DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మోడీ నిరంకుశ వైఖరిపై ప్రజాగ్రహం తప్పదు

ఆంధ్రాబ్యాంకు విలీనంపై సిపిఐ, సిపిఎం నిరసన

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 03, 2019 (డిఎన్‌ఎస్‌) :దేశవ్యాప్తంగా ప్రజా

వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న మోడీ నిరంకుశ వైఖరిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా వామపక్షాలు నిరాశరణాలు తెలియచేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర

వరం లో జరిగిన నిరసనల్లో ప్రజలు సునిశితంగా గమనిస్తున్నారని,  à°°à°¾à°¨à±à°¨à±à°¨ రోజుల్లో మోడీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని, ప్రజాగ్రహానికి మోడీ

ప్రభుత్వం గురికాక తప్పదని సిపిఐ నగర కార్యదర్శి నల్లా రామారావు హెచ్చరించారు. ఆంధ్రాబ్యాంకు విలీనంపై సిపిఐ, సిపిఎం రాష్ట్ర వ్యాప్త నిరసన పిలుపులో భాగంగా

మంగళవారం ఉదయం స్ధానిక కోటగుమ్మం ఆంధ్రాబ్యాంకు శాఖ కార్యాలయం వద్ద సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఆంధ్రాబ్యాంకు విలీనాన్ని నిలిపివేయాలని,

మోడీ నిరంకుశ వైఖరిని విడనాడాలని, వామపక్షాల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈసందర్భంగా నల్లా రామారావు మాట్లాడుతూ 1980లో ఆంధ్రాబ్యాంకును అప్పటి

ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జాతీయం చేశారని, అప్పుడు కేవలం 974 పూర్తిస్ధాయి శాఖలు, 40 క్లస్టర్‌ శాఖలు, 76 ఎక్స్‌టెన్షన్‌ కౌంటర్లు మాత్రమే ఉండగా ప్రస్తుతం 2,904 శాఖలు, 21,740

మంది ఉద్యోగులతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సాతో దేశంలోని పలు రాష్ట్రాలలో విస్తృతస్ధాయిలో సేవలను అందిస్తోందన్నారు. 96 సంవత్సరాలు పూర్తి చేసుకున్న

ఆంధ్రాబ్యాంకును యూనియన్‌ బ్యాంకులో విలీనం చేయడం తెలుగు ప్రజల పట్ల కేంద్రానికి ఉన్న వివక్షతకు నిదర్శనమన్నారు. 

సిపిఎం జిల్లా కార్యదర్శి à°Ÿà°¿.అరుణ్‌

మాట్లాడుతూ టర్నోవర్‌ తక్కువైనా మహారాష్ట్ర బ్యాంక్‌ను కొనసాగిస్తూ ఆంధ్రాబ్యాంకును మాత్రం యూనియన్‌ బ్యాంకులో విలీనం చేయడం బ్యాంకు వ్యవస్ధాపకులు

భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆశయాలకు విరుద్ధంగా ఉందన్నారు. సిపిఐ నగర సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ అంటే ఆదినుండీ మోడీ

ప్రభుత్వానికి చిన్నచూపు ఉందని, ప్రత్యేక హోదా, విభజన హామీలు కూడా అమలు చేయకుండా రాష్ట్రానికి మొండిచెయ్యి చూపించిన మోడీ ప్రభుత్వం తాజాగా ఆంధ్రాబ్యాంకు

విలీనం చేయడం తెలుగు ప్రజలపై వివక్ష చూపడమేనని అర్ధమవుతుందన్నారు. ఆంధ్రాబ్యాంకు విలీనం నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. మోడీ నియంతలా

వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నిరసనకు సిపిఐ( ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎవి రమణ, ఆర్‌.సురేష్‌బాబు, కె.ఆదినారాయణ, ఎఐబిఇఏ రాష్ట్ర కార్యదర్శి

ఎన్‌.లక్ష్మీపతిరావు మద్దతు పలికారు. ఈకార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి వంగమూడి కొండలరావు, నల్లా భ్రమరాంబ, యడ్ల లక్ష్మి, సేపేని రమణమ్మ, నల్ల కుమారి, మొగల్‌

జీనత్‌ బేగం, సిడగం నౌరోజీ, కాసాని శంకరరావు, పామర్తి సూర్యప్రకాశరావు, ఎవివి సత్యనారాయణ, యడ్ల అప్పారావు, రాయి నాగేశ్వరరావు, షేక్‌ పెంటు సాహెబ్‌, వీసరపు రాంబాబు,

కరిబెండి శ్రీను, బద్దాని లక్ష్మి, సిపిఎం నాయకులు టిఎస్‌ ప్రకాష్‌, సావిత్రి, తులసి, ఎస్‌ఎస్‌ మూర్తి, బి.రాజు లోవ, బి.పవన్‌, పూర్ణిమా రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

/>  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam