DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజా వ్యతిరేక విధానాలు కేంద్రం మానుకోవాలి

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 05, 2019 (డిఎన్‌ఎస్‌): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు ప్రజా

వ్యతిరేక విధానాలు విడాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు à°¡à°¿.గోవిందరావు డిమాండ్ చేసారు. గురువారం పట్టణం లో నిర్వహించిన ధర్నా లో అయన మాట్లాడుతూ  à°•à±‡à°‚ద్ర మోడి

ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు, ఎపి రైతు సంఘం, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరు కార్యాలయం వద్ద

గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండోసారి అధికారం లోకి వచ్చిన బీజేపీ నాయకత్వం లోని మోడీ ప్రభుత్వం కార్మికులపై ముప్పేట దాడి

మొదలుపెట్టిందని, కార్మిక చట్టాలలో కార్మిక వ్యతిరేక మార్పులు ప్రారంభించిందని అన్నారు. పార్లమెంట్ లో కొత్త వేతన బిల్లు తన మంద బలం తో పాస్ చేసిందని టిడిపి,

వైసిపి ఆ బిల్లు కు మద్దతు ఇచ్చాయని విమర్శించారు. కార్మిక సంఘాలు కోర్కెలు మోడీ ప్రభుత్వం పట్టించుకోకుండా తాను పాస్ చేసిన కొత్త చట్టం ఆధారంగా కేవలం రోజుకు

రూ.178/-లు మాత్రమే జాతీయ కనీస వేతనంగా ప్రకటించిందని అన్నారు.  à°ªà°¨à°¿à°—ంటలు,వేతనంతో కూడిన సెలవులు, ఆరోగ్య పరిరక్షణ, భద్రత, సమాన పనికి సమాన వేతనం తదితర హక్కులు

కాలరాస్తూ  à°•à±‡à°‚ద్ర బిజెపి ప్రభుత్వం 17 కార్మిక చట్టాలు రద్దు చేసిందని విమర్శించారు.
15వ కార్మిక మహాసభ సిఫార్సులు మరియు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నెలకు రూ. 18

వేల (రోజుకు 692/-లు చొప్పున) కనీస వేతనం గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.కార్మికులకు నష్టం కలిగించే కార్మిక చట్టాల మార్పులు ఉపసంహరించుకోవాలని, దేశ ఆర్థిక

వ్యవస్థకు పట్టుకొమ్మలుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు మరియు రైల్వేల ప్రైవేటీకరణను ఆపాలని. షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ కార్మికులందరికీ కనీస వేతనాలు సవరించాలని,

అసంఘటిత కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని. కార్మికుల పై రాజకీయ వేధింపులు, తొలగింపులు ఆపాలని, కార్మికుల ఆందోళనలపై పోలీసుల నిర్భంధాన్ని ఆపాలని

డిమాండ్ చేసారు. కార్పోరేట్ à°² ప్రయోజనాలు కోసం  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°°à°‚à°— బ్యాంకులు à°’à°• దానితో à°’à°•à°Ÿà°¿ కలిపేస్తుందని విమర్శించారు. 
మోడీ ప్రభుత్వం రైతులు, వ్యవసాయ

కార్మికులకు ప్రమాదకరంగా తయారైందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదని, కౌలు రైతులకు పెట్టుబడి సహాయం అందడం లేదని, బ్యాంకులు రుణాలు ఇవ్వడం

లేదని విమర్శించారు.  à°•à±‡à°‚ద్ర ప్రభుత్వ పంటల బీమా పథకం రైతులకు కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ లకు వరం à°—à°¾ మారిందని. పంటలకు నష్టపరిహారం రావడం లేదని

తెలిపారు. రైతులు పండించే పంటలకు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం పూర్తి మద్దతు ధరలు అమలు చేయాలని డిమాండ్ చేసారు. దేశంలో గత 50 సంవత్సరాలుగా లేని స్థాయిలో

నిరుద్యోగం పెరిగి, లక్షలాది మంది ఉపాధి కోల్పోతే ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయింపు పెంచాల్సిన ప్రభుత్వం, ఉపాధి హామీ నిధులు కోత పెట్టిందని అన్నారు.ఉపాధి

హామీ పధకాన్ని నిర్వీర్యం చేసి వలసలకు కారణమవుతుందని విమర్శించారు.ఉపాధి హామీ పని దినాలు పెంచి వలసలు నివారించాలని,ఉపాధి హామీ బకాయిలు రూ. 600 కోట్లు వెంటనే

చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికులు కేంద్ర ప్రభుత్వ నిధులతో వేతనాలు, పని భద్రత, ఉపాధి, ఆరోగ్యం, పెన్షన్, పి. ఎఫ్, తదితర ప్రయోజనాలతో కూడిన సమగ్ర

సంక్షేమ చట్టం తేవాలని డిమాండ్ చేశారు.కౌలు రైతులకు యజమానులు సంబంధం లేకుండా గుర్తింపు కార్డు లివ్వాలని, బ్యాంకుల నుంచి ఋణాలివ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో

మూసి వేసిన పరిశ్రమలు తెరిపించాలని డిమాండ్ చేసారు. అరబిందో కార్మికుల చార్టర్ అఫ్ డిమాండ్స్ పరిష్కారించాలని డిమాండ్ చేశారు.  à°ˆ కార్యక్రమంలో సంఘాల నాయుకులు

టి.తిరుపతి రావు, ఎమ్.ఆదినారాయణ మూర్తి, సి.హెచ్.అమ్మన్నాయుడు, దావాల.రమణ, అల్లు.సత్యం, జి.ఈశ్వరమ్మ, అప్పలరాజు, వై.చలపతిరావు, పి.గోపి, టి.నందోడు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Jun 2, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam