DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లైసెన్స్డ్ సర్వేయర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి : పవన్ 

3 వేల కుటుంబాలు రోడ్డునపడకుండా చూడాలి 

ప్రభుత్వానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచన . .. . 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS ). . . .

అమరావతి, ఆగస్టు 14, 2019

(డిఎన్‌ఎస్‌) :  à°¤à°—à°¿à°¨ విద్యార్హతలతోపాటు సర్వే విభాగంలో క్షేత్ర స్థాయి అనుభవం ఉన్న లైసెన్స్డ్ సర్వేయర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని జనసేన అధ్యక్షులు పవన్

కల్యాణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ, రైతాంగం అవసరాలకు అనుగుణంగా పని చేస్తున్న లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని

నిలబెట్టుకోవాలి అన్నారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో లైసెన్స్డ్ సర్వేయర్ల సంఘం ప్రతినిధులు తమ సమస్యలను  à°ªà°µà°¨à± కల్యాణ్ గారికి

వివరించారు. సంఘం ప్రతినిధి  à°¡à°¿.వి.భాస్కర రెడ్డి మాట్లాడుతూ “ఏళ్ల తరబడి జీతభత్యాలు లేకుండా తహశీల్దార్ కార్యాలయాల్లో పని చేస్తున్నాం. మా సేవలను

క్రమబద్ధీకరిస్తామని జగన్ గారు పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారు. గ్రామ సచివాలయం ఉద్యోగాల్లో మాకు అవకాశం ఇస్తారు అని ఆశించాం. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయ

కార్యదర్శి కూడా గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో అవకాశం ఇస్తామన్నారు. తీరా మా ఊసు లేదు” అని వాపోయారు.

దీనికి స్పందనగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “3 వేల మంది

లైసెన్స్డ్ సర్వేయర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. వారి కుటుంబాలు రోడ్డునపడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. లైసెన్స్డ్ సర్వేయర్లు  à°‡à°ªà±à°ªà±à°¡à± బీటెక్,

ఎంటెక్ చదువుకున్నవారితో పోటీ పడాలి అనడం సరికాదు. వీరికి వృత్తిపరమైన అనుభవం ఉంది. ఈ విషయాన్ని పరిగణించాలి. లైసెన్స్డ్ సర్వేయర్లు ఎవరూ ధైర్యం కోల్పోకుండా

ఉండండి. జనసేన à°…à°‚à°¡à°—à°¾ నిలుస్తుంది” అని చెప్పారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “ఎన్నో ప్రభుత్వ ప్రాజెక్ట్ à°² కోసం

సర్వే సేవలు అందించిన లైసెన్స్డ్ సర్వేయర్లకు న్యాయం చేయాలి. à°—à°¤ మూడేళ్లుగా రెవెన్యూ రికార్డులను సరి చేసేందుకు వీరు పని చేశారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ లైసెన్స్డ్

సర్వేయర్లకు ఇచ్చిన హామీలను నిలుపుకోవాలి” అన్నారు. పవన్ కల్యాణ్ గారిని కలిసిన ప్రతినిధి బృందంలో జి.సుజన్ కుమార్, సి.హెచ్.ఫణి కుమార్, à°Ÿà°¿.దుర్గాప్రసాద్,

ఎస్.కె.మస్తాన్ వలీ ఉన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam