DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విభిన్న ప్రతిభావంతులకు మొబైల్స్ అందజేసిన కలెక్టర్

చిన్న చూపు చూసే వారిపై చట్టరీత్యా చర్యలు :. . .

(DNS రిపోర్ట్: SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±, స్టాఫ్ రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 09, 2019 (డిఎన్‌ఎస్‌): విభిన్న

ప్రతిభావంతులకు ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ లను జిల్లా కలెక్టర్ జె నివాస్ సోమ వారం అందజేసారు. సెల్ ఫోన్ లు అవసరమని వాటిని పంపిణీ చేయాలని స్పందన కార్యక్రమంలో లావేరు

మండలానికి చెందిన  à°‡à°‚టర్మీడియట్ చదువుతున్న ఎస్.లీలా అప్పల రాజు, à°Žà°‚.టెక్ చదువుతున్న మీగడ భాస్కర రావు, ఐటిఐ చదువుతున్న à°…à°‚à°•à°‚ సురేష్ దరఖాస్తు చేసుకోగా వాటిని

వెంటనే మంజూరు చేసి స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ నివాస్ పంపిణీ చేసారు. ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ వలన దివ్యాంగులు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవచ్చని

తద్వారా తమ అవసరాలకు ప్రయోజనకరంగా ఉంటుందని విభిన్ఉపయోగించుకోవచ్చని తద్వారా తమ అవసరాలకు ప్రయోజనకరంగా ఉంటుందని విభిన్న ప్రతిభావంతులు తెలిపారు. ఇదే

కార్యక్రమంలో శ్రీకాకుళం మండలం ఉమ్మిలాడకు చెందిన ఆర్.సుందరమ్మ, వెంకటపురంకు చెందిన టి.రామయ్య, శ్రీకాకుళంకు చెందిన ఆర్.సూర్యనారాయణ., మందస మండలం హంసరాలికి

చెందిన జి.బీజయ్య, ఎచ్చెర్ల మండలం కేశవదాసుపురంకు చెందిన ఎల్.రమేష్, కొయ్యాంకు చెందిన ఎం.సతీష్, గార మండలం తూలుగుకు చెందిన కె.భోగరాజుకు త్రిచక్ర సైకిళ్ళను

కలెక్టర్ పంపిణీ చేసారు. త్రిచక్ర వాహనాలను, ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ లను అవసరాలకు తగిన విధంగా ఉపయోగించి జీవితాలు సాఫీగా సాగుటకు బాట వేయాలని కలెక్టర్

పిలుపునిచ్చారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అందిస్తుందని వాటిని వినియోగించుకోవాలని కోరారు.
      à°ˆ కార్యక్రమంలో జాయింట్

కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, సహాయ కలెక్టర్ ఏ.భార్గవ తేజ, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, విభిన్నప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు జీవన్ బాబు, గ్రామీణ

నీటిసరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీరు టి.శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

చిన్న చూపు చూసే వారిపై చట్టరీత్యా చర్యలు :. . .
 à°µà°¿à°­à°¿à°¨à±à°¨ ప్రతిభావంతులను వివిధ

కారణాలతో చిన్న చూపు చూసేవారు చట్టరీత్యా నేరస్తులుగా పరిగణించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు. సమాజంలో ఇప్పటికీ కుంటోడు, గుడ్డోడు, మూగోడు,

చెవిటోడు వంటి పదాలు వినియోగిస్తూ సమాజంలో అగౌరవపరచడం జరుగుతోందని దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని చెప్పారు. ఇటువంటి పదాలను ఉపయోగించే

వారిని విభిన్న ప్రతిభావంతుల హక్కుల చట్టం -2019 సెక్షన్ 92(ఏ) క్రింద కనీసం ఆరు నెలలు జైలు విధించడం జరుగుతుందని చెప్పారు. ఈ శిక్ష ఐదు సంవత్సరాల వరకు విధించే అవకాశం

ఉందని ఆయన స్పష్టం చేసారు. విభిన్నప్రతిభావంతులు ఎంతో మంది వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభను కనబరుస్తున్నారని, ఎవరెస్టు వంటి శిఖరాలను సైతం అందుకున్నారని

కలెక్టర్ అన్నారు. వారిలో భౌతింగా ఏర్పడిన లోపాలను చూపుతూ అవహేళన చేయరాదని, సమాజంలో సముచిత స్ధానం కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు. వివిధ పేర్లతో

అనుచితంగా ప్రవర్తించరాదని ఆయన పేర్కొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam