DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇక పై ఝార్ఖండ్ లోనూ జిసిసి ఉత్పత్తుల అమ్మకం 

గిరిజన సంక్షేమమే లక్ష్యం.: జిసిసి à°Žà°‚à°¡à°¿ బాబూరావు 

విశాఖపట్నం, జూన్ 22, 2019 (DNS Online ) : ఇక నుంచి ఝార్ఖండ్ రాష్ట్రం లోనూ గిరిజన సహకార సంక్షేమ సంఘం ఉత్పత్తులు

విక్రయాలు జరపనున్నట్టు జిసిసి ఎండి టి. బాబురావు నాయుడు తెలియచేసారు. శనివారం నగరం లోని జిసిసి ప్రధాన కార్యాలయం లో ఝార్ఖండ్ కు చెందిన ఝార్ఖండ్ మార్కెటింగ్

కోపరేటివ్ ఫెడరేషన్ ( ఝాముకో ఫెడ్)  à°®à±‡à°¨à±‡à°œà°¿à°‚గ్ డైరక్టర్ జైదీప్ ప్రసాద్ సింగ్ , ఇతర ఉన్నతాధికారులతో చర్చులు జరిపినట్టు తెలిపారు. 

ఈ సందర్బంగా బాబురావు

నాయుడు జిసిసి చేపడుతున్న వివిధ ఉత్పత్తుల పోషణ, వాటి విక్రయాలు, విక్రయ కేంద్రాల నిర్వహణ తదితర అంశాలను పర్యాటక కమిటీ కి వివరించారు. అటవీ ఫల సాయాల సేకరణ, విలువ

హెచ్చింపు, రిటైల్ వస్తువు విక్రయాలు, కాఫీ దుకాణాల ఏర్పాట్లు, గ్యాస్, పెట్రోల్ బంక్ ల నిర్వహణ తదితర అంశాలను వివరించారు. తమ రాష్ట్రం లో అందుబాటులో ఉన్న గిరిజన

ఉత్పత్తులను ఆంధ్ర ప్రదేశ్ లోనూ విక్రయాలు సాగించాలని, అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లోని గిరిజన ఉత్పత్తులను ఝార్ఖండ్ ప్రజలకు అందించాలని వారు కోరినట్టు

తెలిసింది. ఝార్ఖండ్ లో విస్తారంగా లభించే కరంజి తేనే ను టోకుగా ఆంధ్ర కు తీసుకు రావడానికి, జిసిసి ఉత్పత్తులను ఝార్ఖండ్ లో విక్రయించాలని, అరకు కాఫీ ని

ప్రధానంగా ప్రచారం కల్పించాలని చర్చించారు. à°ˆ సమావేశం లో చంద్ర శేఖర్ తివారి, సికందర్ కుమార్ సింగ్, ఓంకార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam