DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మెరిట్ ప్రకారమే ప్రభుత్వ పోస్టుల భర్తీ : మంత్రి కృష్ణదాస్

(రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 23, 2019 (డిఎన్‌ఎస్‌):   గ్రామ సచివాలయ పోస్టుల భర్తీని పారదర్శకంగా, పక్కాగా

చేపడుతున్నట్లు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన కృష్ణ దాస్ తెలిపారు. శుక్ర వారం బాపూజి కళామందిర్ లో ఉపాధి జ్యోతి వెబ్ సైట్ ప్రారంభించిన అనంతరం

మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గ్రామ సచివాలయ పోస్టుల భర్తీ పూర్తిగా ప్రతిభ ఆధారంగా నింపడం జరుగుతుందన్నారు. ఏపిపిఎస్సి అందించిన ప్రశ్నాపత్రం ద్వారా

ఓ.యం.ఆర్ షీట్ లో అభ్యర్ధులు పరీక్షలు రాయాలన్నారు. అభ్యర్ధులు ప్రతిభను నమ్ముకోవాలని, మద్యదళారులు మాటలు నమ్మరాదని హితవు పలికారు. ఎవరు ఎటువంటి మాయమాటలు చెప్పినా

మోసపోవద్దని ఆయన స్పష్టం చేసారు. ఏ స్ధాయిలో ఉన్న వ్యక్తి అయినా పోస్టులు వేయించే పరిస్ధితి లేదని అన్నారు. ఏ అభ్యర్థి ఎవరిని కలవవలసిన అవసరం లేదని అన్నారు.

కష్టపడి చదవండి. ఉద్యోగాలు పొందండి అని నినాదం ఇచ్చారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించడమే ముఖ్యమంత్రి జగన్ ధ్యేయమని అందుకు అనుగుణంగానే పరీక్షలు

జరుగుతున్నాయని చెప్పారు. ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిసినా, అభ్యర్థులను మోసగించుటకు ప్రయత్నం చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాజకీయ

నాయకులు చెప్పే మాటలు సైతం నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు. యుపిఎస్సీ, ఏపిపిఎస్సీ పరీక్షలు జరుగుతున్న రీతిలో అంతే పకడ్బందీగా పరీక్షల నిర్వహణ జరుగుతున్న

విషయాన్ని గుర్తించాలని మంత్రి అన్నారు. ఎవరైనా మోసగించే ప్రయత్నం చేసినా, ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపినా, డబ్బులు వసూలు చేసినా, చేస్తున్నట్లు సమాచారం ఉన్నా

98481 05520 ఫోన్ నంబరులు వాట్సప్ మెసేజ్ అందించాలని కోరారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 4, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam