DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశిష్టాద్వైత దీక్షా కంకణ దారులు నమ్మాళ్వార్లు 

కేవలం జ్ఞాన దృష్టితోనే 108 దివ్య క్షేత్రాలను దర్శింప చేసిన ఆచార్యులు 

జేష్ఠ మాస విశాఖ నక్షత్రం రోజున నమ్మాళ్వార్ తిరునక్షత్రం

శ్రీమహావిష్ణువు

విశ్వక్సేనునుని అంశే à°ˆ నమ్మాళ్వార్లు . . 

విశాఖపట్నం, జూన్ 15 , 2019 (DNS Online ): శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఆళ్వార్లకు ఉన్న స్థానం చాల విశిష్టమైనది. శ్రీమహా విష్ణువు ను

వేనోళ్ళ కీర్తించి మంగళశాసనములు చేసిన మహనీయులు 12 మంది భక్తాగ్రేసరులు ఉన్నారు. వారినే ఆళ్వార్లు అని పిలుస్తారు. వారిలో అగ్రగణ్యులు నమ్మాళ్వార్లు. వీరు

శ్రీమహావిష్ణువు సైన్యాధ్యక్షులు విశ్వక్షేనుల అంశతో ఈ భూమిపై అవతరించినట్టు ఆధారాలున్నాయి. ఇదే విషయాన్నీ భగవద్రామానుజులు ప్రకటించారు. జేష్ఠ మాస విశాఖ

నక్షత్రం రోజున అయన à°ˆ భూమిపై అవతరించారు. ఈరోజున నమ్మాళ్వార్ తిరునక్షత్రంగా  à°…న్ని శ్రీవైష్ణవ ఆలయాల్లోనూ అత్యంత వైభవంగా మహోత్సవాలు, వేడుకలు

నిర్వహిస్తుంటారు. నమ్మాళ్వార్ల తిరునక్షత్ర, పరమ పదోత్సవాలను నిర్వహించే ప్రతి ఆలయాన్ని దివ్యా క్షేత్రంగానే భావిస్తుంటారు. ఈ సందర్బంగా వారి ని గూర్చిన

విశేషాలు అందిస్తున్నాం. .

భక్తుల నమ్మకం ప్రకారం నమ్మాళ్వారు ...

క్రీ.à°¶ 6à°µ శతాబ్దం తమిళనాడు రాష్ట్రంలోని ఇప్పటి ‘ఆళ్వార్‌తిరునగరి’ అనే ప్రాంతంలో

జన్మించారు నమ్మాళ్వార్లు.  à°µà±€à°°à± జన్మించే నాటికి దేశంలో అన్యమతాల ప్రభావం, పరస్పర విరుద్ధమైన సంప్రదాయాల  à°ªà±à°°à°­à°¾à°µà°‚తో ధార్మిక వ్యవస్థ అగమ్యగోచరంగా తయారైంది. à°ˆ

సందిగ్ధాన్ని ఛేదించి, మార్గంలో పెట్టేందుకు వీరు జ్ఞాన ముద్రలోనే సంకల్పించారు. 

పుట్టిన క్షణం నుంచి అందరి పిల్లల్లా ఏడవటం కానీ, పాలు తాగడం కానీ, కనీసం

కళ్లు తెరవడం కానీ చేయలేదు. పిల్లవాడిలో ఎలాంటి ప్రతిస్పందనా కనిపించకపోవడంతో à°† చిన్నారి సామాన్యులు కాదు అని భావించారు తల్లిదండ్రులు.  à°à°®à±€ చెయ్యలేని

పరిస్థితుల్లో à°† చిన్నారిని ని  à°¤à°® à°Šà°°à°¿ దైవమైన  à°†à°¦à°¿à°¨à°¾à°¥à°°à±‌ పాదాల చెంత ఉంచారు. ఆశ్చర్యకరంగా అక్కడి నుంచి లేచి వెళ్లి, గుడి ఆవరణలో ఉన్న చింతచెట్టు వద్ద పద్మాసనం

వేసుకుని ఉండిపోయాడు.  à°…లా 16 సంవత్సరాలు అసలు నోటి వెంట ఒక్క మాట కూడా రాక పోవడం గమనార్హం. అలా పదహారు సంవత్సరాలపాటు నమ్మాళ్వారు à°† చింతచెట్టు కిందనే తీవ్రమైన

ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు. .

మధురకవుల దర్శనం...:

అదే సమయంలో ఉత్తరాదిన తీర్థయాత్రలు చేస్తున్న మధురకవి అనే పండితునికి దక్షిణాది ప్రాంతం నుంచి ఒక

వింత కాంతి కనిపించసాగింది. ఆ కాంతిని అనుసరిస్తూ వచ్చిన మధురకవి ఆళ్వార్ తిరునగరి కి చేరుకున్నారు. అది నమ్మాళ్వారు నుంచి వెలువడుతోందని తెలిసింది. ఆ

యువకుడిలోని జ్ఞానాన్ని పరీక్షించాలనుకున్న మధురకవి, శాస్త్రాలలోనే అత్యంత క్లిష్టమైన ప్రశ్నలను సంధించాడు. వాటికి అద్భుతమైన జవాబులను ఇవ్వడం ద్వారా తన

సుదీర్ఘమైన మౌనాన్ని విడిచారు నమ్మాళ్వారు.  à°¦à±€à°‚తో తన గమ్యస్థానం ఇదేనని మధురవకవి ఇక్కడే ఉండిపోయారు. నమ్మాళ్వార్లు ఆశువుగా చెప్పిన విషయాలు, పాశురాలను అక్షర

లిఖితం చేసి, ప్రస్తుత సమాజానికి అందించారు. శిష్యుని దీక్ష ను గ్రహించిన నమ్మాళ్వార్లు భావి తరంలో ఈ దేశాన్ని సంస్కరించేందుకు అవిభావించే మహనీయుల రూపాన్ని

మధువారకవులకి ప్రసాదించారు. ప్రస్తుతం లభిస్తున్న పాశురాలను అక్షరబద్దం చేసింది మధురకవులే కావడం గమనార్హం. నమ్మాళ్వార్ల నోటి వెంట వెలువడిన గ్రంధాల్లో

సంస్కృతంలోని నాలుగువేదాలకు ప్రతిరూపంగా తమిళంలో వ్యాఖ్యానం ప్రఖ్యాతి గాంచింది. ఇవే . .  à°¤à°¿à°°à± విరుత్తం,  à°¤à°¿à°°à± వాశీరియం, పెరియ తిరువందాది,  à°¤à°¿à°°à±à°µà°¾à°¯à± మొళి .

.

జ్ఞాన నేత్రం తోనే ఆలయాల దర్శనం .. .

విశిష్టాద్వైత సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన ఆలయాలను దివ్యక్షేత్రాలు అని వ్యవహరిస్తుంటారు. ఇలాంటివి మొత్తం 108

దివ్యక్షేత్రాలు కాగా, కేవలం 107 ఆలయాలు ఈ భూమండలంపై ఉండగా, ఒక్క క్షేత్రం ( పరమపదం) మాత్రం వైకుంఠం లో ఉంటుంది. వీటన్నింటీ దర్శించడం ప్రతి ఒక్క భక్తుని చిరకాల

వాంఛ. ప్రస్తుత సమాజంలో రవాణా సదుపాయాలు పెరిగిన సందర్భంలో వాటిని  à°¸à±à°²à±à°µà±à°—à°¾ చూడవచ్చు.  à°…యితే పూర్వకాలంలో రవాణా సౌకర్యాలు లేని సమయంలోనే కేవలం కూర్చున్న చోటు

నుంచే తన జ్ఞాన నేత్రం తో దర్శించి, వాటి వైభవాలను భక్తులకు ప్రత్యక్ష దర్శనం చేయించిన మహనీయులు నమ్మాళ్వార్లు. 

వైష్ణవ దివ్య క్షేత్రాలైన 108 దివ్యదేశాలలో ఏ

ఒక్కదానినీ నమ్మాళ్వారు చూసి ఉండలేదు. కానీ వాటన్నింటినీ ఆయన తన పాశురాలలో కళ్లకు కట్టినట్లుగా వర్ణించడం చూస్తే, ఆయన తన ధ్యానంలోనే వాటిని దర్శించారని

తోస్తుంది. వీటన్నింటిలోకీ వైశాఖమాసంలో జరిగే గరుడసేవ ఉత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉంది. తమిళనాడులోని తిరువన్వేలి- తిరుచెందూరుల మధ్య 9 ప్రముఖ వైష్ణవాలయాలు

ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి ‘నవతిరుపతి’ అంటారు. వైశాఖమాసంలో జరిగే గరుడోత్సవంలో నమ్మాళ్వారు విగ్రహాన్ని పాడిపంటల మధ్య నుంచీ à°ˆ తొమ్మిది క్షేత్రాల దగ్గరకు

తీసుకువెళ్తారు. ఇలా ఒకో క్షేత్రం వద్దకి చేరుకున్నప్పుడు ఆ ఆలయం మీద నమ్మాళ్వారువారు రాసిన పాశురాలను చదువుతారు.

వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత వీరిదే . .

:

శ్రీవైష్ణవ ఆలయాల్లో జరిగే అత్యంత ప్రాధాన్యత కల్గిన ఉత్సవాలు వైకుంఠ ఏకాదశి. ఆ రోజునే నమ్మాళ్వారు ( అతి చిన్న వయసులోనే ) పరమపదించినట్టు తెలుస్తోంది.

వైష్ణవులకు పుణ్యప్రదమైన వైకుంఠ ఏకాదశినాడు నమ్మాళ్వారు నేరుగా వైకుంఠాన్ని చేరుకున్నారట. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వైకుంఠ ఏకాదశినాడు శ్రీరంగంలో

గొప్ప ఉత్సవాన్ని జరుపుతారు. 

 

#dns #dnslive  #dnsonline  #dnsmedia  #dnsnews  #dnstime  #vizag  #visakhapatnam  #nammalvar  #nammalwar  #temples  #festival  #vaikuntha  #ekadashi  #tamlnadu  #media  #news  #online  #live  
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam