DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శనివారం నాటికి 96 శాతం బియ్యం పంపిణీ 

ఇంటి ముంగిటకే బియ్యం - à°²à°¬à±à°¦à°¿à°¦à°¾à°°à±à°²à± సంతోషం

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌):

 à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ ఇంటింటికి నాణ్యమైన బియ్యం పంపిణీకి జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుని శని వారం ఒక్క రోజునే శత శాతం పంపిణీ చేయుటకు చర్యలు చేపట్టింది. అయికే

సీతంపేట ప్రాంతంలో వర్షం కురిసిన కారణంగాను, కొంత మంది ఇళ్ళ వద్ద లేని కారణంగాను శని వారం సాయంత్రం నాటికి 96 శాతం మేర బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ప్రజల

అభిరుచుల మేరకు ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్యాకింగులో నాణ్యమైన బియ్యం పంపిణీ చేయడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేసారు. ప్యాకింగు బాగుంది. బియ్యం నాణ్యతా

బాగుంది అంటూ ఆనందం వ్యక్తం చేసారు. జిల్లాలో బూర్జ మండలం లాబాం గ్రామంలో రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని

ప్రజలకు స్వయంగా పంపిణీ చేయడమే కాకుండా బియ్యం నాణ్యతను పరిశీలించారు. ప్రజల నుండి బియ్యం నాణ్యతపై ఆరా తీసారు. జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు శాసన

సభాపతితో లాబాం గ్రామంలో పాల్గొనడమే కాకుండా శ్రీకాకుళం నగరపాలక సంస్ధ పరిధిలో 39వ వార్డు దమ్మల వీధిలో ఇంటింటికి బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు తమ పరిధిలో వివిధ ప్రాంతాల్లో బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పర్యవేక్షించారు. ఇటీవల వర్షాలకు రవాణా సమయంలో

బియ్యం ప్యాకెట్లు కొన్ని తడిసిపోవడం, అటువంటి బియ్యం కొన్ని చౌక ధరల దుకాణాలకు సరఫరా కావడం వాటిని లబ్దిదారులకు పంపిణీ చేయడం జరిగింది. అయితే వాటిని

లబ్దిదారులు గుర్తించి తెలియజేసీన వెంటనే మార్పు చేయడం జరిగింది. ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా ఉండే విధంగా, ప్రభుత్వ ఉద్దేశ్యం, లక్ష్యం మేరకు నాణ్యమైన

బియ్యం పంపిణీ చేయుటకు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రేయింబవళ్ళు పనిచేసే కంట్రోల్ రూమ్ ను నెలకొల్పి జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్

కలెక్టర్ శ్రీనివాసులు పర్యవేక్షిస్తున్నారు. బియ్యం రవాణా సమయంలో ప్యాకెట్లు తడవడం వలన కొన్ని ప్యాకెట్లలో బియ్యం నాణ్యత దెబ్బతినడం జరిగింది. ఇటువంటి

పరిస్ధితి 25 ప్రాంతాల్లో 30 ప్యాకెట్లలో గుర్తించగా వెటనే వాటిని మార్పు చేయించి నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేసి జిల్లా యంత్రాంగ పూర్తి అప్రమత్తంగా ఉందని

తెలియజేసారు. రవాణాలో ఎటువంటి అంతరాయం కలుగకుండా ఉండేందుకు డిప్యూటి ట్రాన్సుపోర్టు కమీషనర్ డా.వడ్డి సుందర్ కంట్రోల్ రూమ్ నుండి రవాణా వ్యవస్ధను

పర్యవేక్షించారు.  

 à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ నగర పాలక సంస్ధ పరిధిలో హెచ్.బి. కాలనీకి చెందిన à°Ÿà°¿.సంతోష్ బియ్యం నాణ్యత బాగుందని సంతోషం వ్యక్తం చేసారు. ప్యాకింగు చక్కగా

ఉందని ఆయన అన్నారు. పాలకొండ మునిసిపాలిటి పరిధి ఇందిరా నగర్ కాలనీకి చెందిన చింతా కృష్ణమూర్తి, కొప్పల రేవతి బియ్యం నాణ్యత బాగుందని అభిప్రాయపడ్డారు. పాలకొండ

యాలాం సెంటర్ వద్ద నివాసం ఉంటున్న జి.విజయలక్ష్మి, వి.అనూరాధ, పి.కమలమ్మ బియ్యం బాగున్నాయని, రాళ్ళు, రద్దు లేదని నేరుగా అన్నం వండుకోవచ్చని

పేర్కొన్నారు.

టెక్కలి జంగం వీధికి చెందిన పట్నాన లవ కుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ à°¨à°¾à°£à±à°¯à°®à±ˆà°¨ బియ్యాన్ని నేరుగా ఇంటికి పంపించటం చాలా సంతోష

దాయకం. ఇదివరకు సమయాభావం వల్ల అనేక సందర్భాలలో బియ్యం విడిపించుకోలేకపోయే వాళ్ళం.  ప్రస్తుతం బియ్యం నేరుగా ఇంటికి అందించడం వల్ల మాకు à°’à°• భరోసా లభించింది.

ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉంటామన్నారు. సర్వమంగళ వీధికి చెందిన అట్ల రమణమూర్తి మాట్లాడుతూ అత్యంత నాణ్యమైన బియ్యాన్ని నేరుగా ఇంటికి పంపించడం చాలా ఆనందంగా

ఉంది. అయితే ఈ పథకాన్ని మధ్యలో ఆపకుండా నిరంతరం కొన సాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు. పెద్ద శేరి వీధికి చెందిన మండల జయలక్ష్మి

మాట్లాడుతూ నేరుగా ఇంటికి బియ్యాన్ని పంపించాలన్న ప్రభుత్వ ఆలోచనకు ధన్యవాదాలు. ప్రజల మేలు కోరి జగనన్న తీసుకున్న నిర్ణయం ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు. ప్రజల

మంచి కోరే ప్రభుత్వానికి ధన్యవాదాల తెలియజేసింది. చిన్న శేరి వీధికి చెందిన లొట్టి నీలమ్మ మాట్లాడుతూ గతంలో చౌకధరల దుకాణం వద్ద ఎన్నో పడిగాపులుగాసి సరుకులు

విడిపించకుండా వెనుతిరిగిన రోజులు చాలా ఉన్నాయి. అయితే జగనన్న నేరుగా బియ్యాన్ని ఇంటికి పంపించడం ప్రజలకు సౌకర్యంగా సౌలభ్యంగా ఉంది. ఈరోజు బియ్యంతో పాటు

పంచదారను కూడా ఇంటికి పంపించారు. దీంతో డిపోల వద్ద పడిగాపులు కాసే అవస్థ తప్పిందని ఆనందం వ్యక్తం చేసారు. మెట్టవీధికి చెందిన గిన్నినీలవేణి నాణ్యమైన బియ్యం

పంపిణీ గూర్చి తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ à°—్రామ వాలంటీర్ ద్వారా ఇంటికి వచ్చిన బియ్యాన్ని పరిశీలిస్తే అత్యంత నాణ్యమైనవిగా గుర్తించి ఆశ్చర్యపోయాను.

బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, తదితర వస్తువులను కూడా ఇంటివద్దకే పంపిణీ చేయడంతో సమయం ఆదా జరిగి ఆ సమయాన్ని ఇతర పనులకు వినియోగించటం వల్ల మాకు అదనపు లబ్ది

చేకూరి ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. మెట్టవీధికి చెందిన గేదెల సరోజిని నాణ్యమైన బియ్యం నేరుగా ఇంటికి రావడంతో మా కుటుంబం సభ్యులు అంతా చాలా

సంతోషిస్తున్నారని తెలియజేసారు. ప్రభుత్వ ఆలోచనలకు, అమలు తీరుకు కృతజ్ఞతలు అన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam