DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇలాగేనా వైద్యం చేసేది?: మంత్రి ఆళ్ళ నాని మండిపాటు 

కె.జి.హెచ్. ప్రక్షాళన తప్పదు, నిర్లక్ష్యంగా ఉంటె వేటే. . .

ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ à°—à°¾ మార్చడమే  à°ªà±à°°à°­à±à°¤à±à°µ ధ్యేయం

ఆసుపత్రుల్లో వైద్యంపై ప్రజల్లో భరోసా

కల్పించాలి

పారిశుద్యం పూర్తిగా లోపంపై మంత్రి సీరియస్ 

గిరిజన వాసులకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి

వైద్యుల సమావేశంలో ఆరోగ్య శాఖా మంత్రి

వెల్లడి

(రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం): . . .

విశాఖపట్నం, ఆగస్టు  24 , 2019 (డిఎన్‌ఎస్‌): ఉత్తరాంధ్రా జిల్లా ప్రజల ఆరోగ్యదాయినిగా ఉండవలసిన

కె.జి.హెచ్ ఆసుపత్రి ని  à°¸à°‚పూర్ణంగా ప్రక్షాళన  à°šà±‡à°¸à±à°¤à°¾à°®à°¨à°¿ రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖామాత్యులు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్

తెలిపారు. శనివారం నగర పర్యటనకు వచ్చిన అయన సహచర మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఆసుపత్రిలోని వివిధ వార్డులను పర్యటించారు.  
కె.జి.హెచ్.లోని

కార్డియాలజి, ప్రసూతి వార్డులు, రేడియాలజి, పిల్లలు వార్డు, రాజేంద్ర ప్రసాద్ వార్డు, ఎ.ఎం.సి. వార్డులు సందర్శించిన అనంతరం వైద్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన

మాట్లాడారు.  à°ˆ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ à°—à°¾ మార్చడమే రాష్ట్ర ముఖ్యమంత్రి ధ్యేయమని తెలిపారు. 

నిర్లక్ష్యంగా ఉంటె వేటే

:. . .

ఆసుపత్రి సిబ్బంది చేస్తున్న వైద్య సేవలు నిర్లక్ష్యంగా ఉంటె వేటు తప్పదు అని హెచ్చరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు చేసిన ఫిర్యాదులపై

అయన సీరియస్ అయ్యారు. విజయనగరం నుంచి చికిత్స కోసం వచ్చిన అప్పన్న అనే వ్యక్తి ని సుమారు రెండు నెలల కాలం ఆసుపత్రిలోనే ఉంచి, అసలు రోగం ఏంటో కూడా చెప్పకుండా,

కనీసం పరీక్షలు కూడా చెయ్యకుండా కాలయాపన చేసిన ఘటన మంత్రి దృష్టికి రావడంతో సీరియస్ అయ్యారు.   

వైద్యులు మరింత మెరుగ్గా వైద్య సేవలు అందించాలన్నారు.

హాస్పిటల్ లో ఎప్పటి నుండో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ముఖ్యమంత్రి వైద్య శాఖకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు చెప్పారు.  à°µà°¾à°°à±à°¡à±à°²à±à°²à±‹ పర్యటించినపుడు చాలా

సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వార్డుల్లో ఉన్న పేషెంట్ల సమస్యలు పరిష్కరించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.  à°¹à°¾à°¸à±à°ªà°¿à°Ÿà°²à± లో ఉన్న శిధిలమైన

భవనాల విషయంను, హాస్పిటల్ లో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెల్లనున్నట్లు చెప్పారు.  à°Žà°‚.సి.హెచ్.  à°µà°¾à°°à±à°¡à± ను పరిశీలించడమైనదని, ప్రస్తుతం 600 పడకలు

ఉన్నవని, మరిన్ని పెంచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.  

ఏజెన్సీ వాసులకు ప్రత్యేక సెల్ :. . . 

గిరిజన ప్రాంతం నుండి వచ్చిన పేషెంట్లకు

సరియైన సమయంలో స్పందించాలని, మానవతా దృక్పధంతో  à°ªà±‡à°·à±†à°‚ట్ల కు సేవలు అందించాలని చెప్పారు.  à°—ిరిజనులకు à°’à°• ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి వారికి తక్షణన వైద్యసేవలు

అందించాలని, నగరాలు, పట్టణాలకే వైద్య సేవలు కాకుండా మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ వైద్య సేవల కోసం అత్యంత

ప్రాధాన్యత కల్పిస్తూ బడ్జెట్ లో వేల కోట్ల రూపాయలు కేటాయిస్తుందని, ప్రభుత్వం ప్రజలకు ఏ విధమైన భరోసా ఇచ్చిందో ప్రజల్లో ఆ విధమైన నమ్మకం కల్పించాలని చెప్పారు.

 

పారిశుద్యం పూర్తిగా లోపించింది :. . . .

శానిటేషన్, డ్రైనేజి వ్యవస్థ బాగో లేదని పర్యటనలో చూడడమైనదని, శానిటేషన్, డ్రైనేజి వ్యవస్థను బాగుచేయాలని

ఎపిఎస్ఎంఐడిసి ఎస్.à°‡.ని ఆదేశించారు.  à°…వసరవైున సిబ్బంది గూర్చి, ఏ ఏ డిపార్టు మెంట్లకు అదనపు పడకలు కావాలో ప్రతిపాదనలు పంపాలని సూపరింటెండెంట్ కు చెప్పారు.

 à°†à°‚బులెన్స్ లకు అవసరమైన డ్రైవర్లను ఔట్ సోర్సింగ్ పై పెట్టుకోవాలన్నారు.  à°¸à±à°•à°¾à°¨à°¿à°‚గ్, ఎంఆర్ఐ లపై రోజుల కొద్దీ మరమ్మత్తులు పేరు చెప్పి కాలం గడపొద్దని,

మరమ్మత్తులు వస్తే తక్షణమే చేయించి ప్రజలకు సేవలు అందించాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు.  à°¸à°®à°¸à±à°¯à°²à± పునరావృతం కాకుండా, రానున్న రోజుల్లో ఇలాంటి సమస్యలు

రాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని చెప్పారు. మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.
     à°°à°¾à°·à±à°Ÿà±à°° ఉప ముఖ్యమంత్రి,

గిరిజన సంక్షేమ శాఖామాత్యులు పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ కె.జి.హెచ్. కు వచ్చే గిరిజన పేషెంట్లను డాక్టర్లు తమ ఇంట్లో ఉన్న వారిపై ఏ విధంగా స్పందిస్తారో ఆ

విధంగా స్పందించాలన్నారు.  à°Žà°‚ఆర్ఐ స్కాన్ పై రోజుల తరబడి పేషెంట్లను తిప్పకుండా తక్షణమే స్కాన్ చేసి రిపోర్టులు అందించాలని పేర్కొన్నారు. ఐటిడిఎలకు కొత్తగా 3

వాహనాలను ప్రభుత్వం సరఫరా చేయనున్నట్లు చెప్పారు.  à°—ిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°° పర్యాటక, సాంస్క్రతిక మరియు క్రీడలు, యువజన

శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ కె.జి.హెచ్. స్టాఫ్ కు వసతి సమస్యగా ఉందని, తక్షణమే బడ్జెట్ నుండి ఉత్తరాంధ్రకు ఉపయోడపడే కె.జి.హెచ్.కు

నిధులు విడుదలకు ప్రధమ ప్రాధాన్యత కల్పించాలన్నారు.  à°•à±†.జి.హెచ్. ఉత్తరాంధ్రకే కాకుండా చత్తీస్ ఘడ్, ఒడిష్షా, తదితర రాష్ట్రాల ప్రజలకు ఉపయోగపడుతుందని తెలిపారు.

 à°µà°¿à°®à±à°¸à± కు ప్రాధాన్యత కల్పించాలని, అమరావతి తర్వాత విశాఖపట్నానికే ప్రాధాన్యత కల్పించాలని చెప్పారు. విఎంఆర్డిఎ అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీనివాసరావు

మాట్లాడుతూ వైద్య, విద్యలకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాముఖ్యత కల్పిస్తున్నారని, ప్రభుత్వం కె.జి.హెచ్.కు వసతులు కల్పించాలన్నారు.  2023 సంవత్సరం నాటికి వంద సంవత్సరాలు

పూర్తి అవుతుందని, కె.జి.హెచ్. అభివృద్థికి  à°Žà°¨à±.ఆర్.ఐ.à°² నుండి నిధులు, పరికరాలు ఇచ్చారని, మరిన్ని నిధులు, పరికరాలు రాబట్టేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు.

 à°•à±†.జి.హెచ్.కు వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుండి పేషెంట్లు అధికంగా వస్తున్నందున అదనపు పడకలు అవసరమని, నిధులు కూడా విడుదల చేయాలని మంత్రిని ఆయన కోరారు.

 à°µà°¿à°•à±à°Ÿà±‹à°°à°¿à°¯à°¾ హాస్పిటల్ అభివృద్థికి చర్యలు తీసుకోవాలని, విమ్స్ పై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కె.ఎస్. జవహర్

రెడ్డి మాట్లాడుతూ వార్డుల్లో ఉన్న సమస్యలను తెలుసుకోవడమైనదని, సి.ఎస్.ఆర్. భవనం నిర్మాణం పూర్తి చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.  à°µà±ˆà°¦à±à°¯

విద్యార్థులకు వసతి, ప్రసూతి వార్డు అభివృద్థి చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.  à°•à±†.జి.హెచ్.లో ఉన్న సమస్యలకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు.

అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సత్యవతి మాట్లాడుతూ కె.జి.హెచ్.ను కార్పొరేట్ తరహాలో అభివృద్థి చేయాలని కోరారు.  à°Ž.à°Žà°‚.సి. ప్రిన్సిపల్ సుధాకర్, కె.జి.హెచ్.

సూపరింటెండెంట్ జి. అర్జున హాస్పిటల్ లో ఉన్న సమస్యలపై మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
     à°ˆ సమావేశంలో మంత్రితో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన

సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి, రాష్ట్ర పురపాలక, పరిపాలన మరియు పట్టణ అభివృద్థి శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ, రాష్ట్ర పర్యాటక, సాంస్క్రతిక మరియు

క్రీడలు, యువజన శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర రహదారులు మరియు భవనముల శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాసు, విఎంఆర్డిఎ అధ్యక్షులు ద్రోణంరాజు

శ్రీనివాసరావు, పార్లమెంటు సభ్యులు బి. మాధవి (అరకు), డాక్టర్ బి.వి. సత్యవతి (అనకాపల్లి), ఎంవివి సత్యనారాయణ (విశాఖపట్నం), కలెక్టర్ వి. వినయ్ చంద్, శాసన సభ్యులు తిప్పల

నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, గొల్ల బాబూరావు, పెట్ల ఉమాశంకర్ గణేష్, అదీప్ రాజు, గుడివాడ అమర్ నాథ్, భాగ్యలక్ష్మి, శెట్టి పల్గుణ, శ్రీకాకుళం జిల్లా రాజాం శాసన సభ

నియోజక వర్గం శాసన సభ్యులు కంబాల జోగులు, డి.ఎం.ఇ. డా. కె. బాబ్జి, తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam