DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విజయవాడ పశ్చిమ ను  ఆదర్శంగా తీర్చిదిద్దుతా: మంత్రి వెల్లంపల్లి 

దేవాదాయ శాఖా  à°®à°‚త్రి వెల్లంపల్లి  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à°°à°¾à°µà±..

రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చెయ్యాలి, అధికారులకు ఆదేశాలు 

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం గా

పర్యటన ..

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) 

విజయవాడ, జూలై 03, 2019 (డిఎన్‌ఎస్‌) : విజయవాడ పశ్చిమ నియోజక వర్గాన్ని ఆంధ్ర ప్రదేశ్ లోనే ఆదర్శంగా

తీర్చిదిద్దుతామని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం నిజాయక వర్గంలో పర్యటించిన ఆయన రహదారు లు అద్వానంగా ఉన్నాయని, పక్కా

రోడ్ల నిర్మాణం వెంటనే పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్య ల పరిష్కారమే లక్ష్యం గా విజయవాడ పశ్చిమ నియోజక వర్గం లో విజయవాడ నగర పాలక సంస్థ

కమిషనర్, ఇతర  à°…ధికారులతో కలిసి à°†à°¯à°¨ పర్యటించారు. à°ˆ సందర్భగా స్థానికులు పలు సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకువచ్చారు. à°—à°¤ ఐదు సంవత్సరాలు à°—à°¾ రహదారులు గోతులతో

అద్వానం గా ఉన్నాయని వాహన దారులే కాక పాద చారులు కూడా నడిచే పరిస్థితి లేదన్నారు. ముఖ్యం గా రమణయ్య కూల్ డ్రింక్ షాప్ సెంటర్ వద్ద నుంచి అర్ అప్పారావు వీధి, పార్క్

రోడ్, పోతిన ప్రకాష్ మార్కెట్ రోడ్ వెంటనే పక్కా రహదారుల నిర్మాణం చేపట్టాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. నియోజక వర్గంలోని  à°¸à±ˆà°¡à± కాలువలు మరియు మెయిన్

డ్రైన్ లలో మురుగు పుడికలను వెంటనే తొలగించాలన్నారు. వన్ టౌన్, నైజాం గేట్, ఊర్మిళ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షపు నీటి  à°¡à±ˆà°µà°°à±à°·à°¨à± పనులు అసంపూర్తి à°—à°¾ ఉన్నాయని

వీటిని త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రోటరీ నగర్ నుంచి కబెళా మీదుగా రామరాజ్య నగర్ తదితర ప్రాంతాల్లో ముంపు కు గురి కాకుండా వర్షపు నీరు పారుదల కు

అనుగుణంగా కాలువలను వెడల్పు చేసే పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రజలు మానసిక శారీరక వికాసానికి నిలయమైన గాంధీ పార్క్ వంటి పార్క్ స్థలాల్లో అవసరమైన

చిన్నారులు ఆడుకునే అట వస్తువులతో పాటు జిమ్ కు అవసరమైన సామాగ్రిని సమకూర్చాలని నగర పాలక సంస్థ అధికారులకు ఆదేశించారు. కబెలా సెంటర్ లో ఉన్న ఉర్దూ గవర్నమెంట్

జూనియర్ కళాశాలను,  à°µà°¿à°‚à°šà°¿ పేటలో ఉన్న ఉర్దూ స్కూల్ లో ఖాళి భవనంలోకి మార్పు చెయ్యాలని కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు కోరికను పరిశీలిస్తామన్నారు.

పర్యటనలో బాగంగా ఉర్దూ స్కూల్ మరియు కాలేజ్ ను సందర్శించిన మంత్రి  à°‰à°°à±à°¦à±‚ స్కూల్ కు కావలసిన మౌలిక సదుపాయాలను ఎర్పాటు చెయ్యాలని విద్యాశాఖ అధికారులను

ఆదేశించారు.
పర్యటనలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వేంకటేశ్, ఎస్.ఇ. రామ్ మూర్తి, చీప్ మెడికల్ అధికారి డా. కే అర్జున్ రావు, ఎగ్జక్యూటివ్ ఇంజనీర్

కోటేశ్వర రావు, మరియు ఇతర అధికారులు పర్యటించారు.  à°®à°‚త్రి వెంట వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అసిఫ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు

దుర్గా రావు, నగర కార్యదర్శి పదిలం రాజశేఖర్,అప్పాజీ, వెన్నం రజనీ, కురాకుల నాగ, గ్రంది బుజ్జి, పోలిమెట్ల శరత్, మజ్జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam