DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి లో ప్రవాసీ ఆంధ్రుల పాత్ర కీలకం 

మన రాష్ట్రానికి సాదర స్వాగతం పలుకుతున్నాం. .

ఏన్ ఆర్ఐ లకు  à°®à±à°–్యమంత్రి వైఎస్ జగన్ కితాబు

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, ). .  .

విశాఖపట్నం, ఆగస్టు  18, 2019

(డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లో ప్రవాస ఆంధ్రుల పాత్ర అత్యంత కీలకం అని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమం త్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అని వారిని

అభినందించారు. అమెరికా పర్యటనలో ఉన్న అయన శనివారం రాత్రి డల్లాస్ నగరం లో జరిగిన ఆత్మీయ సమావేశంలో ప్రవాసాంధ్రులనుద్దేశించి ప్రసంగించారు.  à°ˆ సందర్బంగా అయన

ప్రసంగిస్తూ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రవాసాంధ్రులు పోషించిన పాత్ర చాలా గొప్పది. మీ ప్రేమకు సెల్యూట్‌ చేస్తున్నాను అన్నారు. అమెరికన్లను మించి తెలుగువారు,

భారతీయులు ఎదుగుతున్న తీరు గర్వకారణం గా ఉందన్నారు. అమెరికా అభివృద్ధి వెనుక తెలుగువారి కృషి ఉందని స్వయంగా అమెరికా అధ్యక్షుడే చెప్పిన విషయాన్ని అయన గుర్తు

చేశారు. మీరు మాతృభూమిని గౌరవిస్తున్న తీరు గర్వకారణం అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని మరింత పెంచేలా  à°°à°¾à°·à±à°Ÿà±à°° పాలనలో విప్లవాత్మక చర్యలు చేపడతున్నామని,

తెలంగాణతో సఖ్యత సంబంధాలను కుదుర్చుకుంటున్నామని వివరించారు. 

కేవలం రెండున్నర నెలల పాలనలోనే ఏకంగా చరిత్రను మార్చే దిశగా పలు కీలక నిర్ణయాలు

తీసుకున్నట్టు తెలిపారు.  à°…సెంబ్లీ మొదటి సమావేశాల్లో 19 బిల్లులను తీసుకువచ్చామని జగన్‌ వివరించారు. వృధాగా సముద్రం లోకి పోతున్న గోదావరి జలాలను కృష్ణాకు

తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. మన రాష్ట్రానికి మిమ్మల్ని అందర్నీ ఆహ్వానిస్తున్నామని, ఇది మీ ప్రభుత్వం అని గుర్తు పెట్టుకోండి. ఆర్థికంగా,

సామాజికంగా, రాజకీయంగా ప్రతి మనిషి, ప్రతి కుటుంబం ప్రతి సామాజిక వర్గ గౌరవాన్ని పెంచేలా నిర్ణయాలు తీసుకుంతామన్నారు. 

పల్లెలు, కళకళలాడాలని, మంచి చదువులు

ఉండాలన్నది నా à°•à°² అని, విద్యార్థుల భవిష్యత్తుకు అమ్మ à°’à°¡à°¿ పేరిట ప్రతి విద్యార్థి à°•à°¿ ఏడాదికి  à°°à±‚.  15 వేలు వాళ్ళ తల్లికి నేరుగా బ్యాంకు ఖాతాలోకి పంపే ఏర్పాటు

చేస్తున్నామన్నారు.    

 à°µà±ˆà°¦à±à°¯à°‚ ఖర్చు భరించలేక చనిపోయే పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. దీని నివారణకై ఆరోగ్య శ్రీ ని పూర్తి స్థాయిలో అమలు లోకి తీసుకు

వేస్తున్నామన్నారు.  

కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, రాజకీయాలకు తావులేకుండా వివక్షలేని పరిపాలన అందించే దిశగా సాగుతున్నామన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam