DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే సమస్యలు పరిష్కారం కాకుంటే సమ్మె కు సై  

వాల్తేర్ డివిజన్ యధాతధంగా ఉంచాల్సిందే : 

వాల్తేర్ డివిజన్ రద్దుతో ఉద్యోగులకు నష్టం : 

నూతన పెన్షన్ విధానం రద్దు చేయాలి :

రైల్వే

 à°ªà±à°°à°¯à°¿à°µà±‡à°Ÿà±€à°•à°°à°£ రద్దు చేయాలి :

ఏన్ఎఫ్ఐఆర్  à°ªà±à°°à°§à°¾à°¨ కార్యదర్శి à°Žà°‚. రాఘవయ్య 

(రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం,

ఆగస్టు  05 , 2019 (డిఎన్‌ఎస్‌): దేశ వ్యాప్తంగా భారతీయ రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుంటే రైల్వే సిబ్బంది సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా

ఉన్నారని నేషనల్ ఫెడరేషన్ అఫ్ ఇండియన్ రైల్వేస్ ( ఏన్ఎఫ్ఐఆర్ )   ప్రధాన కార్యదర్శి à°Žà°‚. రాఘవయ్య డిమాండ్ చేశారు. సోమవారం విశాఖపట్నం రైల్వే డివిజన్ కార్మిక సంఘం

కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ దశాబ్దాల ఉత్తర ఆంధ్రా ప్రజల పోరాట ఫలితంగా నూతనంగా ఏర్పాటవుతున్న తూర్పు దక్షిణ కోస్తా రైల్వే

జోన్ లో వాల్తేర్ డివిజన్ యధాతధంగా ఉంచాల్సిందేనని తెలిపారు. లక్షలాది మంది ఉత్తరాంధ్రా వాసుల చిరకాల వాంఛను నెరవేరుస్తూనే రైల్వే కార్మికులను నరక కూపం లోకి

నెట్టేస్తున్నారని మండిపడ్డారు. కొత్త జోన్ ఏర్పాటుకు 11 నెలల కాల పరిమితి ఇచ్చారని, విశాఖపట్నం రైల్వే డివిజన్ లోని కొంత భాగాన్ని తూర్పు కోస్తా రైల్వే లో

కలుపుతూ మిగిలిన భాగాన్ని విజయవాడ డివిజన్ లో కలిపారన్నారు. దీంతో విశాఖపట్నం డివిజన్ ను రద్దు చేసేశారన్నారు. జోన్ కోసం పోరాటం చేసిన ప్రాంతాన్నే తుంగలోకి

తొక్కారన్నారు.  à°ˆ డివిజన్ ను యధాతధంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఒరిస్సా ప్రాంతంలోని రైల్వే లైన్ల ను తూర్పు కోస్తా రైల్వే లో కలపాలన్నారు.  

వాల్తేర్

డివిజన్ రద్దుతో ఉద్యోగులకు నష్టం : . . .

ఈ విశాఖపట్నం డివిజన్సు ను రద్దు చేస్తే మారు 18 వేలమంది కార్మికులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఈ డివిజన్ లోని వారిని

విజయవాడలో కలిపితే సీనియారిటీ మొత్తం కోల్పోతారన్నారు. వీళ్ళ జీవితాలతో ఆటలాడే హక్కు కేంద్రానికి లేదన్నారు. దీనిపై తాము రైల్వే బోర్డు చైర్మన్ ను ఈ నెల 1 న

 à°•à°²à°¿à°¸à°¿  à°¸à°®à°¸à±à°¯à°¨à± వివరించామన్నారు. కొత్త జోన్ లో వాల్తేర్ డివిజన్ ఇలాటి ఉంటె వీరి పదోన్నతులకు ఇబ్బంది రాదన్నారు. 

నూతన పెన్షన్ విధానం రద్దు చేయాలి : . .

.

నూతన పెన్షన్ విధానాన్ని తక్షణం విరమించాలని డిమాండ్ చేసారు. భారతీయ రైల్వే సిబ్బంది కి జీతాలు కేవలం భారతీయ రైల్వే ల ఆదాయం నుంచే వస్తుంది తప్ప కేంద్ర

ఆర్ధిక శాఖా నుంచి రాదన్నారు. మా నుంచి వస్తున్నా ఆదాయాన్ని మాకు ఇవ్వడం లో  à°•à±‡à°‚ద్రానికి ఉన్న ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాట

విధానాన్ని అమలు చెయ్యాలి అని డిమాండ్ చేశారు. 

రైల్వే  à°ªà±à°°à°¯à°¿à°µà±‡à°Ÿà±€à°•à°°à°£ రద్దు చేయాలి : . . .

భారతీయ రైల్వేలను ప్రయివేటీకరణ చెయ్యాలి అనే యోచన తక్షణం కేంద్ర

ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రతి రోజు కోట్లాది మందిని ఇవ్విధ గమ్య స్థానాలకు చేరుస్తున్న భారతీయ రైల్వేలు కేవలం కేవలం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి

తప్ప, ప్రయివేట్ రంగంలోకి వెళితే  à°ªà±à°°à°¯à°¾à°£à±€à°•à±à°²à°•à±, కార్మికులకు తీరని ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. 

భారతీయ రైల్వే సిబ్బందికి, కుటుంబ సభ్యులకు మాత్రమే

అందిస్తున్న మెడికల్ , ప్రయాణ పాస్ సదుపాయాన్ని డిపెండెంట్ à°² తల్లిదండ్రులకు కూడా అందించాలని డిమాండ్ చేశారు. 

à°ˆ విలేకరుల సమావేశం లో  à°œà±‹à°¨à°²à± కమిటీ

అధ్యక్షులు జె. సంపత్ కుమార్, జోనల్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆర్ సి సాహు, డివిజనల్ కో ఆర్డినేటర్ మౌళి, డివిజనల్ డిప్యూటీ కో ఆర్డినేటర్ కోటేశ్వర రావు, ఇతర కమిటీ

ప్రతినిధులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 4, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam