DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్చకులకు కనీస వేతనం రూ  25 వేల ఇవ్వాలి : అర్చకుల సంఘం

అర్చకుల కోసం సుప్రీంకోర్టు సూచనలు అమలు చేయాలి

దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లిని కోరిన అర్చకుల సంఘం

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్

అమరావతి). . . 

అమరావతి,  à°†à°—స్టు  08, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఉన్న అర్చకులకు కనీస వెలసారి వేతనం రూ. 25  à°µà±‡à°²à± ఇవ్వాలని అర్చక సంఘాల

ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.  à°—ురువారం వన్ టౌన్ బ్రాహ్మణ వీధి లోని దేవదాయ శాఖ మంత్రి కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర ఆది శైవ అర్చక సంఘం ప్రతినిధులు దేవదాయ

శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. సందర్బంగా వారు రాష్ట్రవ్యాప్తంగా అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి

వివరించారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన అర్చకులకు ఇల్లు మరియు అర్చకుల జీవితం 25% పెంచడంపై అర్చకుల సంఘం హర్షం వ్యక్తం చేసారు. అర్చకుల

సంక్షేమం కోసం గౌరవ సుప్రీం కోర్ట్ ఇచ్చిన సూచనలను యధాతథంగా అమలు చేయాలని తెలిపారు. 

వారు ఇచ్చిన డిమాండ్స్..

అర్చక సంక్షేమ నిధి కి 500 కోట్ల డిపాజిట్లు

చేర్చాలి..

అర్చకులు అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి.

హెల్త్ కార్డులను మంజూరు చేయాలి

అర్చకులకు కనీస వేతనం 25 à°µà±‡à°² రూపాయలుగా నిర్ణయించి

అందజేయాలి..

రాష్ట్రములో నిత్యార్చన కూడా నోచుకోని 1604 దేవాలయాలు ఉన్నాయని, దేవాలయాలను టిటిడి నిర్వాహణలో తీసుకోవాలని కోరారు..

దేవదాయ ధర్మదాయ సవరణ చట్టం

33/2007 అనుగుణముగా అర్చక సర్వీస్  à°°à±‚ల్స్ ను తయారు చేయించి విడుదల చేయాలి

ఆంగ్ల విద్యను అభ్యసించిన అర్చకుల అర్హతను బట్టి ఉద్యోగావకాశాలు

ఇవ్వాలి.

రాష్ట్రంలో పొద్దుటూరు సింహాచలం తిరుపతిలోనే ఉన్న ఆగమ పాఠశాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి...

అర్చకుల భూముల పరిరక్షణకు కఠినంగా

వ్యవహరించాలి

సుప్రీం కోర్టు వారి సూచన మేరకు ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలి..

కార్యక్రమంలో అర్చకుల సంఘం అధ్యక్షులు యనమండ్ర సీతారామ శర్మ, ప్రధాన

కార్యదర్శి పత్రి అనిల్ కుమార్, కోశాధికారి మురికిపూడి కృష్ణ కిషోర్ మరియు 13 జిల్లాల అర్చక సంఘం నాయకులు పాల్గొన్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam