DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నవంబర్ 2 నుంచి అమెరికా తెలుగు సాహితీ సదస్సు

ఖండాంతరాల్లో తెలుగు సాహితీ వైభవం .

ప్రవాసీ ఆంధ్రుల్లో తెలుగు ప్రాభవం  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 02, 2019 (డిఎన్‌ఎస్‌): ప్రవాసీ

ఆంధ్రులు నిర్వహిస్తున్న తెలుగు సాహితీ సదస్సులతో తెలుగు ప్రాభవాన్ని ఖండాతరాల్లో వైభవంగా ప్రసరింపచేస్తున్నారు. వివిధ వృత్తుల్లో స్థిరపడిన తెలుగు వారు

తెలుగు భాషపై ఉన్న అనురాగం తో నిర్వహించే సాహితీ సదస్సులకు ఖండాతరాల్లో ఎంతో ప్రాధాన్యత లభిస్తోంది. ప్రధానంగా ప్రముఖ సాహితీ వేత్త వంగూరి చిట్టెం రాజు

నేతృత్వంలోని వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & బృహత్ ఆర్లాండో తెలుగు సంఘం ఎన్నో సాహితీ సభలు జరుగుతున్నాయి.

ప్రధానంగా అమెరికా తెలుగు సంఘం నిర్వహిస్తున్న

సాహితీ సదస్సుల్లో వైద్యులు, ఇంజనీర్లు, విద్యా వేత్తలు, పారిశ్రామిక వేత్తలు ఇలా అన్ని రంగాలకు చెందిన వారూ పాల్గొని ఆకట్టుకుంటోంది. 1998 లో ప్రారంభం అయిన నాటి

నుంచి క్రమం తప్పకుండా జరుగుతున్నా సదస్సులు à°ˆ ఏడాది  11à°µ అమెరికా తెలుగు సాహితీ సదస్సు బృహత్ ఆర్లాండో నగర ప్రాంతంలో నవంబర్ 2-3, 2019 (శనివారం, ఆదివారం) తారీకులలో

జరగబోతోంది

ఈ సదస్సుల్లో పాల్గొనేందుకు ఉత్తర అమెరికా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలు, పండితులు, విమర్శకులు, వక్తలు, భాషాభిమానులనూ సాదరంగా

ఆహ్వానిస్తున్నాన్నారు. 

సదస్సు ప్రధానాశయాలు

       à°—à°¤ 55 ఏళ్ళకి పైగా అమెరికాలో వెల్లివిరుస్తున్న తెలుగు సాహిత్య ప్రక్రియలలో, ముఖ్యంగా అమెరికా

తెలుగు కథ, కవితల ఆవిర్భావం, మారుతున్న పరిణామాలు, ప్రమాణాలు, ఆధునిక పోకడలు మొదలైన సాహిత్య పరమైన విషయాలు నెమరు వేసుకోవడం.

·     సాహిత్య పరమైన విషయాలపై కూలంకష

పరిజ్ణానం, సాధికారత ఉన్న ప్రతిభావంతులు సహ సాహితీవేత్తలతో సభాముఖంగా ప్రసంగించే అవకాశాలు, స్వీయ రచనా పఠనం వేదిక లో రచయితలూ, కవులూ తమ రచనలను స్వయంగా వినిపించే

అవకాశాలు కలిగించడం.

·       సహ రచయితలను, సాహితీవేత్తలనూ, తెలుగు భాషా, సాహిత్యాభిమానులనూ వ్యక్తిగతంగా, ఆత్మీయ సాహిత్య వాతావరణంలో కలుసుకొని, సాహిత్య

పరిచయాలను పెంచుకొనడం.

·     రెండు రోజుల పాటు కేవలం వినోదం, విజ్ణానం వెదజల్లే తెలుగు భాషా, సాహిత్య పరిమళాలను తనివి తీరా ఆస్వాదించడం.

అదనపు

ఆకర్షణలు

నిష్ణాతుల సాహిత్య ప్రసంగాలు, ఆర్లాండో నగర తెలుగు ఉపాధ్యాయుల సత్కారం, నూతన పుస్తకావిష్కరణలు, పుస్తక విక్రయ శాల, సరదా సాహిత్య పోటీలు, జీవన సాఫల్య

పురస్కారం, అందరూ పాల్గొనే గొలుసు కథ, మరెన్నో... చోటు చేసుకోనున్నాయి. . .

ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సులో ప్రసంగించదల్చుకున్న వారు, స్వీయ రచనా విభాగంలో తమ రచనలను

వినిపించదల్చుకున్నవారూ నిర్వాహకులను  à°¸à°‚ప్రదించవచ్చు. 

ప్రసంగాంశాలు ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక పోకడల దాకా తెలుగు భాష సాహిత్యాలకి పరిమితమై

ఉండాలి. అమెరికాలో తెలుగు సాహిత్య పోకడల మీద ప్రసంగాలను ప్రత్యేకంగా ఉండాలి. మరిన్ని వివరాలకి à°ˆ క్రింది వారిని సంప్రదించవచ్చు. 

సంచాలకులు : నరోత్తమ్

జీడిపల్లి (అధ్యక్షులు, బృహత్ ఆర్లాండో తెలుగు సంఘం)
(Phone: 407 474 9927, e-mail: ngidipally5046@gmail.com)

వంగూరి చిట్టెన్ రాజు (అధ్యక్షులు, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా) 
(Phone: 832 594 9054, e-mail: vangurifoundation@gmail.com)

సహ

సంచాలకులు (Co-Convener):  à°•à±ƒà°·à±à°£ మునుగోటి (Phone:  813 943 5046 e-mail: munugoti@hotmail.com)

ప్రధాన మన్వయ కర్త (Chief Coordinator): మధు చెరుకూరి
(Phone: 407 415 2055, e-mail: madhu_cherukuri@hotmail.com

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam