DNS Media | Latest News, Breaking News And Update In Telugu

36 మంది ఐఏఎస్ ల బదిలీ :  విశాఖ నుంచే ప్రక్షాళనకు శ్రీకారం 

విశాఖ కలెక్టర్ బదిలీ పై అధికార పార్టీ నేతల ఒత్తిడి?

విశాఖపట్నం, జూన్  4 , 2019 (DNS Online ) : ఆంధ్ర ప్రదేశ్ లో భారీ à°—à°¾ ఐఏఎస్ అధికారులకు స్దాన చలనం కల్గింది. నూతన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విశాఖ పర్యటనలో ఆధ్యాత్మిక గురువుల దర్శనం అనంతరం రాష్ట్ర ప్రక్షాళన కార్యక్రమాన్ని ఆరంభించినట్టు

తెలుస్తోంది. à°—à°¤ ఎన్నికల సమయంలో ప్రస్తుత అధికార పార్టీ à°•à°¿ చుక్కలు చూపించిన వారిని ఆయా స్థానాల నుంచి బదిలీ చేసి, కొందరికి  à°à°®à°¾à°¤à±à°°à°‚ అధికార ప్రాధాన్యత లేని

స్థానాల్లో పోస్టింగ్ మరికొందరికి వెయిటింగ్ లో పెట్టడం జరిగింది. దీంతో రాష్ట్రంలో గత ప్రభుత్వంతో సన్నిహిత బంధాలు కల్గిన వారికి ఇరకాటం లో పెట్టినట్టయింది.

ప్రధానంగా విశాఖ జిల్లాలో ఏర్పడిన కీలక విభేదాల కారణంగా ప్రస్తుత అధికార పార్టీకి జిల్లా కలెక్టర్ ఎన్నికల్లో చుక్కలు చూపించిన సందర్భలపై సీనియర్ నేతలు,

అభ్యర్థులు బహిరంగానే మండిపడ్డారు. పైగా ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు సైతం చేయడం జరిగింది. ఈ బదిలీల్లో విశాఖ జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ పేరు కూడా

ఉండడంతో పాటు ప్రాధాన్యత లేని క్రీడా ప్రాధికార సంస్థకు ఎండి గా బదిలీ వేటు పడింది. ఈయన స్థానంలో వాడ్రేవు వినయ్ చాంద్ ను విశాఖ జిల్లా కలెక్టర్ గా నియమించింది

ప్రభుత్వం. అయితే కాటంనేని భాస్కర్ ఈ విధమైన పరిణామాలను గమనించే తనను కేంద్ర సర్వీసులకు పంపాలంటూ ఎన్నికల ముందే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే దానిపై

ఎటువంటి నిర్ణయం రాకపోవడం తో ఈ బదిలీ జరిగింది. విశాఖ జిల్లా కలెక్టర్ గా కాటంనేని భాస్కర్ భాద్యతలు చేపట్టి ఏడాది కాక ముందే బదిలీ వేటు పడడం పై అధికార పార్టీ

నేతల ప్రభావం ఉన్నట్టే కనిపిస్తోంది. .

మంగళవారం బదిలీ అయినా అధికారుల వివరాలివే. . .

ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వెంకటేశ్వర ప్రసాద్.
/> ఈఎఫ్ఎస్ అండ్ టీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్.
జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాధ్ దాస్.
వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా

పూనం మానకొండయ్య
బీసీ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కరకాల వలవన్.
పరిశ్రమలు పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శిగా రజత్ భార్గవ.
వైద్యారోగ్య శాఖ ముఖ్య

కార్యదర్శిగా జవహర్ రెడ్డి.
గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా అనంత రాము.
యూత్ సర్వీసెస్, టూరిజం ప్రవీణ్ కుమార్.
పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్.
/> ట్రాన్స్ పోర్ట్, ఆర్ అండ్ బీ కృష్ణబాబు.
స్త్రీ శిశు సంక్షేమ ముఖ్య కార్యదర్శిగా దయమంతి.
పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా శ్యామలరావు.
ట్రాన్స్ కో ఎండీగా

నాగులాపల్లి శ్రీకాంత్.
ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఎంకే మీనా.
జెన్కో ఎండీగా బి. శ్రీధర్.
ఏహెచ్డీడీ అండ్ ఎఫ్ సెక్రటరీగా వెంకటేశ్వర ప్రసాద్.
/> సివిల్ సప్లైస్ కమిషనరుగా కోన శశిధర్.
హోం సెక్రటరీగా కిషోర్ కుమార్.
వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా మధుసూదన్ రెడ్డి
 à°…జేయ్ జైన్ జీఏడీకి అటాచ్.
జీఏడీ

ముఖ్య కార్యదర్శిగా ఆర్పీ సిసోడియా.
విజయానంద్ జీఏడీకి అటాచ్.
శాప్ ఎండీగా కాటంనేని భాస్కర్.
మార్కెటింగ్ స్పెషల్ కమిషనరుగా ప్రద్యుమ్న
ఎక్సైజ్ కమిషనర్ ఎం

ఎం నాయక్.
సాంఘీక సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్షవర్ధన్.
వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రవీణ్ కుమార్.
సీఎం ఓఎస్డీగా జే. మురళీ.
సీఆర్డీఏ అడిషనల్ కమిషనరుగా విజయ.
/> ట్రాన్సపోర్ట్ కమిషనరుగా పీఎస్సార్ ఆంజనేయులు.
హర్టీకల్చర్.. సెరీకల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి.
వాణిజ్య పన్నుల శాఖ కమిషనరుగా పీయూష్ కుమార్.
ఇంటర్ విద్య

కమిషనరుగా కాంతిలాల్ దండే.
మున్సిపల్ శాఖ కమిషనరుగా విజయ్ కుమార్.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనరుగా గిరిజా శంకర్
సీఆర్డీఏ కమిషనరుగా లక్ష్మీ

నరసింహం.

#dns  #dnsnews  #dnsonline  #dnsmedia  #dnsnewsline  #dnslive  #visakhapatnam  #vizag  #collector  #IAS  #YSR   #katamaneni  #bhaskar  #vinay  #chand 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam