DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరకట్ట నివాసం మునుగుతుంది చెప్పినా బాబు వినలేదు :మంత్రి వెలంపల్లి

జగన్ మంచి చెప్పినా బాబు రాజకీయ కోణం లో చూశారు.

ముంపు ప్రాంత వాసులను తరలించాల్సిందే:

దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు..

ప్రకాశం

బ్యారేజి, ప్రాంతం లో మంత్రుల పర్యటన.

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . . 

అమరావతి,  à°†à°—స్టు  14, 2019 (డిఎన్‌ఎస్‌) : కరకట్ట ప్రాంతం ప్రమాదకరమని

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంచి చెప్పనా చంద్రబాబు వినకుండా రాజకీయం చేసారని  à°¦à±‡à°µà°¾à°¦à°¾à°¯ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు ఎద్దేవా చేసారు. బుధవారం

వ్యవసాయ శాఖా మంత్రి కన్నా బాబు తో కలిసి ప్రకాశం బ్యారేజి, కృష్ణానదీ పరీవాహక ప్రాంతాల్లో అయన పర్యటించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ చంద్రబాబు నివాసం లో

క్రింద ఫ్లోర్  à°µà°°à°¦ నీటికి మునిగి పోయిందని, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నది ఎవరని ప్రశ్నించారు. నిబంధనలు అంటూ కూర్చోకుండా సిఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లు

వరదల కారణంగా à°Ž ఒక్కరికి ప్రాణ హాని లెకుండా మానవత దృక్పథం తో పని చేద్దాం అని, ప్రజలు అప్రమత్తంగా à°—à°¾ ఉండాలని సూచించారు. 
వరద నీరు ప్రకాశం బ్యారేజ్ వైపు

పరవళ్ళు తిలోక్కుతున్న నేపధ్యం లో కృష్ణా బ్యారేజి నుంచి 70 గేట్ల ద్వారా 4.47 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.
 à°ªà±à°°à°•à°¾à°¶à°‚ బ్యారేజ్ నుంచి 70 గేట్ల

ద్వారా వరద నీటిని దిగువకు విడుదల చెయ్యటం జరిగిందని దాదాపు పది సంవత్సరముల తర్వాత వై యస్ జగన్ గారి ప్రభుత్వ హయంలో డ్యాములు అన్ని నిండు కుండలా మారాయన్నారు గత

అనుభవాన్ని ద్రుష్టి లో ఉంచుకొని సహాయ చర్యలను ముమ్మరం చెయ్యాలని ఇప్పటికే సిఎం జగన్ గారు ఆదేశించారని ఏర్పాట్ల పరిశీలనలో భాగమే ఈ పర్యటన అన్నారు.
గత ప్రభుత్వ

మాదిరి ప్రకటన లకే పరిమితం కాకుండా సహాయక చర్యలను మానవత దృక్పథం తో చెయ్యాలని చేతల ప్రభుత్వం మాది అన్నారు.
వరద బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయక చర్యలు

తీసుకుంటున్నామని అన్నారు..
మాజీ సిఎం చంద్రబాబు నాయుడు నది ఒడ్డున కరకట్ట ప్రాంతం లో నివసిస్తున్నార నీ ఇప్పుడు ఆయన ఇంటిలోకి వరద నీరు చేరి ఇసుక మేటలు

కప్పుతున్నయని ఇప్పుడు ఆయన ఇంటికి వరద నీరు రావటం తో ఆయన హైదరబాద్ పారిపోయే పరిస్థితి తలెత్తిందని ప్రజలు బహిరంగం గా చెప్పుకుంటున్నారాన్నరు, సిఎం జగన్ మోహన్

రెడ్డి గారు మంచి చెప్పిన రాజకీయ కోణం తో అల్లరి చేశారన్నారు ఇప్పుడు ఇళ్ళు వదిలి వెళ్లి పోయింది ఎవరో ఆలోచించు కోవాలన్నరు.

కృష్ణా జిల్లా ఇంఛార్జి మంత్రి

కన్నబాబు గారి మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగటం తో వరదలు కూడా పోటెత్తుతున్నయ్ కృష్ణా జిల్లా లో నాగాయలంక, కంచికచర్ల, భవానిపురం ప్రాంతాలలో లోతట్టు

ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు కృష్ణా జిల్లా లో 17 మండలాలు విజయవాడ లో 13,14,15 డివిజన్లలో ముందస్తు జాగ్రత్త చర్యలతో పాటు పునరావాస కేంద్రాలను

ఏర్పాటు చెయ్యటం జరిగిందన్నారు. గత ప్రభుత్వ మాదిరిగా అధికారులు నిబంధనలు అంటూ కూర్చోకుండా మానవతా దృక్పథం తో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సిఎం జగన్

మోహన్ రెడ్డి గారు ఆదేశించార న్నారు . మునిగి పోయిన తర్వాత హడావుడి చేసే ప్రభుత్వం మాది కాదన్నారు వరద బాధితుల కోసం అన్ని ప్రణాళిక ప్రకారం సహాయక చర్యలు చేపట్టాం

అన్నారు. ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా చూడాలని సిఎం జగన్ మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారన్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలలో బోజన, వసతి ఇతర సదుపాయాలు కల్పించాం.

దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు స్నానానికి నదిలో దిగవద్దని సూచించారు. ముందస్తు గా గజ ఇతగాలు ఎన్ డి అర్ ఎఫ్ బృందాలను నియమించటం జరిగిందన్నారు. ఎగువ ప్రాంతం

నుంచి వచ్చే వరద నీటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

పర్యటన లో బాగం గా ప్రకాశం బ్యారేజ్, పున్నమి ఘాట్, బరం పురం పార్క్,

వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, జేసీ.మాదవి లత, సబ్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, జలవనరుల

శాఖ అధికారి గోపి నాథ్ తదితర అధికారులు స్థానిక వై యస్ ఆర్ సిపి నాయకులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam