DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కర్ణాటక లో సునాయాసంగా గట్టెక్కిన యడ్యూరప్ప (BJP) ప్రభుత్వం,

బల పరీక్ష కాగానే కాంగ్రెస్ స్పీకర్ రాజీనామా  

కర్ణాటక అసెంబ్లీ లో సునాయాసంగా బల పరీక్ష. 

17 స్థానాల్లో ఉప ఎన్నిక తధ్యమే :. . 

మ్యాజిక్ ఫిగర్ 104 ,

బీజేపీ à°•à°¿ మద్దతు వచ్చింది 106 ,  

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau ) . .  .

బెంగళూరు,  à°œà±à°²à±ˆ  29, 2019 (డిఎన్‌ఎస్‌) : కర్ణాటక లో విధాన సభలో యడ్యూరప్ప ప్రభుత్వం బాల పరీక్ష ను

సునాయాసంగా నెగ్గింది. సోమవారం జరిగిన బలపరీక్షలో 
భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మద్దతుగా 106 మంది సభ్యులు ఓటేశారు. ప్రస్తుతం సభలో అధికారికంగా ఉన్న సభ్యుల

సంఖ్యా 208 , ప్రభుత్వ కొనసాగింపుపై కావల్సినది 104 , అయితే సోమవారం జరిగిన బల పరీక్షలో యడ్యూరప్ప కు మద్దతుగా 106 ఓట్లు లభించాయి. వీరిలో 105 మంది కాగా, ఒక స్వతంత్ర అభ్యర్థి

కూడా మద్దతు ప్రకటించారు. దీంతో మ్యాజిక్‌ ఫిగర్‌ను యడ్డీ సునాయాసంగా ఛేదించగలిగారు. 

కర్ణాటక స్పీకర్‌ రాజీనామా :

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ కే.

ఆర్‌. రమేశ్‌ కుమార్‌ తన పదవికి రాజీనామా చేశారు. సభలో బీజేపీ ప్రభుత్వం బలపరీక్ష లో నెగ్గిన వెంటనే అయన అదే సభలో తన రాజీనామాను సభ్యులకు చదివి వినిపించారు. తానూ

కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా గెలిచి, స్పీఎకర్ పదవికి ఎన్నుకోబడ్డానని, ప్రస్తుతం పార్టీ అధికారాన్ని కోల్పోవడం తో తానూ పదవిలో కొనగడం లేదన్నారు. 

ఉప

ఎన్నిక తధ్యమే :. . 

గత నెల రోజులుగా కర్ణాటక లో తలెత్తిన రాజకీయ పరిణామాల్లో ఉమ్మడి అధికార పార్టీల నుంచి 17 మంది తిరుగుబాటు చెయ్యడం తో వారిని శాశ్వతంగా ఈ సభ

నుంచి బహిష్కరిస్తున్నట్టు స్పీకర్ రమేష్ కుమార్ చేసిన ప్రకటనతో ఆ 17 స్థానాలూ ఖాళీగానే పరిగణింపబడతాయి. దీంతో ఈ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ స్థానాల

నుంచి బీజేపీ అభ్యర్థులు ఎన్నికల్లో గెలిస్తేనే నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అధికారం లో కొనసాగే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో మరో సారి రాష్ట్రంలో రాజకీయ

సంక్షోభం తప్పేలా లేదు. à°ˆ సీట్లు నిలబెట్టుకునేందుకై కాంగ్రెస్, తమ ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నం చేయడం ఖాయం కావడంతో  à°ˆ ఎన్నికలు దేశ

వ్యాప్తంగా సంచలనం కానున్నాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam