DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వాల్తేర్ డివిజన్ యధాతధంగా ఉంచండి : వైకాపా ఎంపీ లు 

కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ  

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, ). . .. 

న్యూఢిల్లీ / విశాఖపట్నం, ఆగస్టు  21, 2019 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం ( వాల్తేర్) రైల్వే

డివిజన్ ను యధాతధంగా నూతనంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కొనసాగించాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం రైల్వే శాఖ మంత్రి  à°ªà°¿à°¯à±‚ష్

గోయల్ ను కోరింది.  
రాజ్య సభ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి నేతృత్వంలోని ఈ బృందం బుధవారం రైల్వే మంత్రిని దేశ

రాజధానిలో కలిసింది. à°ˆ సందర్బంగా ఆయనకు  à°µà°¿à°¶à°¾à°–పట్నం డివిజన్ కు భారతీయ  à°°à±ˆà°²à±à°µà±‡ లో ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. సుమారు నాలుగు దశాబ్దాల పోరాట ఫలితంగా రైల్వే

జోన్ వచ్చిందని, అయితే అందులో విశాఖ డివిజన్ లేక పొతే ఇక జోన్ ఇచ్చి ఉపయోగం లేదన్నారు. ప్రధానంగా రవాణా, ప్రయాణీకుల సౌకర్యాలు, అదనపు రైళ్ల నిర్వహణ, ఉద్యోగుల

ఇబ్బందులు, తదితర ప్రదాన అంశాలను వివరించారు.  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లా ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశమని పేర్కొన్నారు.

దీనిపై పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. మంత్రిని కలిసిన బృందం లో లోక్ సభ సభ్యులు ఎంవివి సత్యనారాయణ ( విశాఖపట్ణమం), గుడ్డేటి మాధవి (అరకు),

ఆదాల ప్రభాకర్ రెడ్డి (నెల్లూరు), లావు శ్రీకృష్ణదేవరాయలు (నరసరావుపేట) తదితరులున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam