 à°•à°¿.మీ. à°² దూరంలో అటవీ

ప్రాంతంలో వున్నదీ ఆలయం. మారేడుమిల్లి భద్రాచలం మీదుగా మల్లూరు దారి బాగుంది. భద్రాచలం కు 75 à°•à°¿.మీ. à°² దూరంలో అటవీ ప్రాంతంలో వున్నదీ ఆలయం. 

ఇక్కడి విశేషాలు  :
/>  
అటవీ ప్రాంతంకావటంతో దోవ పొడుగూ చెట్లతో ఆకర్షణీయంగా వుంటుంది. రోడ్డుకూడా బాగుంటుంది. పట్టణ గజిబిజి నుంచి విశ్రాంతి కావాలనుకునేవాళ్ళు సరదాగా

వెళ్ళిరావచ్చు. చిన్న కొండమీద ఆలయం .. చిన్నదైనా .. అడవిలో నెలకొన్న ఆలయం, ఆలయంలో విశేష మహత్యంకల విభిన్న స్వరూపుడైన స్వామి, కొండకింద విశాలమైన ప్రదేశం, సకల

రుగ్మతలను మాయం చేసే చింతామణి జలపాతం, ఇవ్వన్నీ ఇక్కడి విశేషాలే. ఇదంతా అటవీ ప్రాంతం. మల్లూరుదాకా (మంగపేట వెళ్ళే బస్సు) బస్సు సౌకర్యం వున్నది. అక్కడనుంచి

ఆలయానికి 4 కి.మీ.లు లోపలకెళ్ళాలి. మార్గం, ఆలయ పరిసరాలు పచ్చని చెట్లతో అందంగా వుంటాయి. ఆటో సౌకర్యం వుంటుంది. ఇలాంటి ప్రదేశాలకు సిటీనుంచి వెళ్ళేవాళ్ళకి

సొంతవాహనమయితే సౌకర్యంగావుంటుంది.

స్వామి  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°•à°¤ : 
ఇంక ఇక్కడ వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గురించి ... ఆయన స్వయంభూ. 6 అడుగుల ఎత్తుగా, శంఖు, చక్ర,

గదాయుధాలతో నుంచున్నట్లుంటారు వక్షస్ధలంనుంచి నాభివరకు వేలితో నొక్కితే వేలు లోపలకెళ్తుంది. వేలు తీసేస్తే ఆ ప్రాంతం మళ్లీ మామూలుగా అవుతుంది. పూజారిగారు ఈ

విశేషాన్ని చూపిస్తారు. భక్తులను తాకనివ్వరు. స్వామి నాభినుంచి ద్రవం స్రవిస్తూవుంటుంది. దీనికి ఒక కధ చెప్తారు. హిరణ్యకశిపుడి సంహారంకోసం స్వామి ఈ అరణ్యంలోకి

వచ్చినట్లు, చెంచు లక్ష్మిని ఇక్కడే వివాహమాడినట్లు కాలక్రమేణా గుహాంతర్భాగాల్లో మరుగునపడ్డట్లు చెప్తారు. తర్వాత కాలంలో భారద్వాజ, అంగీరస మహర్షులు సంచారం

చేస్తూ ఈ ప్రాంతంలో ఒక రాత్రి విశ్రమించారు. అప్పుడు స్వామి వారికి స్వప్న దర్శనమిచ్చి తనని వెలికి తీయమని ఆదేశించాడు. వారు పలుగుతో స్వామి చెప్పినచోట తవ్వగా

స్వామి నాభి దగ్గర పలుగు తగిలి రక్తం కారిందిట. ఋషులు వెంటనే చందనం అరగదీసి స్వామికి పరిచర్యలు చేశారుట. ఆ దెబ్బ తగిలిన ప్రదేశంలోనే ఇప్పడూ చీములాంటి ద్రవం

స్రవిస్తూవుంటుంది. దానిని గంధంతో కలిపి సంతానం లేనివారు సేవిస్తే సంతానం కలుగుతుందంటారు.
శని, ఆది, సోమవారాలలో స్వామికి అభిషేకం జరిగిన తర్వాత మాత్రమే ఈ

ద్రవాన్ని కోరినవారికి ఇస్తారు. చిన్న గుట్టమీద వున్న ఈ ఆలయం చేరుకోవటానికి 130 మెట్లు ఎక్కాలి. మొదట్లో స్వయంభూ ఆంజనేయస్వామిని దర్శించుకోవచ్చు. పైన స్వామి

ఆలయానికిరుపక్కలా అమ్మవార్లు ఆదిలక్ష్మి, చెంచు లక్ష్మిల ఉపాలయాలను తర్వాత నిర్మించారు. అసలు ఆలయం 2వ శతాబ్దంనాటిదంటారు. ఇప్పుడిప్పుడే ప్రసిధ్ధికెక్కుతున్న

ఈ ఆలయం దగ్గర కోతులు ఎక్కువగా వున్నాయి.

చింతామణి జలపాతం :
ఆలయం సమీపంలోనే వున్న ఈ జలపాతంలోని నీరు అద్భుత ఔషధ గుణాలుగలదనీ, దీనిని సేవిస్తే అనేక రుగ్మతలు

తొలగిపోతోయనీ విశ్వసిస్తారు. కారణం ఈ నీరు అనేక ఔషధ మొక్కలను ఒరుసుకుంటూ ప్రవహిస్తుంది. జలపాతం అన్నానని ఎత్తుమీదనుంచి దూకే ప్రవాహాన్ని ఊహించుకోకండి. అత

సన్నటి ధార మాత్రమే. దీనిని అనేకమంది సీసాలలో తీసుకెళ్లి (కావాల్సినవాళ్ళు సీసాలు తమతో తీసుకెళ్ళాలి..అక్కడ దొరకవు) రోజూ ఔషధంలాగా సేవిస్తారు.

దర్శన సమయాలు

:

ఉదయం 10 à°—à°‚. లనుంచీ సాయంత్రం 4 à°—à°‚.లదాకా. మధ్యలో 1 à°—à°‚à°Ÿ  విరామం.

 

https://youtu.be/4czACSAO9OE

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam