DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజా క్యాంటీన్ల పై ఆందోళన వద్దు త్వరలోనే తెరుస్తాం : మంత్రి బొత్స

అసలు తక్కువ - ఆర్భాటం ఎక్కువ ఇదే అన్న క్యాంటిన్లు 

అన్న క్యాంటీన్ల ఏర్పాట్లలో  à°•à±‹à°Ÿà±à°²à°¾à°¦à°¿ ప్రజాధనం దుర్వినియోగం 

ప్రజలకు దూరంగా కట్టారు, రూ. 50

కోట్ల  à°¬à°¿à°²à±à°²à±à°²à± చెల్లించలేదు 

ఆహారాన్ని అందించిన సంస్థకు రూ. 40 కోట్ల బిల్లులు ఇవ్వలేదు

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి). . .

అమరావతి,  à°†à°—స్టు  01, 2019 (డిఎన్‌ఎస్‌) : అన్న క్యాంటీన్ల మూసివేత పై ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, తెలుగుదేశం చేసిన తప్పులను సరిదిద్ది త్వరలోనే

ప్రారంభిస్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం నుంచి అన్నా క్యాంటీన్ల మూసివేతపై అయన స్పష్టమైన పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల

ముందు హడావిడిగా కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం తో ఏర్పాటు చేసి, ప్రజలను సందిగ్ధం లో పెట్టారన్నారు. 

అతితక్కువ ధరలకు ఆహారాన్ని అందించడానికి

ఉద్దేశించిన క్యాంటీన్లను ప్రజలకు మరింత ఉపయోగపడే రీతిలో తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సంకల్పించిందని, వీటి నిర్వహణలో ఉన్న లోటుపాట్లని సరిదిద్దేలా చర్యలు

తీసుకుంటున్నామని వెల్లడించారు.
 à°•à±à°¯à°¾à°‚టీన్ల పనితీరుకు సంబంధించి గురువారం à°’à°• పత్రికా ప్రకటన విడుదల చేశారు. క్యాంటీన్లను మూసివేసే ఆలోచన లేదని ఆయన స్పష్టం

చేశారు. ప్రజల అవసరాలు, స్థల లభ్యత, నిర్వహణ వెసులుబాటు వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మరింత చేరువచేసే చర్యలు తీసుకుంటామన్నారు.

పట్టణ ప్రాంతాల్లో

గతంలో నిర్మించిన 182 అన్న క్యాంటీన్లలో చాలావరకు  à°’à°• నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా, విధివిధానాలు లేకుండా ఏర్పాటు చేయడంతో వీటి ద్వారా ఆశించిన స్థాయిలో

ఫలితాలు రావడం లేదని పేర్కొన్నారు. 

ఎంతో హడావుడిగా, ప్రచార ఆర్భాటంతో వీటిని ప్రారంభించిన గత ప్రభుత్వం వీటి నిర్మాణానికి సంబంధించిన కోట్లాది రూపాయల

బిల్లులతోపాటు, నిర్వహణ ఖర్చులను కూడా చెల్లంచలేదన్నారు. వీటి నిర్మాణాలకు సంబంధించి దాదాపు రూ. 50 కోట్లు, వీటిలో పంపిణీ చేసిన ఆహారానికి సంబంధించి ఆరు నెలల పాటు

బిల్లులు ఇవ్వలేదని ఇలా  à°®à°°à±‹ రూ. 40 కోట్లు పెండింగ్‌ లో ఉంచారని ధ్వజమెత్తారు.  à°ªà±‡à°¦à°²à°ªà±ˆ à°—à°¤ ప్రభుత్వానికి ఉన్న కపట ప్రేమకు ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ఒక్కపైసా కూడా ఇవ్వకుండా, కోట్ల రూపాయాల్లో అప్పుపెట్టి, పంచభక్షపరమాన్నాలు పెట్టినట్టుగా ప్రచారంచేసుకుందని ఆయన విమర్శించారు. ఇన్ని తప్పులు చేసి ఇప్పుడు

ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. 

ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాల్లో అంటే

బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రుల వంటి చోట్ల కాకుండా అసలు రద్దీలేని చోట్ల, ఎక్కడ స్థలం దొరికితే అక్కడ అన్నట్టుగా క్యాంటీన్‌ ఏర్పాటు చేశారని ఆయన

తెలిపారు. రాష్ట్రంలోని క్యాంటీన్లలో సుమారు 68 క్యాంటీన్లు ప్రస్తుతమున్న చోట్ల ప్రజలకు అందుబాటులో ఉన్నాయని గుర్తించామని, మిగిలినవి ప్రజలకు చేరువగా లేని

ప్రదేశాల్లో నిర్మించారన్నారు. ఇలాంటి చర్యలతో ప్రజాధనాన్ని వృధా చేశారని ఆయన తెలిపారు. 
ఇటువంటి పరిస్థితుల్లో వీటి నిర్వహణకు సంబంధించి ఒక ప్రత్యేకమైన

విధానాన్ని రూపొందించాలని నిర్ణయించామన్నారు. ప్రజా ప్రయోజనాలతో పాటు, క్యాంటీన్లను వినియోగించే వారికి ఏవి అవసరమో, ఏ ప్రదేశాల్లో వీటి ఆవశ్యకత ఉందో అన్న

వాటిని క్షుణ్నంగా అధ్యయనం చేసి కొత్తపాలసీని తీసుకుని వచ్చి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam