DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ్రామ సచివాలయ కార్యాలయాలు సిద్ధం చేయాలి : కలెక్టర్

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 09, 2019 (డిఎన్‌ఎస్‌): గ్రామ సచివాలయాలను అక్టోబరు 2à°µ తేదీన ఏర్పాటు చేయడం

జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. గ్రామ సచివాలయ కార్యాలయాలకు భవనాలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. మండల అధికారులతో జిల్లా కలెక్టర్ జె నివాస్

సోమ వారం వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. గ్రామ సచివాలయం ఏర్పాటుకు గ్రామాల్లో సరైన భవనం గుర్తించాలని అన్నారు. 25 ప్రదేశాల్లో భవనాలు లేవని నివేదిక ఇచ్చారని,

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మునిసిపాలిటీలలో సంబంధిత మునిసిపల్ కమిషనర్ లు చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రామ సచివాలయం నుండి సేవలు త్వరితగతిన

అందాలని ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందని అందుకు తగిన మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న నాణ్యమైన బియ్యం

పంపిణీ కార్యక్రమం గత రెండు రోజులలో దిగ్విజయంగా పూర్తి అయిందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమమని ఆయన పేర్కొంటూ వచ్చే నెల మరింత

పకడ్బందీగా చేయాలని అన్నారు. ప్రతి బస్తాలో ముందుగా నాణ్యతను పరిశీలించుటకు ప్రయత్నించాలని సూచించారు. మండల స్థాయిలో మంచి విధానం అమలుకు చర్యలు

తీసుకుంటున్నామని తెలిపారు. చౌక ధరల దుకాణాల్లో నిల్వలో ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. డీలర్, ఎం.ఎల్.ఎస్ పాయింట్ లలో సక్రమంగా నిల్వచేయని వారిపై

చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్టోబర్ 2న రైతు భరోసా కార్యక్రమం అమలు అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రయోజనం కల్పించుటకు కౌలు రైతులను

గుర్తించాలని అన్నారు. మండల స్థాయిలో 11వ తేదీన సమావేశాలు నిర్వహించి గుర్తించాలని అన్నారు. ఎల్.ఇ. సి, సి.ఓ.సి కార్డ్ ల రైతులతో సహా ఇతర లబ్ధిదారులను గుర్తించాలని

చెప్పారు. యజమాని, కౌలు రైతు ఆధార్ సంఖ్యలు తీసుకోవాలని అన్నారు. భూ యజమానులకు ఎటువంటి సమస్యలు ఉండవని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారులు అందించిన డేటా ప్రకారం

వివరాలు పరిశీలించి అర్హతలు చూడాలని అన్నారు. నిజమైన లబ్దిదారులు మాత్రమే ఉండాలని స్పష్టం చేసారు. గ్రామాల వారీగా షెడ్యూల్ తయారు చేసుకుని కౌలు రైతుల గుర్తింపు

కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో 3.58 లక్షల మంది రైతులు పి.ఎమ్.కిసాన్ యోజన క్రింద లబ్ధిదారులుగా ఉన్నారని సూచించారు. గతంలో మంజూరైన గృహ లబ్దిదారుల

అర్హతలను వాలంటీర్లు పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 32 వేల మంది లబ్ధిదారులు ఉన్నారని, వారు అర్హత కలిగి ఉన్నారా లేదా అనేది 20వ తేదీ నాటికి

గుర్తించాలని ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులు మాత్రమే ఉండాలని, అర్హత లేని లబ్ధిదారులను తొలగించినపుడు వివరాలు స్పష్టంగా పొందుపరచాలని సూచించారు.

వాలంటీర్లు పరిశీలించిన తరువాత హౌసింగ్ ఏ.ఇ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు పంపిణీకి వి.ఆర్.ఓ, ఆర్.ఐలు పరిశీలన త్వరగా

పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వ భూమి లభ్యంగా లేదని 732 గ్రామాలకు నివేదిక సమర్పించారని ఆయన పేర్కొన్నారు. బూర్జ, ఆమదాలవలస, జి.సిగడాం,కవిటి, మండలాల్లో ఎక్కువ

గ్రామాల్లో భూమి లేదని నివేదిక సమర్పించారు. ఆ మండలాల్లో మరల పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. స్పందన

కార్యక్రమంలో ప్రతీ శాఖకు చెందిన అధికారి హాజరు కావాలని స్పష్టం చేసారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి

బలివాడ దయానిధి, సహాయ కలెక్టర్ ఏ.భార్గవ తేజ, రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.రమణ, కె ఆర్ ఆర్ సి ఎస్డీసి సీతారామయ్య, జెడ్పీ సిఇఓ జె. చక్రధర రావు, డిప్యూటీ సిఇఓ

ప్రభావతి, డీపీఓ వి.రవి కుమార్, వ్యవసాయ శాఖ జెడి బివిజి ప్రసాద రావు, హౌసింగ్ పిడి వేణుగోపాల్, మెప్మా పిడి ఎం.కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam