DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్ సైన్యం వీరే : బుగ్గన కు ఆర్థికం. సుచరితకు హోమ్ శాఖ?

25 మందితో జగన్ కేబినెట్ ప్రమాణ స్వీకారం 

బుగ్గన కు ఆర్థికం. సుచరితకు హోమ్ శాఖ? .

అమరావతి, జూన్ 8 , 2019 (DNS Online ): రెండు దశాబ్దాలుగా లక్షలాది మంది వైఎస్ రాజశేఖర్

రెడ్డి అభిమానులు ఆశించిన శుభతరుణం శనివారం నెరవేరింది. ఇటీవల జరిగిన ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో సునామీ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

అధికారం లోకి వచ్చి నూతన మంత్రి వర్గం ఏర్పాటయింది. గత నెల 30 న విభక్త ఆంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి గా భాద్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం తన

తొలి మంత్రివర్గాన్ని ప్రకటించారు. మొత్తం 25 మందిని మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. వీరందరితో రాష్ట్ర గవర్నర్ ఈ ఎస్ ఎల్ నర్సింహాన్ ప్రమాణ స్వీకారం

చేయించారు. కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం నిర్వహించారు.   
వీరిలో అత్యధికులు విద్యాధికులు, వ్యాపారవేత్తలూ కావడం గమనార్హం. ఈ

మంత్రివర్గ కూర్పు లో అన్ని సామాజిక వర్గాల వారికీ అవకాశం కల్పించామని చెప్తున్నప్పటికీ కొందరిలో అసంతృప్తి ఉంది కానీ, బయట పడడం లేదు. వీరిలో గతంలో మంత్రులుగా

పనిచేసిన అనుభవం ఉన్నవారూ ఉన్నారు, కొత్తగా ఎమ్మెల్యే అయినా వారూ ఉన్నారు, ఓడిపోయినా వారూ ఉన్నారు.  à°…ందరిలోకి అత్యంత వయోధికులు నారాయణ స్వామి (70 ఏళ్ళు) కాగా

అత్యంతాయి చిన్న వయస్కులు పుష్పాల శ్రీవాణి (33 ఏళ్ళు).  à°ˆà°°à±‹à°œà± ప్రమాణ స్వీకారం చేసిన వారు . . . వీరిలో బుగ్గన రాజేంద్రనాధ్ కు ఆర్ధిక శాఖ, సుచరితకు హోమ్ శాఖ,  à°—తం లో

పాత్రికేయునిగా విధులు నిర్వహించిన కన్నబాబు కు సమాచార శాఖ  à°²à°­à°¿à°‚చే అవకాశం ఉంది. మొత్తం ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కూడా లభించనుంది. 

1. ధర్మాన

కృష్ణదాస్‌ ( నర్సన్నపేట- శ్రీకాకుళం ) : బి à°ˆ
2. బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి - విజయనగరం) :
3. పాముల పుష్పశ్రీవాణి (కురుపాం- విజయనగరం) : 33 ఏళ్ళు : బి ఎస్సీ బి ఈడి  ( మాజీ మంత్రి

శత్రుచర్ల విజయ రామరాజు    à°¸à±‹à°¦à°°à±à°¨à°¿ కోడలు ),
4. ముత్తంశెట్టి (అవంతి ) శ్రీనివాస్‌ (భీమిలి - విశాఖపట్నం) : ఇంటర్ 
5. కురసాల కన్నబాబు(కాకినాడ రూరల్‌ - తూర్పు గోదావరి) :à°Žà°‚ ఏ

జర్నలిజం  
6. పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ (ఎమ్మెల్సీ - తూర్పు గోదావరి) : 
7. పినిపి విశ్వరూప్‌ (అమలాపురం - తూర్పు గోదావరి) : బి ఎస్ సి బి ఈడి, 
8. ఆళ్ల  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à± (నాని)

(ఏలూరు - పశ్చిమ గోదావరి) : బి. కామ్. , 
9. చెరుకువాడ శ్రీరంగరాజు(ఆచంట - పశ్చిమ గోదావరి) : వ్యవసాయ, వ్యాపారం
10. తానేటి వనిత (కొవ్వూరు- పశ్చిమ గోదావరి) : : à°Žà°‚ ఎస్సీ, 
11. కొడాలి

వెంకటేశ్వర రావు ( నాని ) (గుడివాడ- కృష్ణ ) :
12 .పేర్ని వెంకట్రామయ్య (నాని) మచిలీపట్టణం - కృష్ణ జిల్లా, 
13. వెల్లంపల్లి శ్రీనివాస రావు  (విజయవాడ పశ్చిమ- కృష్ణ ) :
14. మేకతోటి

సుచరిత (ప్రత్తిపాడు- గుంటూరు ) : Dr ఆయుర్వేద,  
15. మోపిదేవి వెంకటరమణ  ( గుంటూరు )  : 
16. బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి (ఒంగోలు - ప్రకాశం) :
17. ఆదిమూలపు సురేష్ (ఎర్రగొండపాలెం -

ప్రకాశం) : ఎంటెక్, 
18. అనిల్ కుమార్ యాదవ్ (నెల్లూరు సిటీ) :  BDS (దంత వైదులు), 
19. మేక‌పాటి గౌతంరెడ్డి( ఆత్మ‌కూరు- నెల్లూరు ): MSC -UK, 
20. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

(పుంగనూరు) :  MA PhD , 
21. నారాయణస్వామి (గంగాధర నెల్లూరు) :  : (70 ఏళ్ళు )
22. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ( డోన్- కర్నూలు ) : : BTech ,
23. గుమ్మనూరు జయరాం (ఆలూరు- కర్నూలు )  : : 10 th ,
24. అంజాద్ భాషా (కడప -

à°•à°¡à°ª)  : ఇంటర్, 
25. మాల‌గుండ్ల‌ శంకర్ నారాయణ (పెనుకొండ - అనంతపురం)

 

#dns   #dnsnew  #dnsonline  #dnslive  #dnsmedia  #dnssource   #dnsnews  #vizag   #visakhapatnam   #andhra   #pradesh   #AP   #cabinet  #YSR   #YS   #Jagan   #Moihan   #governor   #vijayawada  #amaravati

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 4, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam