DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వీళ్ళు టిటిడి లో ఉద్యోగులా లేక తెలుగుదేశం కార్యకర్తలా ? :ఎమ్మెల్సీ మాధవ్ 

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ వివాదం పై హై కమిటీ తో విచారణ జరిపించాలి : 

హిందూ ఆలయాల్లో రాజకీయ జోక్యం తగదు : 

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ నుంచి అన్యమత ఉద్యోగుల్ని బయటికి పంపాలి 

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿

ఉద్యోగులు స్వామికే బద్దులు à°—à°¾ ఉండాలి 

విశాఖపట్నం, మే 25, 2018 (డిఎన్‌ఎస్‌) : తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణల పై నిజ నిజాలు

తేల్చడానికి హైపవర్ కమిటీ తో విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ పీవీఎన్  à°®à°¾à°§à°µà± డిమాండ్ చేశారు. శుక్రవారం నగరం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ

టిటిడి పరిధిలో పనిచేసే ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, శ్రీవారి హుండీ లో భక్తులు వేసే మొక్కుబడులు నుంచి జీతాలు తీసుకునే సిబ్బంది మాత్రమే అన్నారు.

టిటిడి లో ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరూ హిందువు మాత్రమే అయ్యి ఉండాలని, వారు శ్రీవారి భక్తులుగానే ఉండాలన్న కనీసం నిబంధనను తుంగలోకి తొక్కి 1500 కి పైగా

క్రైస్తవులకు ఉద్యోగాలిచ్చారన్నారు.  à°µà±€à°°à°¿à°¨à°¿ వేరే ప్రభుత్వ విభాగాలకు బదిలీ చెయ్యాలి అని కోట్లాది మంది హిందూ భక్తులు నిరసనలు చేస్తున్న పట్టించుకోక పోగా

వీరికి పదోన్నతులు కల్పించి మరీ లక్షలాది రూపాయలు హిందువు భక్తుల మొక్కుబడులను క్రైస్తవుల పాలు చేస్తోందన్నారు. నిబంధనలకు విరుద్దంగా టిటిడి లో ఉద్యోగాల్లో

చేరడమే కాకుండా, తమను తొలగించవద్దని కోర్టులో కేసులు కూడా వెయ్యడం దాన్ని, à°ˆ తెలుగుదేశం ప్రభుత్వం సమర్ధించడం వెనక వీరి చేతగాని తనం బయట పడుతోందన్నారు. 
పైగా

ప్రభుత్వం చేస్తున్న అవకతవకలపై ప్రశ్నించిన అర్చకుని పై వేటు వెయ్యడమే కాకుండా, ఆయనకి వ్యతిరేకంగా టిటిడి సిబ్బంది చేత నల్ల బ్యాడ్జి లతో నిరసనలు చేయించడం

హిందువుల దురదృష్టమన్నారు. టిటిడి చైర్మన్ గా నియమించిన వ్యక్తి క్రైస్తవ మత అభిమాని, అతన్ని తక్షణం మార్చండి అని లక్షలాది మంది శ్రీవారి భక్తులు నిరసనలు

తెలియచేస్తే తెలుగుదేశం ప్రభుత్వం క్రైస్తవుల ఓట్లు కోసం తిరుమల ను కూడా రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. 

నల్లని వస్త్రం తో నిరసనా ? సిగ్గు

సిగ్గు 

ధార్మిక సంస్థల్లో ఉద్యోగాలు చేసే వారు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపకూడదని, ఆలయాలలో నల్లని వస్త్రం వాడరాదన్నారు. పైగా. . . తిరుమల ఆలయంలోకి దర్శనం కు

వెళ్లే ఆర్జిత సేవ భక్తులను నల్లని వస్త్రాలతో వెళ్లనివ్వరని, అలా నల్ల వస్త్రాలతో లోనికి వెళ్లే భక్తులను అడ్డుకునే టిటిడి సిబ్బందే ఇలా నల్ల బట్టతో ఉద్యోగం

చెయ్యడం ఏంటని ప్రశ్నించారు. వీళ్ళ తో తెలుగుదేశం నిరసనలు చేయించి హిందూ ధర్మాన్ని కించపరిచిందన్నారు. 

అతి త్వరలో మరో వాస్తవం వెలుగు లోకి రానుందన్నారు.

దీనిపై ముఖ్యమంత్రే జవాబు చెప్పవలసి వస్తుందన్నారు. 

 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam