DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విమ్స్ ఆసుపత్రి అభివృద్థికి రూ.100 కోట్లు నిధులు 

తక్షణమే సిబ్బంది భర్తీ  - నిమ్స్ తరహా అభివృద్థి

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామాత్యులు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్                              

(రిపోర్ట్ : సత్య

గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, ఆగస్టు  24 , 2019 (డిఎన్‌ఎస్‌): విమ్స్ ఆసుపత్రికి అవసరమైన సిబ్బందిని తక్షణమే నియమించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య

మరియు కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖామాత్యులు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.  à°®à°¿à°®à±à°¸à± ఆసుపత్రిని వైద్య ఆరోగ్య

శాఖ మంత్రితో రాష్ట్ర పురపాలిక, పరిపాలన మరియు పట్టణ అభివృద్థి శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ, రాష్ట్ర పర్యాటక, సాంస్క్రతిక మరియు క్రీడలు, యువజన శాఖామాత్యులు

ముత్తంశెట్టి శ్రీనివాసరావులతో కలసి సందర్శించారు.  à°…నంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి విమ్స్ ను స్విమ్స్, నిమ్స్ తరహాలో అభివృద్థి

చేయనున్నట్లు చెప్పారు. విమ్స్ కు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ à°¡à°¾. వై.యస్. రాజశేఖర రెడ్డి హయాంలోనే శంకుస్థాపన చేయడమైనదని తెలిపారు.  à°†à°¸à±à°ªà°¤à±à°°à°¿ అభివృద్థికి,

సిబ్బంది జీతాలకు 100 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లు చెప్పారు.  à°†à°¸à±à°ªà°¤à±à°°à°¿ అభివృద్థిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విమ్స్ సంచాలకులు à°¡à°¾. సత్యవర ప్రసాద్

మంత్రుకు వివరించారు.  à°ˆ కార్యక్రమంలో విఎంఆర్డిఎ అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీనివాసరావు, జిల్లాకు సంబంధించిన అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు à°¡à°¾. బి.వి. సత్యవతి,

విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, కలెక్టర్ వి. వినయ్ చంద్, శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, గుడివాడ అమర్ నాథ్, అదీప్ రాజు, డి.ఎం.ఇ. డా. కె. బాబ్జి,

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam