DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవారి భక్తుల కానుకలకు పూర్తి భద్రత కల్పిస్తాం : EO

ఖజానాలో నిర్లక్ష్యం ఉంటె à°•à° à°¿à°¨ చర్యలు: 

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో  à°…నిల్‌కుమార్‌ సింఘాల్‌

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ). . .

తిరుపతి, ఆగస్టు  27, 2019

(డిఎన్‌ఎస్‌): à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఆలయాల్లో హుండీల ద్వారా భక్తులు సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలు, ఇతర కానుకలను రికార్డుల్లో పక్కాగా నమోదు చేసి ఖజానాలో

భద్రపరుస్తున్నామని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో  à°…నిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తిరుపతిలోని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ పరిపాలనా భవనంలో à°—à°² సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం మీడియాతో

మాట్లాడారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులు సమర్పించిన కానుకల విషయంలో అలసత్వం వహిస్తున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. ఖజానా విభాగంలో విధుల్లో

ఉన్న అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన తీసుకుంటామని తెలిపారు. టిటిడి ఆలయాల్లో భక్తులు హుండీల్లో సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలు ఇతర కానుకలను

తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల ఖజానాకు తరలించి భద్రపరుస్తామన్నారు. ఇక్కడ ఏఈవో ఆధ్వర్యంలో వీటిని రికార్డుల్లో నమోదు చేసుకుని లాకరులో

భద్రపరుస్తామని వివరించారు. సంబంధిత అధికారి బదిలీ అయిన సందర్భంలో బదిలీ అయిన ఏఈవో, కొత్తగా బాధ్యతలు స్వీకరించే ఏఈవో, ఖజానా డెప్యూటీ ఈవో, అకౌంట్స్‌ అధికారులు,

విజిలెన్స్‌ అధికారుల సమక్షంలో వస్తువుల పరిశీలన జరుగుతుందన్నారు. à°ˆ క్రమంలో ఖజానాలో 2017, అక్టోబరు 10 నాటికి చేపట్టిన వెరిఫికేషన్‌లో కొన్ని వస్తువులు

కొరత(షార్టేజి) ఉన్నట్టు, మరికొన్ని వస్తువులు అదనంగా ఉన్నట్టు సదరు ఏఈవో ఎం.శ్రీనివాసులు స్వయంగా నివేదించారని తెలిపారు.

కొరత ఉన్న వస్తువుల్లో 1) రూ.4,18,469/-

విలువైన సాధారణ రాళ్లతో కూడిన రెండు బంగారు ఉంగరాలు, సాధారణ రాళ్లతో కూడిన రెండు నెక్లెస్‌లు, 2)రూ.71,259/- విలువైన à°’à°• బంగారు నాణెం, 3) రూ.2,32,200/-విలువైన à°’à°• వెండి కిరీటం, 4) రూ.14,274/-

విలువైన వెండి పూత పూసిన రాగి నాణేలు, 5) రూ.174/- విలువైన అల్యూమినియం నాణెం ఉన్నాయని ఈవో తెలిపారు. వీటి మొత్తం విలువ రూ.7,36,376/- అని వెల్లడించారు.

            అదనంగా ఉన్న

వస్తువుల్లో 11.778 కిలోల వెండి వస్తువులు, 2.608 కిలోల ముత్యాలు, 369 గ్రాముల పగడాలు, 936 గ్రాముల విడి రాళ్లు, 31 గ్రాముల బంగారు ఆభరణాల విడిభాగాలు, 250 గ్రాముల బంగారు పూత పూసిన వెండి, 800

గ్రాముల వెండి, 16.700 గ్రాముల వెండి వస్తువులు, 2.350 గ్రాముల ఆవగింజ సైజుగల వజ్రం, 2 పచ్చరాళ్లు కలిగిన బంగారు ఉంగరం ఉన్నాయని ఈవో వివరించారు.

            అప్పట్లో ఏఈవోగా

విధుల్లో ఉన్న ఎం.శ్రీనివాసులును కొరత వచ్చిన వస్తువులకు నిబంధనల మేరకు బాధ్యులుగా గుర్తించామని ఈవో తెలిపారు. ఈ మేరకు ఆయన జీతం నుండి నెలకు రూ.25 వేలు చొప్పున

ఇప్పటివరకు రూ.2.25 లక్షలు తిరిగి వసూలు చేశామన్నారు. మరోసారి ఖజానాలోని వస్తువులను పరిశీలించాలని సదరు ఏఈవో విన్నవించారని, ఇందుకు అంగీకరించామని తెలిపారు. ఇందులో

భాగంగా సెప్టెంబరులో వెరిఫికేషన్‌ను అనుమతి ఇచ్చామని, ఇందులో వాస్తవాలు వెలుగుచూసే అవకాశముందని వెల్లడించారు. ఒకవేళ కొరత à°—à°² వస్తువులు లేవని తేలితే పూర్తి

సొమ్ము రికవరీతోపాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అదనంగా ఉన్న వస్తువులను టిటిడి ఖజానాకు జమ చేస్తామన్నారు.

            à°ˆ మీడియా సమావేశంలో

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అదనపు ఎఫ్‌ఏ, సిఏవో  à°°à°µà°¿à°ªà±à°°à°¸à°¾à°¦à±, ట్రెజరీ అండ్‌ ఇన్వెంటరీ డెప్యూటీ ఈవో  à°¦à±‡à°µà±‡à°‚ద్రబాబు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam