DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అనంతపూర్ లో ఆపరేషన్‌ ముష్కాన్‌ విజయవంతం 

వీధి బాలల గుర్తింపునకు బృహత్తర పధకం 

అనంతపూర్ జిల్లా ఎస్పీ నేతృత్వంలో పటిష్టం 

రెండు నెలల్లో 117 మంది బాలలకు విముక్తి

తల్లిదండ్రులకు,

సంరక్షణ విభాగాలకు అప్పగింత

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం). . .

అనంతపురం, సెప్టెంబర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌) : అయిన వారికి దూరమై... బతుకు బానిసై, భారమైన

చిన్నారుల మోముల్లో చిరు నవ్వులు పూయించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం " ఆపరేషన్ ముస్కాన్ " నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆపరేషన్ ముష్కాన్

కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఆదేశాలుతో శుక్రవారం మన జిల్లాలో పోలీసులు ఈకార్యక్రమాన్ని ఏక కాలంలో చేపట్టారు. చదువుకోవాల్సిన

వయసులో తల్లిదండ్రుల సంరక్షణ లేక రోడ్లపై తిరుగుతూ హోటళ్లు, రెస్టారెంట్‌లలో పనులు చేసుకుంటూ రోడ్లపై పడుకోవడం, ఎక్కడపడితే అక్కడ తింటూ కాలం వెళ్లదీస్తున్న

బాలల గుర్తింపునకు పోలీసులు వీధి వీధిన తిరిగి గుర్తించారు. రైల్వేస్టేషన్లు, ఆర్టీసీబస్టాండ్లు, ఇటుక బట్టీలు... ఇలా చాలా చోట్ల కార్మికులుగా మగ్గుతున్న బాలల

కోసం పోలీసులు జల్లెడపట్టి విముక్తి కల్పించారు. పోలీసులు శుక్రవారం నిర్వహించిన à°ˆ డ్రైవ్‌లో మొత్తం 31 మంది వీధి బాలలను గుర్తించారు. వీరిలో à°’à°• బాలిక కూడా ఉంది.

అనంతపురం సబ్ డివిజన్ పరిధిలో ఏడుగుర్ని, ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలో ఇద్దర్ని, గుంతకల్లు సబ్ డివిజన్ పరిధిలో తొమ్మిది మందిని, కళ్యాణదుర్గం సబ్ డివిజన్ పరిధిలో

ముగ్గుర్ని, పెనుకొండ సబ్ డివిజన్ పరిధిలో నలుగుర్ని, పుట్టపర్తి సబ్ డివిజన్ పరిధిలో ఆరుగుర్ని గుర్తించినట్లు ఎస్పీ భూసారపు సత్యఏసుబాబు తెలిపారు.  à°µà±€à°°à°¿à°²à±‹ 24

మంది చిన్నారులను తల్లిదండ్రులకు... ఐ.సి.à°¡à°¿.ఎస్ అధికారులకు నలుగుర్ని, లేబర్ విభాగం అధికారులకు ముగ్గుర్ని అప్పగించారు. 
** గత రెండు నెలల్లో 86 మంది బాలలకు

ఈకార్యక్రమం ద్వారా విముక్తి కల్పించారు. వీరిలో 72 మంది బాలురు కాగా 14 మంది బాలికలున్నారు. ఈ 86 మందిలో 78 మంది చిన్నారులను ఆయా తల్లిదండ్రులకు... మిగితా 8 మందిని లేబర్

విభాగం అధికారులకు అప్పగించారు. ఈరోజు గుర్తించి పట్టుకున్న 31 మంది చిన్నారులతో కలిపి మొత్తం 117 మంది బాలలకు విముక్తి కల్పించినట్లయ్యింది. వీరిలో 102 మందిని ఆయా

తల్లిదండ్రులకు ... లేబర్ విభాగం అధికారులకు 11 మందిని, ఐ.సి.డి.ఎస్ అధికారులకు నలుగుర్ని అప్పగించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam