DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళల రక్షణకే ఈ బిల్లు తెచ్చాం: తోట విజయలక్ష్మి 

సామాజిక, ఆర్ధిక భరోసా కల్పిస్తుంది à°ˆ బిల్లు 

సంప్రదాయ మత విధానానికి విరుద్ధం కాదు 

రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు 

(రిపోర్ట్ : సాయిరాం CVS ,

Burearu, ). .. .

విశాఖపట్నం,  à°œà±à°²à±ˆ  30, 2019 (డిఎన్‌ఎస్‌) : ముస్లిం మహిళలకు సామాజిక, ఆర్ధిక పరంగా భరోసా కల్పించేందుకే ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లును నరేంద్ర మోడీ ప్రభుత్వం

పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి విజయం సాధించాయిందని ఆంధ్ర ప్రదేశ్ మహిళా మోర్చా అధ్యక్షురాలు తోట విజయలక్ష్మి తెలిపారు. ఈ బిల్లు ను ఉభయ సభలు మంగళవారం ఆమోదం

తెలియచేయడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా DNS తో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా మహిళా రక్షణకై ఎన్ని పధకాలు అమలు చేస్తోందని, దానిలో భాగంగానే ఈ ట్రిపుల్

తలాక్ బిల్లు ను సమాజం ముందుకు తెచ్చిందన్నారు. ఎన్నికల సమయంలో దేశ వ్యాప్తంగా మహిళలకు ఈ బిల్లు ను తీసుకువస్తామని బీజేపీ ప్రచారం చేసిందన్నారు. నాటి హామీకి

వాస్తవ  à°°à±‚పం కల్పించేందుకే à°ˆ బిల్లుని ఆమోదింపచేయగలిగామన్నారు. భారత ప్రధాని సబ్ à°•à°¾ సాత్ సబ్  à°•à°¾ వికాస్ నినాదం తో దేశ ప్రజలకు ఎన్నో సంక్షేమ పధకాలు అమలు లోకి

తీసుకు రాగలిగామన్నారు. 

ఈ బిల్లు అమలు లోకి వచ్చిన తక్షణం తలాక్ విధానం ప్రకారం ముస్లిం మహిళలకు న్యాయ పరమైన, చట్ట పరమైన భరోసా అమలు లోకి వస్తుందన్నారు. ఒక

మహిళా కు తలాక్ చెప్పిన క్షణం లో ఆమె భర్త కు ఉన్న ఆర్ధిక స్థితి ని అంచనా వేసి, ఆ మహిళకు తగిన పరిహారం అందించడమే కాక, సామాజిక భద్రతా కూడా కల్పించడం

జరుగుతుందన్నారు. à°ˆ బిల్లు కు మతపరమైన సంబంధం లేదని, పైగా బీజేపీ అన్ని  à°®à°¤  à°¸à°‚ప్రదాయాలనూ పూర్తిగా గౌరవిస్తుందన్నారు. ప్రతిపక్షాలు చేసే వాదనలో నిజాయితీ

లేదన్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam