DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాలల పట్ల పూర్తి భాద్యత వహించాల్సిందే. . .; NCPCR సభ్యులు  ఆనంద్ 

బాలల హక్కుల సాధనకై దేశ వ్యాప్త పర్యటనలు 

తల్లిదండ్రులనూ భాద్యుల్ని చెయ్యవచు. 

ఫిర్యాదీల వివరాలు బహిర్గతం చెయ్యం : 

బాలల హక్కుల పరిరక్షణ

జాతీయ కమిషన్ సభ్యులు  à°†à°¨à°‚ద్ 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS ) . . .

విశాఖపట్నం, ఆగస్టు  01, 2019 (డిఎన్‌ఎస్‌) : బాలలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై బాలల హక్కుల కమిషన్ కు

చేసిన ఫిర్యాదుల పై తక్షణ విచారణ ఉంటుందని, దోషులపై చర్యలకు ఆదేశించడం జరుగుతుందని బాలల హక్కుల పరిరక్షణ  à°œà°¾à°¤à±€à°¯ కమిషన్ (NCPCR) సభ్యులు జి. ఆనంద్ తెలిపారు. గురువారం

నగరం లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరం లో జరిగిన శిబిరం లో అయన మాట్లాడుతూ బాలల హక్కులను పరిరక్షించేందుకు చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. అంగన్

వాడి కేంద్రాలు, స్వచ్చంద సంస్థలు పరిధిలో ఉన్న బాలలకు నిరంతర  à°ªà°°à±à°¯à°µà±‡à°•à±à°·à°£ ఉంటుందన్నారు.  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à±, పరిశ్రమల్లో పనిచేసే బాలల పట్ల ఎటువంటి ఇబ్బందికర

వాతావరణం తలెత్తకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎక్కడ ఉండే పిల్లలు వారి సమస్యలను ఆయా ప్రభుత్వ శాఖల అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. 

à°ˆ

 à°•à±à°¯à°¾à°‚పు లో కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని శాఖల  à°…ధికారులనూ భాగస్వాముల్ని చేస్తూ కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాలల హక్కుల పరిరక్షణకై దేశ

వ్యాప్తంగా పనిచేసే స్వచ్చంద సంస్థలు ప్రభుత్వ నిబంధనల పరిధిలోనే పని చేయాలన్నారు. చాల సంస్థలు సొంత నిర్ణయాలతో నిర్వహిస్తున్న చాల కార్యక్రమాలపై ఫిర్యాదులు

వస్తున్నాయన్నారు. ఏ జిల్లాలో పని చేసే స్వచ్చంద సంస్థలు ఆయా జిల్లా కలెక్టర్ల పరిధిలోనే పనిచేయాలన్నారు. 

బాలలు నివాసం ఉండే వాతావరణాలు ఏంటో ఉల్లాసంగా,

మానసిక వికాసంతోనే కలిసి ఉండాలన్నారు. ఈ క్యాంపు లో నమోదయ్యే కేసుల వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే వాటిని బహిర్గతం చెయ్యడం జరుగుతుందన్నారు. ఈ వివరాలను

కేవలం జిల్లా సంయుక్త కలెక్టర్ మాత్రమే ప్రకటించడం జరుగుతుందన్నారు.  

à°ˆ సమావేశంలో బాలల హక్కుల పరిరక్షణ  à°œà°¾à°¤à±€à°¯ కమిషన్ సలహాదారు రామన్  à°•à±† గౌర్  à°œà°¿à°²à±à°²à°¾

సంయుక్త కలెక్టర్ శివ శంకర్, ట్రైనీ కలెక్టర్ ప్రతిష్ఠా, రాష్ట్ర చైర్ పెర్సన్ గంట హైమావతి, జిల్లాలోని విద్య శాఖా, పోలీసు, అంగన్వాడీ, వైద్య తదితర పలు ప్రభుత్వ

సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వం వద్ద నమోదు చేసుకున్న స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam