DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ట్రిపుల్ ఐటీ వైఎస్సార్ మానస పుత్రిక, ఉన్నత స్థితి కల్పిస్తాం    

రాష్ట్రవ్యాప్తంగా ఐఐఐటి లను అభివృద్ధి పరుస్తాం  

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

(రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,

శ్రీకాకుళం). .

శ్రీకాకుళం ఆగస్టు 1  , 2019 (డిఎన్‌ఎస్‌):  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో ట్రిపుల్ ఐటిలను బలోపేతం చేస్తామని రాష్ట్రవిద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

మంగళవారం జిల్లా పర్యాటనలో భాగంగా ఎచ్చెర్ల వద్ద నూతనంగా రూ. 28 కోట్లతో నూతనంగా నిర్మించిన అకాడమీ బ్లార్, బాలికలు, బాలుర వసతి గృహాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

అనంతరం ట్రిపుల్ ఐటి ప్రాంగణంలో విద్యార్దినులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీ వైయస్తార్ మానస పుత్రికని అన్నారు. రాష్ట్ర

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గారాల పట్టిగా అభివర్ణించారు. ఇప్పిటివరకు పూర్తి స్తాయిలో క్యాంపస్ ఏర్పాటు చేయలేకపోయామని అందుకు బాధపుతున్నట్టు చెప్పారు.

సంవత్సరంలో కేవలం 4 వేల మందికి మాత్రమే ట్రిపుల్ ఐటీలో అవకాశం ఉందని, విద్యా ప్రమాణాలు మెరుగు పరచి మంచి ప్లేస్మేంట్స్ కల్పించడానికి ముఖ్యమత్రి ఆలోచనగా

చెప్పారు. గ్రామిణ ప్రాంత విద్యార్ధులకు అత్యున్నతమైన విద్యాని అందించడానికి వై.ఎయ్. రాజశేఖరరెడ్డి త్రిపుల్ ఐటీలు మంజూరు చేశారని తెలిపారు. ఖాళీగా ఉన్న

ఫ్యాకల్టీలను భర్తీ చేస్తామని చెప్పారు. లేబలను ఏర్పాటు చేస్తామని, మెనూను కూడా మోరుగు పరుస్తామని చెప్పారు. మీ జీవితంలో 6 సంవత్సరాల చదువు మరుపురాని మధుర ఘట్టంగా

చేస్తామని  à°…న్నారు. మీ ప్రాధాన కర్తవ్యం చదువు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ రాష్ట్రంలో ప్రధమస్తానంలో ఉండేలా చేస్తామన్నారు. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీని,

అంబేద్కర్ విశ్వవిద్యాలయంను బాగా తీర్చిదిద్దుతామని అన్నారు. మీరు బాగా చదివి సాఫ్ట్ స్కిల్స్,చ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలని చెప్పారు. రాష్ట్ర

బడ్జెట్లో 16 శాతం నిధులు రూ. 33 వేల కోట్లను విద్యాశాఖకు ముఖ్యమంత్రి కేటాయించారని చెప్పారు. రెండు సంవత్సరాల్లో అన్ని పాఠశాలలు మెరుగు పరచాలని ముఖ్యమంత్రి

ఆదేశించినట్టు తెలిపారు. అమ్మ ఒడి కార్యక్రమం వచ్చే జనవరి 26 నుండి అమలు చేయనున్నట్టు తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్రిపుల్ ఐటీ భవనాల

ప్రారంభోత్సవానికి వస్తారని తెలిపారు. తల్లిదండ్టులకు దూరంగా ఉన్నారు. బాగా చదివి మంచి భవిష్యతు పొందాలని చెప్పారు.రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన

క్రిష్ణదాస్ మాట్లాడుతూ విద్యార్ధలకు ట్రిపూ ఐటీ నాణ్యమైన విద్యును అందిస్తుందన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు.

బాల్య దశలో విద్యపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. మీ రంతా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పారు. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ పై ప్రత్యేక దృష్టిని విద్యా శాఖ మంత్రి

కేంద్రీకరించాలని కోరారు. ఎచ్చెర్ల శాసన సభ్యులు కొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ మంచి విద్యను అందించేందుకు మంత్రి కృషిచేస్తున్నారని, రాష్ట్రంలో ముఖ్యమైనది

విద్యా సంస్థ అన్నారు. ప్రభుత్వం వందల కోట్ల రూపాయాలను విద్యపై ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. రాజాయం శాసన సభ్యులు కంబాల జోగులు మాట్లాడుతూ విద్యార్ధులు బాగా

చదివి మంచి భవిష్యత్తు పొందాలని అన్నారు. తల్లి దండ్రులకు కీర్తి ప్రతిష్టలు తేవాలని చెప్పారు. పలాస శాసన సభ్యులు డా. సీదరి అప్పలరాజు మాట్లాడుతూ ప్రతిభావంతమైన

వ్యక్తులుగా ఎదగాలన్నారు. జాయింట్ కలెక్టర్ పి. రజనీకాంతరావు మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీ కి అవసరమగు నిధులు త్వరితగతిన విడుదల చేయడం వలన అభివృద్ధికి అవకాశం

ఉంటుందని అన్నారు. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ హర శ్రీరాములు మాట్లాడుతూ త్వరలో వెయ్యి మంది కొత్త విద్యార్ధులు, మరో వెయ్యి మంది న్యూజివీడు నుండి వస్తున్నారని

తెలిపారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రఘు బాబు మాట్లాడుతూ సహజ వనరులుగల జిల్లా విద్యార్థిని తులసి మాట్లాడుతూ మంచి నైపుణ్యం గల విద్యార్థులుగా

తీర్చిదిద్దుతున్నారు. 

అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో మంత్రి సురేష్ మాట్లాడుతూ మంచి సాంకేతిక విద్య అందించాలని ట్రిపుల్ ఐటీలు నాలుగు సంవత్సరాలుగా

అభివృద్ధికి కొంత దూరంగా ఉంది వేరు వేరు ప్రదేశాల్లో నడపటం బాధాగా ఉంది. à°ˆ విశ్వవిద్యాలయానికి కె సి రెడ్డిని నూతన  à°›à°¾à°¨à±à°¸à°²à°°à± à°—à°¾ నియమించారని తెలిపారు. à°ˆ విద్యా

సంవత్సరం నుండి స్థానికంగా విద్యా బోధన విశ్వవిద్యాలయాలను బలోపేతం చేస్తాం ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల ఫీజ్ లపై ప్రభుత్వం చెప్పిన విధానం

కొనసాగిస్తామన్నారు. పాఠశాలల ఫీజు నిర్ధారణకు11 మంది, ఉన్నత విద్యకు  7 మందితో కమిటీని నియమించాం.
మంత్రి కృష్ణ దాస్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థకు ముఖ్యమంత్రి

ప్రాధాన్యతప్రజలు నమ్మకంతో అందించిన ప్రభుత్వం మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉంది అన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam