DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇళ్ల స్థలాలకు భూముల వివరాలు పంపండి :  కలెక్టర్ ఆదేశాలు

(రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, ఆగస్టు  07 , 2019 (డిఎన్‌ఎస్‌): ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమమైన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ

నిమిత్తం గుర్తించిన భూమి వివరాలను కలెక్టర్ కార్యాలయానికి పంపించవలసిందిగా జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్      à°†à°°à±à°¡à°¿à°“లు, తాసిల్దార్  à°²à°¨à± ఆదేశించారు.  à°¬à±à°§à°µà°¾à°°à°‚

కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇల్లు కట్టుకునేందుకు అనువుగా ఉన్న స్థలాలను మాత్రమే ఎంపిక చేయాలని, గ్రామానికి

దగ్గరలో, విద్య వైద్యం తదితర అవసర సేవలకు ఇబ్బంది లేకుండా ఉండాలన్నారు. నిర్ణీత ప్రొఫార్మా లో గుర్తించిన స్థలాల తాలూకు వివరాలు పంపాలని, భూమి స్వభావం, కేటగిరి,

జిరాయితీ, పోరంబోకు, ప్రస్తుత పరిస్థితులను ఉటంకిస్తూ పూర్తి వివరాలను తెలియజేయాలన్నారు. ప్రజావసరాలకు వినియోగిస్తున్న, లిటిగేషన్, కోర్టు కేసు ఉన్న వాటి

జోలికి వెళ్ళవద్దు అన్నారు. సదరు భూమి లేఅవుట్ కు వీలుగా ఉండాలని, త్రాగు నీరు రవాణా మొదలైన మౌలిక అవసరాలకు వీలుగా ఉండాలన్నారు. ప్రస్తుత అవసరాలకే కాకుండా

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని భూమి వివరాలను సేకరించాలన్నారు. ఏజెన్సీలో ప్రత్యేక దృష్టి సారించాలని, లబ్ధిదారులకు అవగాహన కల్పించి నిజమైన

లబ్ధిదారులను గుర్తించాలన్నారు. జాబితాలో ఎటువంటి చిన్న తప్పులకు కూడా అవకాశం లేకుండా జాగ్రత్తపడాలి అన్నారు. జిల్లాలోని వివిధ మండలాల తాసిల్దార్ లతో ఆ మండలం

లో à°—à°² భూమి వివరాలను గురించి à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు.  à°°à±†à°µà°¿à°¨à±à°¯à±‚ డివిజనల్ అధికారుల పర్యవేక్షణలో లబ్ధిదారులందరికీ జనజీవనానికి అందుబాటులో ఉండే విధంగా స్థలాలను

ఎంపిక చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్, జెసి 2 ఎం వెంకటేశ్వరరావు, డిఆర్ఓ ఎం శ్రీదేవి, పాడేరు సబ్ కలెక్టర్ అనకాపల్లి నర్సీపట్నం ఆర్డీవో

లు సీతా రామా రావు, గోవింద రావు, అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam