DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలయాన్నీ, అర్చకుణ్ణీ  కూడా విస్మరించారు 

అర్చక వేతనాలు రూ 35 వేలు అన్నారు, ఆమోదం లేదు.  

మంత్రిమండలి లో మాట కూడా ఎత్తలేదు. 

అర్చకులంటే à°…à°‚à°¤ నిర్లక్ష్యం కూడదు. 

మండిపడుతున్న అర్చక

సంఘాలు 

ఖజానా నుంచి కానీ ఇవ్వడం లేదు :.. . . 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) . . . 

విశాఖపట్నం, సెప్టెంబర్ 05, 2019 (డిఎన్‌ఎస్‌) : బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశం లో

ఆలయాలనే, అర్చకులనీ కూడా విస్మరించారణై అర్చక స్నాఘలు మండిపడుతున్నాయి. వందలాది ఆలయాల్లో కనీస ధూప దీప నైవేద్యాలకు కూడా నిధులు లేవని, అర్చకులు అర్ధాకలి తో

ఉన్నా పట్టించుకునే నాధుడే లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 6 సి ఆలయాల్లోని అర్చకులకు  à°•à°¨à±€à°¸ వేతనం 25 శాతం పెంచాలని, ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు  à°°à±‚.10 వేల

నుంచి 35 వేల వరకూ పెంచుతున్నట్టు  à°—à°¤  à°¨à±†à°² 20 à°¨  (ఆగస్టు 20, 2019 ) లోనే జీవో విడుదల చేసినప్పటికీ మంత్రి మండలి దీనిపై ఎటువంటి చర్చకూడా చేపట్టలేదన్నాయి. గృహ నిర్మాణం కోసం

ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని జిఓ లో ఉన్నప్పటికీ ఆతీ గతీ లేదన్నాయి. రాష్ట్రంలోని అందరి సమస్యలనూ చర్చించేందుకు మంత్రి మండలి వద్ద సమయం ఉంది కానీ అర్చక సమస్యలు

చర్చించేందుకు సమయం లేకపోవడం దారుణమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. 

ఖజానా నుంచి కానీ ఇవ్వడం లేదు :.. . .

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఖజానా నుంచి

 à°¦à±‡à°µà°¾à°¦à°¾à°¯ శాఖకు  à°ªà±ˆà°¸à°¾ ఇవ్వడం లేదని, పైగా హుండీ లో పడిన ముడుపులు, కానుకలను అధికారుల జల్సా కు వాడుకుంటున్నారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. దేవుని పెటిరా

దోచుకు తినే శాఖ గానే మొదటి నుంచి à°ˆ శాఖ ఉందని అన్నాయి.  à°ªà±à°°à°¤à°¿ ఆలయం నుంచి కనీసం 30 శాతం ముందుగానే కట్టాలని టార్గెట్ లు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. హిందూ

ఆలయాల నుంచి వచ్చే నిధులు, భక్తులు చెల్లించే ముడుపులకు, కానుకలు ఆయా ఆలయాలే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. హిందూ ఆధ్యాత్మిక సంస్థల నుంచి వచ్చే నిధులు

హిందూ ధర్మ ప్రచారానికే వినియోగించాలి తప్ప, అన్యమత సంస్థలకు నిధులు తరలించడం అత్యంత దారుణమని ఎద్దేవా చేస్తున్నాయి. పైగా ఆలయాల నుంచి వచ్చిన నిధులు ప్రభుత్వ

ఖజానా కు తరలించడం ఏంటని, తక్షణం à°ˆ శాఖకు రద్దు చేసి, ఆలయాలను ప్రభుత్వ కబంద హస్తాలనుంచి విదుదల చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam