DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కబంద హస్తాల నుంచి గుళ్లకు విముక్తి కల్గించాల్సిందే : హిందూ ధార్మిక సంఘాలు

హిందూ ఆలయాలపై ప్రభుత్వం పెత్తనం ఏంటి ? 

అన్యకుల నియామకాల పై  à°µà°¿à°µà°¾à°¦à°¾à°²à°•à± స్వస్తి పలకాలి. 

హిందూ గుడిలో హుండీలు అంటే ఏటీఎం కేంద్రాలు

కాదు. 

ఆలయ కమిటీల్లో నియామకాలకు స్వామిజిలు పనికి రారా  ?

ప్రభుత్వాల తీరుపై మండిపడుతున్న హిందూ ధార్మిక సంఘాలు. . . . . 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Burearu, ) . . .

.

విశాఖపట్నం, జులై  25, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°¹à°¿à°‚దూ ధర్మాన్ని భ్రష్టు పట్టించే విధంగా అన్యమతస్తులు అందునా క్రైస్తవ సంబంధిత వ్యక్తులను హిందూ ఆలయాల్లో ఉద్యోగాల్లో

నియమించడాన్ని హిందూ ధార్మిక సంఘాలు తప్పు పడుతున్నాయి. ఈ తరహా వివాదాలను తొలగించాలంటే ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి హిందూ ఆలయాలు, దివ్య క్షేత్రాలను విడిపించి,

హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాయి. హిందూ దేవాదాయ చట్టం ప్రకారం హిందూ ఆలయాల్లోనూ, వాటి అనుబంధ స్థాస్థల్లోనూ కేవలం హిందూ

సంప్రదాయపరులనే నియమించాలి అనే నిబంధన ఉంది. అయితే వీటిని తుంగలోకి తొక్కుతూ అధికారం లో ఉన్న అధికార పార్టీలు తమకు అనుకూలంగా ఉన్నవారిని హిందూ ఆలయాల లో కీలక

పదవుల్లో  నియమించుకుంటున్నాయి. అయితే దురదృష్టం కొద్దీ వాళ్లలో అధిక శాతం మంది క్రైస్తవులుగానో, క్రైస్తవ సంబంధిత వ్యక్తులగానో తేలుతున్నారు.  à°®à°°à°¿ కొందరు

అధికారిక కాగితాలపై హిందువులుగానే ఉంటూ. . . క్రైస్తవ పద్దతులను పాటిస్తున్నారు. దీంతో హిందూ ధార్మిక సంఘాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి నిదర్శనంగానే

తిరుమల తిరుపతి దేవస్థానం ల్లో ఉన్నత పదవిలో ఉన్న హేమలత టిటిడి వాహనంలో నేరుగా చర్చి ల్లో ప్రార్ధన చేసేందుకు వెళ్తూ మీడియా కు రెడ్ హండేడ్ గా దొరికినా నేటివరకూ

చర్యలు లేకపోవడమే.  à°…నంతర కాలం లో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈఓ చేసిన దర్యాప్తు లో అధికారికంగా 40 మంది క్రైస్తవులు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ లో వివిధ హోదాల్లో ఉద్యోగాల్లో ఉన్నట్టు తేలింది. ఇక దొంగ

సర్టిఫికెట్ లతో ఉద్యోగాలు చేసే వారు వందల్లోనే ఉన్నారు అనేది హిందూ ధార్మిక సంఘాలు ప్రకటించాయి.  

కొలువు ఎందుకు ఇవ్వాలి - కొట్లాట ఎందుకు పెట్టాలి

?...

హిందూ ఆలయాల్లో జరుగుతున్న నియామకాల్లో ప్రతి సారీ ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. హిందూ ఆలయాల్లో కొలువులో చేరాలి అంటే వాళ్ళు కచ్చితంగా హిందువులే అయి

ఉండాలి, హిందూ ఆలయాలు, దేవీ దేవతలపై నమ్మకం ఉండాలి. అలా నమ్మకం లేనివాళ్లు ఇక్కడ ఉద్యోగం చెయ్యడానికి అనర్హులు. దీనికోసం ప్రతి ఆలయంలోనూ ఉద్యోగులతో ప్రతిజ్ఞ

చేయిస్తూ ఉంటారు. à°ˆ విధంగా ఎవరికీ పడితే వారికీ హిందూ ఆలయాల్లో కోలువులు  à°Žà°‚దుకు ఇవ్వాలి, ఇలా అందరి మధ్య కొట్లాటలు ఎందుకు పెట్టాలి అని ప్రశ్నిస్తున్నాయి.

 

టిటిడి నియమాకాల్లోనే అధిక వివాదాలు : . . .

కోట్లాది మంది హిందువులు ప్రాణప్రదంగా కొలుచుకునే తిరుమల లో వాళ్ళ మనోభావాలు 
దెబ్బతినేలా తిరుమల తిరుపతి

దేవస్థానముల కార్యాలయాలు, సంస్థల్లో జరుగుతున్న నియామకాలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చైర్మన్ పదవి నుంచి చైన్ మాన్ పదవి వరకూ ప్రభుత్వాలు ఏ నియామకం

చేపట్టినా వాళ్లకి నేరుగా గానీ, కుటుంబ సభ్యులకు గానీ క్రైస్తవ మత సంబంధం తగులుతూనే ఉండడం మరింత వివాదాలకు దారితీస్తోంది. à°ˆ విధమైన వివాదాలు తలెత్తకుండా ..  . .

హిందూ ఆలయాలు ప్రభుత్వ కబంద హస్తాల నుంచి విముక్తి కల్గించాలని హిందూ ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam