DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రెండు నెలల్లో  ఇళ్ల నిర్మాణాలు పూర్తికావాలి : శ్రీకాకుళం కలెక్టర్ నివాస్ 

60 రోజుల్లోగా  à°¶à°¤à°¶à°¾à°¤à°‚ గృహనిర్మాణాలు పూర్తికావాలి.

ప్రతీ ఇంటికి మరుగుదొడ్డిని నిర్మించాలి.

నిర్మాణాలు పూర్తయిన గృహాలకు బిల్లులు

చెల్లించాలి.

గృహాల మంజూరులో జవాబుదారీతనం ఉండాలి. . . .

శ్రీకాకుళం, జూలై 03, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ గృహ నిర్మాణాలు చేపట్టి నిలిచిపోయిన పనులను ఆగష్ట్ 31

లోగా పూర్తిచేయాలని , అలాచేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ హెచ్చరించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ

మందిరంలో జిల్లాలో చేపట్టిన గృహ నిర్మాణపు పనులపై 
గృహ నిర్మాణ శాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013-14 నుండి 2019-20 సం.రం

వరకు జిల్లాలో 1,43,144 గృహాలు కేటాయించగా అందులో 1,25,747 గృహాలను మంజూరుచేయడం జరిగిందన్నారు. ఇందులో వివిధ గృహనిర్మాణ పథకాలతో పాటు పి.à°Žà°‚.ఏ.వై – జి, పి.à°Žà°‚.ఏ.వై – యు  à°¬à°¿.యల్.సి

 à°ªà°¥à°•à°‚ క్రింద 12,776 గృహాలు, à°Šà°¡à°¾ పి.à°Žà°‚.ఏ.వై ( అర్బన్ ) క్రింద 17,217, హుద్ హుద్ తుఫాను బాధితుల కొరకు 2,334 గృహాలు వెరశి 1,25,747 గృహాలను నిర్మించవలసిఉన్నప్పటికీ  à°•à±‡à°µà°²à°‚ 27,673 గృహాలను మాత్రమే

పూర్తిచేయడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేసారు.  à°—ృహ నిర్మాణపు పనుల కొరకు à°ˆ ఏడాది జనవరి మాసంలోనే మంజూరు ఉత్తర్వులు జారీచేసామని, ఇప్పటికి 6 మాసాలు

గడిచినప్పటికీ ఎటువంటి పురోగతి లేదన్నారు.. ఎన్నికల ప్రక్రియ కారణంగా గృహ నిర్మాణపు పనులు నిలిచిపోకూడదనే ఉద్దేశ్యంతో ముందుగానే గృహనిర్మాణ శాఖాధికారులకు

లక్ష్యాలను నిర్ధేశించినప్పటికీ ఎటువంటి పురోగతి లేదన్నారు. ఇంతవరకు పనులు చేపట్టకపోవడానికి గల కారణాలపై మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు. ఇప్పటివరకు

మంజూరుచేసిన గృహ లబ్ధిదారుల ఖాతాల వివరాలు కూడా తీసుకోకపోవడంపై అధికారులపై మండిపడ్డారు. ఇలా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో మంజూరు చేసిన గృహాలకు

సంబంధించి లబ్ధిదారుల ఖాతాలు వివరాలు 15 రోజుల్లోగా సేకరించాలని చెప్పారు. జిల్లాలో పనులు ప్రారంభించి నిలిచిపోయిన 52,592 గృహాలతో పాటు ఇంతవరకు పనులు ప్రారంభించని

గృహాలను వచ్చే ఆగష్ట్ 31లోగా పూర్తిచేయాలన్నారు. గృహ నిర్మాణపు పనులను పూర్తిచేసేందుకు  à°‡à°‚à°•à°¾ 60 రోజులు సమయం ఉన్నందున తక్షణమే పనులను ప్రారంభించి, శతశాతం

పూర్తిచేయాలని, అలాచేయని అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్  à°¹à±†à°šà±à°šà°°à°¿à°‚చారు. గృహాల మంజూరులో అధికారులు ఎటువంటి అవకతవకలకు పాల్పడరాదని, జవాబుదారీతనంతో

పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేసారు. గృహ నిర్మాణపు బిల్లుల చెల్లింపుల్లో అధికారులపై ఫిర్యాదులు వస్తున్నాయని,  అలా ఫిర్యాదులు వచ్చిన అధికారులపై à°•à° à°¿à°¨ చర్యలు

తీసుకుంటామన్నారు. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెడతామని హెచ్చరించారు. అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని, ఇచ్చిన లక్ష్యాలను సకాలంలో పూర్తిచేసి, గృహ

వివరాలను  à°Žà°ªà±à°ªà°Ÿà°¿à°•à°ªà±à°ªà±à°¡à± ఆన్ లైన్ లో నమోదుచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. నిర్మాణాలు పూర్తయిన గృహాలకు బిల్లులు కూడా తక్షణమే చెల్లించేలా చర్యలు

తీసుకోవాలన్నారు. జిల్లాలో 13 వేల వరకు మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తికావలసి ఉందని, గృహ నిర్మాణ శాఖ ద్వారా చేపడుతున్న ప్రతీ గృహానికి మరుగుదొడ్డి తప్పనిసరిగా

నిర్మించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  à°¤à°¿à°¤à°¿à°²à±€ తుఫానులో పూర్తిగా ధ్వంసమైన, పాక్షికంగా నష్టపోయి ఎటువంటి చెల్లింపులు చేయని గృహ లబ్ధిదారులు ఎవరైనా

ఉంటే వారి వివరాలను  15 రోజుల్లోగా సమర్పించాలని కలెక్టర్ కోరారు.

గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు టి.వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ గృహ నిర్మాణ

పథకాల క్రింద 14 చోట్ల ప్రోజెక్ట్ పనులు ప్రారంభించామని, ఇందులో 11 ప్రోజెక్టులను పూర్తిచేయడం జరిగిందన్నారు. ఇంకా సోంపేట , టెక్కలి మండలం రఘునాథపురం, ఎచ్చెర్ల

మండలం బడేవానిపేట గ్రామాలలో పనులు పూర్తిచేయాల్సి ఉందన్నారు. వీటిని త్వరలోనే పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

ఈ సమావేశంలో ఐ.టి.డి.ఏ

ప్రోజెక్ట్ అధికారి సి.ఎం.సాయికాంత వర్మ, గృహ నిర్మాణ శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్లు, ఉపకార్యనిర్వాహక ఇంజినీర్లు శ్రీనివాసరావు, రంగారావు, నాగేశ్వరరావు,

అప్పారావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

#dns  #dnslive  #dnsonline  #dnsnews  #dnsmedia  #vizag  #visakhapatnam  #vijayawada  #amaravati  #srikakulam  #nivas  #nivas  #andhra  #pradesh  #housing  #scheme

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam