DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీసు అదుపులో  క్రికెట్ బుకీ జావెద్ ఖాద్రి బృందం 

మరో 10 మంది క్రికెట్ బుకీలు అరెస్టు

కమ్యూనికేటర్ బాక్సు, రెండు ల్యాపీలు, 33 సెల్ ఫోన్లు స్వాధీనం 

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం). .

.

అనంతపురం, ఆగస్టు  23, 2019 (డిఎన్‌ఎస్‌): ప్రధాన క్రికెట్ బుకీ, 20 కేసుల్లో నిందితుడైన సయ్యద్ జావెద్ ఖాద్రి @ జావెద్ తో పాటు పది మంది క్రికెట్ బుకీలను తాడిపత్రి

మరియు ధర్మవరం సబ్ డివిజన్ల పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వీరి నుండీ ఒక కమ్యూనికేటర్ బాక్సు, రెండు ల్యాప్ టాప్ లు, 33 సెల్ ఫోన్లు, ఇయర్ మైకు, 2,125 గ్రాముల

గంజాయి స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగు, గంజాయి కేసులతో పాటు హత్య, హత్యాయత్నం, గొడవలు, దాడులు కేసులు జావెద్ పై ఉన్నాయి. మిగితా నిందితులపై కూడా

క్రికెట్ బెట్టింగు, గంజాయి కేసులు ఉన్నాయి. గురువారం జిల్లా ఎస్పీ భూసారపు సత్యఏసుబాబు అనంతపురంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఇందుకు సంబంధించిన వివరాలను

వెల్లడించారు. 

అరెస్టయిన క్రికెట్ బుకీల వివరాలు : ...

1)  à°¸à°¯à±à°¯à°¦à± జావెద్ ఖాద్రి @ జావెద్  , వయస్సు 38 సం., అల్లాబకాష్ వీధి, తాడిపత్రి 

2) లక్ష్మినారాయణ @

లచ్చి, వయస్సు 43 సం., శ్రీరాముల పేట, తాడిపత్రి 

3) వెంకటేశ్వరరెడ్డి @ వెంకటేశు , వయస్సు 32 సం., తాడిపత్రి 

4) గండికోట హాజీబాష @ ఘోర హాజీ, వయస్సు 30 సం., బండ మసీదు వీధి,

తాడిపత్రి.

5) ఎస్ కిరణ్ కుమార్ , వయస్సు 38 సం., అనంతపురం 

6) జె.విశ్వనాథరెడ్డి, వయస్సు 38 సం., గొట్లూరు గ్రామం, ధర్మవరం మండలం.

7) జె అప్పుస్వామి @ బోడి

అప్పుస్వామి, వయస్సు 35 సం., గంటాపురం గ్రామం, బత్తలపల్లి 

8) జె.నరేష్ , వయస్సు 38 సం., గంటాపురం గ్రామం, బత్తలపల్లి 

9) ఈ. సందీప్ , వయస్సు 31 సం., గంటాపురం గ్రామం,

బత్తలపల్లి 

10) జె.సురేష్ , వయస్సు 36 సం., గంటాపురం గ్రామం, బత్తలపల్లి 

స్వాధీనం చేసుకున్న వస్తువులు : ..

ఒక కమ్యునికేటర్ బాక్సు * రెండు ల్యాప్ టాప్ లు * 33

సెల్ ఫోన్లు * ఇయర్ మైకు * 2,125 గ్రాముల గంజాయి. 

నేపథ్యం : - - -
         à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ అరెస్టయిన వీరిలో సయ్యద్ జావెద్ ఖాద్రి @ జావెద్ చాలా కీలక నిందితుడు. రౌడీషీటర్

కూడా. క్రికెట్ బెట్టింగ్ డాన్ అయిన ప్రొద్దుటూరు నరసింహకు అత్యంత సన్నిహితుడు. అతడి సహకారంతో క్రికెట్ బెట్టింగ్ ముమ్మరంగా కొనసాగించాడు. ఐ.పి.ఎల్ , వర్ల్డ్ కప్ ,

కె.పి.ఎల్ మ్యాచ్ ల్లో జోరుగా పందేలు నిర్వహించాడు. కమ్యూనికేటర్ బాక్సులో 26 మొబైల్ ఫోన్లు అనుసంధానించి వాటి సహాయంతో ఫంటర్ల నుండీ పందేలు స్వీకరిస్తాడు.

ప్రస్తుతం అరెస్టయిన మిగితా తన సహచరుల ద్వారా ల్యాప్ టాప్ లలో ఫంటర్లు కాచిన పందేల వివరాలు నమోదు చేసుకుని ఆతర్వాత లావాదేవీలు నిర్వహించే వాడు. ప్రతీ మ్యాచ్ లోనూ

రూ. లక్షల్లో పందేలు నిర్వహించాడు. మన జిల్లాలోనే కాకుండా రాష్టంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుండీ కూడా పందేలు స్వీకరించి క్రికెట్ లావాదేవీలు

కొనసాగించాడు. క్రికెట్ బెట్టింగులతో పాటు హత్యలు, హత్యాయత్నాలు, గొడవలు, దాడులు, గంజాయి విక్రయం కేసుల్లో కూడా ఇతను నిందితుడు. తాడిపత్రి, అనంతపురం, ధర్మవరం

పోలీసు స్టేషన్ల పరిధుల్లో పలు నేరాలకు పాల్పడ్డాడు. ఇతనిపై 20 కేసులు ఉన్నాయి. ఇతనితో పాటు మిగితా తొమ్మిది మంది కూడా క్రికెట్ బుకీలే. వీరు కూడా స్థానిక ఫంటర్ల

నుండీ క్రికెట్ పందేలు సేకరించి జావెద్ ద్వారా బెట్టింగు నిర్వహిస్తున్నారు. వీరందరిపైన క్రికెట్ బెట్టింగు మరియు గంజాయి కేసులున్నాయి. à°—à°¤ ఒకటిన్నర సంవత్సర

కాలంగా కళ్లు గప్పి తన అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ అందుకు తగ్గట్టుగానే ఇతను సాంకేతికతను

ఉపయోగించుకుంటున్నాడు. క్రికెట్ బెట్టింగు వ్యవహారంలో కమ్యూనికేటర్ బాక్సు వినియోగం దాటేసి వివిధ మొబైల్ యాప్ ల ద్వారా లేటేస్ట్ గా గుట్టు చప్పుడు కాకుండా

కొనసాగిస్తున్నాడు. 

పోలీసులకు అదుపులోకి చిక్కింది ఇలా : ... 

  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ ఎక్కడా క్రికెట్ బెట్టింగు జరుగరాదని ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు గట్టి

ఆదేశాలు జారీ చేశారు. తాడిపత్రి డీఎస్పీ ఏ.శ్రీనివాసులు, ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ పర్యవేక్షణలో తాడిపత్రి పట్టణ సి.ఐ తేజోమూర్తి, ధర్మవరం రూరల్ సి.ఐ చిన్న

పెద్దయ్య, తాడిపత్రి పట్టణ ఎస్ ఐ ఖాజా హుస్సేన్ , బత్తలపల్లి ఎస్ ఐ రామకృష్ణారెడ్డిల ఆధ్వర్యంలో సిబ్బంది తాడిపత్రి హెడ్ కానిస్టేబుల్ రఘు, కానిస్టేబుళ్లు భాస్కర్ ,

శీనానాయక్ , గోవింద్ లు... à°§à°°à±à°®à°µà°°à°‚ రూరల్ హెడ్ కానిస్టేబుల్ రామదాసు, తాడిమర్రి, ధర్మవరం, బత్తలపల్లి కానిస్టేబుళ్లు సతీష్ కుమార్ , సుబ్బ, నాగార్జన, మాబు హుస్సేన్ ,

హరినాథ్ రెడ్డిలు ప్రత్యేక బృందంగా ఏర్పడి ఇదే పనిలో నిమగ్నమయ్యారు. తాడిపత్రి పట్టణంలోని ఓ ఇంట్లో ఈ నిందితులంతా సమూహంగా ఏర్పడి క్రికెట్ బెట్టింగు

నిర్వహిస్తున్నట్లు ఈ ప్రత్యేక బృందం పోలీసులు పక్కా సమాచారం అందుకున్నారు. కర్నాటక రాష్ట్రం మైసూరు వేదికగా బళ్లారి v/s బెళగావి జట్ల మధ్య జరుగుతున్న కె.పి.ఎల్ (

కర్నాటక ప్రీమియర్ లీగ్ ) క్రికెట్ టోర్నీ మ్యాచ్ లలో  à°¬à±†à°Ÿà±à°Ÿà°¿à°‚గు నిర్వహిస్తున్న వీరిని అరెస్టు చేశారు.

ఎస్పీ ప్రశంస : ... 
ఈ ముఠాను అత్యంత చాకచక్యంగా

పట్టుకున్న తాడిపత్రి డీఎస్పీ ఏ.శ్రీనివాసులు, ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ , తాడిపత్రి పట్టణ సి.ఐ తేజోమూర్తి, ధర్మవరం రూరల్ సి.ఐ చిన్న పెద్దయ్య, తాడిపత్రి పట్టణ ఎస్ ఐ

ఖాజా హుస్సేన్ , బత్తలపల్లి ఎస్ ఐ రామకృష్ణారెడ్డి, తాడిపత్రి హెడ్ కానిస్టేబుల్ రఘు, కానిస్టేబుళ్లు భాస్కర్ , శీనానాయక్ , గోవింద్ లు... à°§à°°à±à°®à°µà°°à°‚ రూరల్ హెడ్

కానిస్టేబుల్ రామదాసు, తాడిమర్రి, ధర్మవరం, బత్తలపల్లి కానిస్టేబుళ్లు సతీష్ కుమార్ , సుబ్బ, నాగార్జన, మాబు హుస్సేన్ , హరినాథ్ రెడ్డిలను జిల్లా ఎస్పీ భూసారపు సత్య

ఏసుబాబు ప్రశంసించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam