DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తొలి ఏకాదశి - ఒక్కరోజు నియమం  ఏడాది ఫలితం 

శయన ఏకాదశి తో చాతుర్మాస్య దీక్ష ఆరంభం,..

(రిపోర్ట్ : సాయిరామ్ చిలకమఱ్ఱి, బ్యూరో,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, జూలై 12, 2019  (డిఎన్‌ఎస్‌) : ఆషాఢ శుద్ధ శయన ఏకాదశి

అత్యంత పవిత్రమైన రోజు. దీనికే తొలి ఏకాదశి, అని కూడా పేరు. ఈ రోజునుంచే యతీశ్వరులు చాతుర్మాస్య దీక్ష ప్రారంభిస్తుంటారు. ఆషాఢమాసం పౌర్ణమికి ముందు వచ్చే

ఏకాదశిని, తొలి ఏకాదశి పర్వదినంలా జరుపుకుంటారు. శ్రీ వైష్ణవ ఆలయాల్లోనూ, శ్రీవైష్ణవ సాంప్రదాయ పరులు ఈ రోజునుంచి ప్రబంధ పారాయణాలు ప్రారంభించడం

జరుగుతుంది. 

యోగ నిద్ర ఆరంభం. : 

సమస్త లోకాలను రక్షించే శ్రీమన్నారాయణుడు ఒక్క క్షణం విశ్రమించేందుకు యోగ నిద్రలోకి వెళ్లే కాలం ఇది. కేవలం కళ్ళు

మూసుకుని మాత్రమే ఉండే సమయం. నాలుగు నెలల కాలం పాటు లోక రక్షణ భాద్యతను అమ్మవారు తీసుకుంటుంది.  à°ªà±à°°à°¾à°£ కథనాలను అనుసరించి, విష్ణుమూర్తి క్షీర సాగరంలో శేషతల్పం

మీద  à°ªà°¡à±à°•à±à°¨à°¿ తొలి ఏకాదశినాడు నిద్రకు ఉపక్రమించాడట. అలా పడుకున్న విష్ణుమూర్తి నాలుగు నెలల తర్వాత అక్టోబర్‌ లేదా నవంబర్‌ నెలలో వచ్చే ప్రబోధినీ ఏకాదశి నాడు

మేల్కొన్నాడట. అందుకే à°ˆ నాలుగు నెలల్ని చాతుర్మాసాలు  à°…ంటారు.
ప్రాశస్త్యం: 

ఇది ముఖ్యంగా రైతు పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. వినాయక

చవితి రోజున విద్యార్థులు తమ పుస్తకాలను, కలాలను పూజలో ఉంచి నమస్కరించుకున్నట్టుగా తొలి ఏకాదశి నాడు రైతన్నలు నాగలి, గునపము మొదలైన కు పూజ చేస్తారు. అతి వృష్టి,

అనావృష్టి లాంటి ప్ర కృతి వైపరీత్యాలు  à°šà±‹à°Ÿà± చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలు ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. ఏకాదశి రోజున

కర్షకులు పూజ పూర్తయిన తర్వాత పొలానికి వెళ్ళి పని చేసుకుంటారు. ఈవేళ తప్పనిసరిగా పని చేయానే నమ్మకం ఉంది. కొత్త కూలీను మాట్లాడ్డం లాంటి పను ఏమైనా ఈవేళ చేస్తారు.

వాళ్ళను ఈవేళ పనిలోకి రమ్మని ప్రత్యేకంగా చెప్తారు. కొత్త ఒప్పందాు ఏవైనా ఈవేళ కుదుర్చుకుంటే మంచిదని నమ్మి అలా చేస్తారు. మరే మార్పుచేర్పు అయినా ఈ తొలి

ఏకాదశినాడు చేపడతారు.

తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా

తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేల ప్పిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు.

సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగాల్లాగే తొలి ఏకాదశిని ముఖ్యమైన పండుగ

దినంగా భావించి, ఉపవాసం ఉంటారు. ఈవేళ ఉపవాసం కనుక గారొ, బూరే లాంటి పిండివంటలు ఏమీ చేయరు. కొందరు నేతితో పాయసం వండి ప్రసాదంగా పంచుతారు. పండ్లు మాత్రమే

సేవిస్తారు.

తొలి ఏకాదశి , ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి.. : మన భరతభూమి పుణ్య భూమి. భక్తికి, భక్తి తత్వానికి  à°ªà±à°Ÿà±à°Ÿà°¿à°¨à°¿à°²à±à°²à± . అచంచమైన భక్తి

విశ్వాసాలతో భగవదారాధన చేసి, దైవానుగ్రహాన్ని పొందేందుకు, మన పూర్వులు నియమించిన కొన్ని పర్వ దినాలో, ఏకాదశి వొకటి. తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి

అని జరుపుకోవడం మన ఆచారంగా వ్యవహరింపబడుతోంది.

ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే ‘‘శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి’’ అని

కూడా అంటారు. à°ˆ రోజునుంచీ శ్రీ మహ విష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. గనుక దీన్ని ‘‘శయన ఏకాదశి’’ అంటారు. నిజానికి à°’à°• à°°à°•à°‚à°—à°¾ పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే

మార్పుకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఐతే, మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షణం

వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతే గాక చాతుర్మాస్య వ్రతంకూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ

వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి.

 à°®à°¨ పంచాంగం ప్రకారం

నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు (24) ఏకాదశులు వస్తాయి. చాంద్ర మానం ప్రకారం మూడు సంవత్సరా కొక సారి అధిక మాసం వస్తుంది. అలాంటప్పుడు ఇరవైఆరు ఏకాదశులు వస్తాయి.

అన్నిటిలోకి ముఖ్యంగా తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఎక్కువగా జరుపుకుంటాము. ఏకాదశి అంటే పదకొండు అని అర్థము. ఐతే, ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో

వివరించబడిరది. త్రిమూర్తులో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలో వివరించబడిన సంగతి విదితమే.

అష్టకష్టాలతో తల

మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్‌ శ్రీహరే à°ˆ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, à°ˆ వ్రతాన్ని నియమనిష్టతో ఆచరించిన వారు సమస్త వ్యధ నుంచీ విముక్తి

పొందగరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి భిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొనబడిరది.

తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక

అలసిపోయిన విష్ణువు, సంకల్పం  à°µà°²à°¨ తన శరీరము నుంచి à°’à°• కన్యకను జనింపజేసినట్లు ఆమెనే ‘‘ఏకాదశి’’ అనీ, ఆమె మూడు వరాలు...

1. సదా మీకు ప్రియముగా ఉండాలి.,  2. అన్ని

తిధులోను ప్రముఖంగా ఉండి అందరిచే పూజింపబడాలి., 3. నా తిధి యందు భక్తితో పూజించి ఉపవాసము చేసిన వారికి మోక్షము భించాలి. అని కోరినట్లు ఎన్నో పురాణ కథలు చెప్పబడి

ఉన్నాయి.
మహా సాద్వీ అయిన సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందిందని సంతులీలామృత పురాణంలో చెప్పబడిరది. అందువ్లనే, ఆ రోజు పండరీపురంలో వైభవంగా

ఉత్సవాలు జరుగుతాయి. ఐతే, అంతటి మహిమాన్వితమైన ఈ ఏకాదశి వ్రతంలోని ప్రధాన నియమాలు ఉపవాస ఫలితాలు తెలుసుకుందాం.

ఈ వ్రతాన్ని ఆచరించదచిన వారు . . . : దశమి నాడు రాత్రి

నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాల కృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి.  à°† రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.  à°…సత్య మాడరాదు.  à°¸à±à°¤à±à°°à±€

సాంగత్యం పనికి రాదు.  à°•à°¾à°¨à°¿ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.  à°† రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశినాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని

పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి.  à°…న్నదానం చేయడం చాలా మంచిది.
ముఖ్యంగా ఉపవాస దీక్షకు à°— కారణాలు ఏమంటే ‘‘విష్ణువు వరం వన అన్నంలో దాగిన పాప

పురుషుడే గాక, బ్రహ్మ పాభాగము నుంచి క్రిందబడిన చెమట బిందువు రాక్షసుడిగా అవతరించి నివాసమునకు చోటీయమని అడిగినప్పుడు, బ్రహ్మ ఏకాదశినాడు భుజించు వారి అన్నములో

నివసించమని వరమీయడంతో ఇద్దరు రాక్షసులు à°† రోజు అన్నంలో నిండి ఉంటారు గనుక ఉదరములో చేరి క్రిముగా మారి అనారోగ్యం క్రుంగుతుందన్న హెచ్చరిక’’ మన పురాణాలు

పరోక్షంగా వ్లెడిస్తున్నాయి. అందువలన ముఖ్యంగా ఉపవసించాలని చెప్పబడిరది.

సైన్సు పరంగా మరికొన్ని సూచనలు తెలుసుకుందాం. అందుకే వారి వారి వయసును బట్టి

పళ్ళు పాపహారము తీసుకొనవచ్చును (అన్నం తప్ప). అంతే గాక అనేక ఆరోగ్య రహస్యము ఇమిడి ఉన్నాయట. ‘‘ లంకణం పరమౌషధం’’ అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఉపవాసం వ్ల జీర్ణ

కోశము పరిశుద్ధ మౌతాయి. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది. మనస్సునీ, శరీరాన్నీ పరిశుద్ధం చేస్తుంది. ఈ విధంగా సైన్సు పరంగానూ, పౌరాణికంగానూ అనేక

ఫలితానిస్తుందని పురాణేతిహాసాలు ఘోషిస్తున్నాయి.

ఈ వ్రతం చేసుకున్నవారికి సూర్య చంద్ర గ్రహణములో భూరి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేల

సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు వివరిస్తున్నాయి .

 

#dns  #dnslive  #dnsonline  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #lord  #jagannadh  #puri  #dasavatar  #choultry  #endowments  #festival  #ashadha 

#one  #town  #vamana  #parasu  #rama  #Sri  #Krishna  #Shayana  #ekadashi

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam