DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎక్కువ కేసుల పరిష్కారానికి సహకరించండి : జడ్జి బబిత  

బాలల రక్షణ పై  à°¶à±à°°à°¦à±à°¦ వహించాలి 

సెప్టెంబర్ 14 à°¨ జాతీయ లోక్ అదాలత్, 

జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ ఛైర్ పర్సన్ బబిత 

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,

 à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు  28, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 14à°µ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కారం

కావడానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ ఛైర్ పర్సన్ ఎం.బబిత అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్ధ రూపొందించిన

పథకాలు, అమలుపై సంబంధిత శాఖలతో బుధ వారం సాయంత్రం జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సమీక్షించారు. సెప్టెంబర్ 14వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్,

ఏసిడ్ దాడులు, మాదక ద్రవ్యాల నిరోధం, గిరిజన సంక్షేమ పథకాల అమలుపై ప్రధానంగా సమీక్షించారు. సెప్టెంబర్ 14వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లో అధిక సంఖ్యలో

కేసులు పరిష్కారం కావడానికి కృషి చేయాలని పారా లీగల్ వాలంటీర్లు, న్యాయవాదులకు సూచించారు. బ్యాంకింగు, బీమా రంగంలోను, ఇతర రాజీపడదగ్గ కేసులను

పరిష్కరించవచ్చన్నారు. ప్రీలిటిగేషన్ కేసులు ముందుగానే సమర్పించవచ్చని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై సమీక్షిస్తూ పేదలకు, బడుగు వర్గాలకు

ఉద్దేశించిన ప్రతి పథకం, కార్యక్రమం విధిగా అర్హులకు అందాల్సిందేనని అందుకు తగిన విధంగా అధికారులు పనిచేయాలని స్పష్టం చేసారు. 

బాలల రక్షణ పట్ల శ్రద్ధ

వహించాలి :  

జిల్లాలో అనేక అనాథాశ్రమాలు, వృద్దాశ్రమాలు నిర్వహించడం జరుగుతున్నాయని, వాటి నిర్వహణపై పలు రకాల ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. సంబంధిత

అధికారులు సమయానుసారం తనిఖీలు చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. అనాధాశ్రమాల్లో చిన్నారులపట్ల సరైన శ్రద్ధ ఉండటం లేదనేది సమాచారం ఉందని, జిల్లా న్యాయ

సేవాధికార సంస్ధ సైతం పరిశీలనకు చర్యలు చేపడుతుందని అన్నారు. చిన్నారులు పాఠశాలల నుండి ఆశ్రమాలకు చేరుకునే సమయంలో ఆశ్రమాల్లో ఎవరూ లేకపోవడం కూడా

జరుగుతున్నట్లు తెలుస్తుందని చెప్పారు. ఆశ్రమాల్లో ఉన చిన్నారులను వివిధ కార్యక్రమాలకు బయట ప్రాంతాల్లోనూ ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని అటువంటివి

జరుగుటకు అవకాశం ఉండరాదని ఆమె స్పష్టం చేసారు. పక్కాగా తనిఖీలు నిర్వహించాలని అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్ధ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుందని ఆమె

తెలిపారు. చిన్నారుల హక్కులు కాలరాయడం, చిన్నారులపై ఆకృత్యాలకు పాల్పడటం నేరమని ఆమె అన్నారు. జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న వన్ స్టాప్ కేంద్రం పనితీరు

మెరుగుపడాలని ఆమె సూచించారు. నివేదికలు సమర్పించాలని ఆమె ఆదేశించారు. మహిళలు, చిన్నారులను అక్రమంగా రవాణా చేయడం వంటి చర్యలను నిరోధించాల్సిందేనని ఆమె స్పష్టం

చేసారు. బాల్య వివాహాలు సమూలంగా నిరోధించాలని అన్నారు. ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో బాల్య వివాహలు జరుగుతున్న దాఖలాలు ఉన్నాయని అధికార యంత్రాంగం పూర్తిగా

దృష్టి సారించాలని అన్నారు. ప్రజల్లో మంచి అవగాహన కలిగించాలని అన్నారు. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్పు చేసి వివాహ వయస్సు చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని

చెప్పారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ బాల్య వివాహాలు జరగరాదని అన్నారు.  à°¸à°®à°¾à°œà°‚లో మాదక ద్రవ్యాల వినియోగం ఉండరాదని ఆమె అన్నారు. జిల్లాలో నేర ప్రవృత్తి తక్కువగా

ఉన్నప్పటికి వీటిపై అలక్ష్యం చేయరాదని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. మాదక ద్రవ్యాలపట్ల పోలీసు, సంబంధిత శాఖ పూర్తి స్ధాయిలో దృష్టి సారించాలని ఆమె ఆదేశించారు.

గిరిజనులకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపట్ల పారా లీగల్ వాలంటీర్లు అవగాహన కలిగించాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతంలో పౌష్టికాహారం, విద్య, వైద్యం వంటి

కార్యక్రమాల పట్ల మరింత అవగాహన అవసరమని పేర్కన్నారు. గిరిజన ప్రాంతంలో ప్రసవ సమయంలో ముందుగానే ఆసుపత్రిలో చేర్పించాలని, వారికి అవసరమగు మందులు ఆహారం

అందించాలని ఆమె సూచించారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయడం అర్హులైన వారికి అందించడంలో జిల్లా యంత్రాంగం బాగానే సహకరిస్తుందని పేర్కొంటూ అన్ని శాఖల అధికారులు తమ

పరిధిలో ప్రత్యేక శ్రద్ద వహించి పేద ప్రజానీకానికి ప్రయోజనం కలిగే విధంగా ఆయా కుటుంబాలు ఆర్ధిక స్వావలంబన సాధించే దిశగా ప్రయత్నించాలని కోరారు.
          à°ˆ

సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ కార్యదర్శి కె.జయలక్ష్మి, జిల్లా రెవిన్యూ అధికారి కె.నరేంద్ర ప్రసాద్, ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరక్టర్ కె.నాగరాణి, విభిన్న

ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు జీవన్ బాబు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆర్.ఎం.ఓ డా.బి.సి.హెచ్. అప్పల నాయుడు, వైద్య శాఖ అధికారి డా.కృష్ణమోహన్, జాతీయ బీమా సంస్ధ

అధికారి ఎస్.మురళి, డ్రగ్స్ సహాయ సంచాలకులు, సంబంధిత అధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam