DNS Media | Latest News, Breaking News And Update In Telugu

31న గ్రామ సచివాలయ పరీక్షలకు సామాగ్రి పంపిణి : 

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ నివాస్ 

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 29, 2019 (డిఎన్‌ఎస్‌):

జిల్లాలో నిర్వహించే గ్రామ సచివాలయ పరీక్షలకు సంబంధించిన సామాగ్రిని ఆయా కేంద్రాలకు ఈ నెల 31న పంపిణీచేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో  à°—్రామ సచివాలయ పరీక్షల నిర్వహణపై మండల అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. à°ˆ సందర్భంగా

కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుండి ప్రారంభం కానున్న గ్రామ సచివాలయ పరీక్షలకు సంబంధించిన పరీక్షా సామాగ్రిని ఈ నెల 31కే పంపిణీ కేంద్రాలకు చేరాలని

కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరింటిండెంట్, అదనపు చీఫ్ సూపరింటిండెంట్, ఇన్విజిలేటర్ విధిగా హాజరు కావాలని

తెలిపారు. సామగ్రి పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లను పరీక్షా కేంద్రాల వారీగా చేయాలని సూచించారు. అందుకు తగిన బోర్డులను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రిజర్వ్

లో ఉన్న చీఫ్ సూపరింటిండెంట్లు టెక్కలి, పాలకొండ, శ్రీకాకుళం  à°†à°°à±.à°¡à°¿.à°“ à°² ఆధీనంలో ఉంటారని తెలిపారు. కావున పరీక్షా కేంద్రాలకు సిబ్బంది అవసరమైతే ఆర్.à°¡à°¿.à°“ లను

సంప్రదించాలని అన్నారు. జిల్లాలో 1300 మంది విభిన్న ప్రతిభావంతులు పరీక్షలు రాయనున్నారని, వారికి గ్రౌండ్ ఫ్లోర్ లోనే పరీక్ష రాసేందుకు ఏర్పాట్లను చేయాలని

చెప్పారు. అలాగే విభిన్న ప్రతిభావంతులకు పరీక్ష రాయుటకు సహాయకులను, రాత బల్లలు లేదా పాడ్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎచ్చెర్ల , హిరమండలం, ఇచ్చాపురం, టెక్కలి,

శ్రీకాకుళం మండల కేంద్రాల్లో ఎక్కువగా విభిన్న ప్రతిభా వంతులు పరీక్షలు రాయనున్నారని, కాబట్టి ఆయా కేంద్రాల ఏర్పాట్లలో మరిన్ని ఎక్కువ చర్యలు తీసుకోవాలని

సూచించారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో వీడియో గ్రాఫర్ ఏర్పాటుచేయాలని, పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ సీరియల్ నంబరు ప్రకారం, ప్రశ్న పత్రం కోడ్ అనుసరించి

ఎటువంటి లోపం లేకుండా ఓ.ఎం.ఆర్.షీట్, ప్రశ్న పత్రం అందజేయాలని తెలిపారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లు ఉండరాదని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులకు స్పష్టం చేసారు.

దూరప్రాంతాల నుండి ఈ నెల 31 రాత్రి నాటికి వచ్చే అభ్యర్థుల కోసం వసతి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలియజేయగా, వారికోసం వసతి సౌకర్యాలు సిద్ధం చేసినట్లు మండల

అధికారులు తెలిపారు. పరీక్షలు జరుగుతున్న పాఠశాలలు, కళాశాలకు పరీక్ష సామగ్రి పంపిణీ దృష్ట్యా 31న స్థానిక సెలవుగా ప్రకటించడం జరిగిందని, పరీక్షలు రాసే అభ్యర్ధుల

కొరకు జిల్లాలో 217 ఆర్ టి సి బస్సులు ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షలు జరుగుతున్న కేంద్రాలకు సెప్టెంబరు 3,4,6,7 తేదీల్లో స్థానిక సెలవును ప్రకటించుటకు

అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, విధులకు ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని తేల్చిచెప్పారు.

పరీక్షలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతిని గుర్తించాలని అధికారులకు తెలిపారు. జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పరీక్షలలో భాగస్వామ్యం కావడం

గర్వకారణంగా భావించాలని కలెక్టర్ వివరించారు.
   à°ˆ వీడియో సమావేశంలో సంయుక్త కలెక్టర్ à°¡à°¾. కె.శ్రీనివాసులు, సంయుక్త కలెక్టర్-2 పి.రజనీకాంత రావు, సహాయ కలెక్టర్

ఏ.భార్గవ్ తేజ, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, జిల్లా విద్యాశాఖాధికారి కె. చంద్ర కళ, జిల్లా పరిషత్ ఉప ముఖ్యకార్యనిర్వహణాధికారి ప్రభావతి, ఆర్.టి.సి జిల్లా

మేనేజర్ అరుణ, పి.ఆర్.ఓ బి.ఎల్.పి.రావు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam