DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నాణ్యమైన బియ్యంపై ప్రజలు సంతృప్తి గా ఉన్నారు: కోన శశిధర్  

నేను తిన్నాను - à°¨à°¾à°•à± నచ్చింది : పౌరసరఫరాల కమీషనర్

అక్టోబరు 2 నుండి 72 గంటల్లో రేషన్ కార్డు :

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ).

.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 10, 2019 (డిఎన్‌ఎస్‌): నాణ్యమైన బియ్యం పంపిణీపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమీషనర్ కోన శశిధర్ అన్నారు. శ్రీకాకుళం

జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించుటకు మంగళ వారం విచ్చేసిన కమీషనర్ సీతంపేట గిరిజన ప్రాంతంతోపాటు బూర్జ

మండలంలో పలు గ్రామాలను పరిశీలించారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో నాణ్యమైన బియ్యం పంపిణీపై పలు

వివరాలు వెల్లడించారు. నాణ్యమైన బియ్యం పంపిణీపై ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీన రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి

పలాసలో నాణ్యమైన బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. శ్రీకాకుళం వంటి వసతులు తక్కువగా ఉన్న జిల్లాలో మొదటి రోజున 92 శాతం పంపిణీ పూర్తి చేసారని ఆయన

ప్రశంసించారు. సీతంపేట గిరిజన ప్రాంతంలో వర్షాలు కురవడం తదితర కారణాల వలన రెండవ రోజున మిగిలిన బియ్యాన్ని పంపిణీ చేసి రెండు రోజుల్లో శత శాతం పంపిణీని జిల్లా

యంత్రాంగం పూర్తి చేసిందని అన్నారు. జిల్లా యంత్రాంగం చక్కటి ప్రణాళికతో కష్టసాధ్యమైన పనిని సులభంగా దిగ్విజయంగా పూర్తి చేసిందని చెప్పారు. 7వ తేదీ ఉదయం 6 గంటల

నుండే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షణ చేసారని చెప్పారు. క్షేత్ర స్ధాయిలో పంపిణీ కార్యక్రమం జరిగిన తీరును

పరిశీలంచామని కమీషనర్ చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో కొండలపైన ఉన్న గ్రామాలను సైతం సందర్శించామని గిరిజన ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూసామని అన్నారు. గతంలో రేషన్

డిపోకు వెళ్ళి తిరిగి వస్తుండేవారమని అటువంటిది ఇళ్ళ వద్దకే పంపిణీ జరిగి మా కష్టాలను తీర్చారని వారు ఆనందించారని చెప్పారు. కుటుంబాలకు వారికి అందాల్సిన

యూనిట్ల మేరకు ఎటువంటి అవరోధం లేకుండా బియ్యం ప్యాకెట్లు అందాయని అందుకు అనేక మంది ఆశ్చర్యం వ్యక్తం చేసారని చెప్పారు. ఇంత బియ్యం వస్తుందని అనుకోలేదని

పేర్కొన్నారని తెలిపారు. గతంలో అందుకున్న బియ్యం, ఇప్పుడు పంపిణీ చేసిన బియ్యం మధ్య తేడాలను ప్రజలు స్వయంగా చూపించారని ఆయన చెప్పారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు

సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. సీతంపేట ఏజెన్సీలో రహదారి సౌకర్యం లేని 3 గ్రామాలకు కూలీలతో పంపించడం జరిగిందని  à°†à°¯à°¨ అన్నారు. రవాణా సమయంలో 30 నుండి 35 ప్యాకేజి

బ్యాగులు తడవడం జరిగిందని ఆయన పేర్కొంటూ అటువంటి ప్యాకింగులు అందిన వారికి తక్షణం మార్పు చేసామని శశిధర్ స్పష్టం చేసారు. 15,21 మంది వాలంటీర్లు పంపిణీ

కార్యక్రమంలో పాల్గొన్నారని వారిలో 14,536 మంది రెగ్యులర్ వాలంటీర్లని తెలిపారు. జిల్లాకు 9,36,941 బస్తాలు వచ్చాయని ఆయన చెప్పారు. బియ్యం నాణ్యతపై పలువురు చేసిన ఆరోపణలు

వాస్తవం కాదని కమీషనర్ పేర్కొన్నారు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న బియ్యంలో స్వర్ణ రకంతోపాటు ఇతర బియ్యం కలిసి ఉందని ఇంకా మెరుగైన నాణ్యమైన బియ్యం అందించుటకు

చర్యలు చేపడుతున్నామని చెప్పారు. తినగలిగే బియ్యం పంపిణీ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. సార్టెక్స్ మెషిన్ ద్వారా బియ్యంలో రంగుమారినవి, నూకలు వేరు

చేయడం జరుగుతుందని అన్నారు. గ్రామ స్ధాయిలో మంచి సేవలు అందించడం, ప్రజల వద్దకే సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తుందని కమీషనర్ చెప్పారు.

క్లష్టర్ల మేపింగు  à°œà°¿à°²à±à°²à°¾ స్ధాయిలోనే చేయుటకు అవకాశం కల్పించామని చెప్పారు. పంపిణీ కార్యక్రమాన్ని ఇంకా మెరుగైన రీతిలో చేయుటకు ఎవరైనా సలహాలు, సూచనలు

చేయవచ్చని ఆయన అన్నారు. కార్యక్రమం చేపట్టడంలో బలాలు, బలహీనతలను అధ్యయనం చేస్తున్నామని వాటిని అధిగమించి పూర్తి స్ధాయిలో లోపం లేని విధంగా వ్యవస్ధను

తీర్చిదిద్దుటకు అన్ని చర్యలు తీసుకుంటామని కమీషనర్ చెప్పారు. బయోమెట్రిక్ వంటి సమస్యలు  à°‰à°‚టే వాలంటీరుకే ప్రస్తుతానికి గుర్తింపు అధికారాన్ని ఇచ్చామని

అన్నారు. సీతంపేటలో ఒక వాలంటీరుతో పంపిణీ కార్యక్రమంపై ఆరా తీయగా 68 బస్తాలు మొదటి రోజున సరఫరా చేసారని, రెండవ రోజున బయోమెట్రిక్ తీసుకున్నారని, అటువంటి

వెసులుబాటు కల్పించామని అన్నారు. రీసైక్లింగు విధానం ఉండకూడదనే ప్యాకింగు చేస్తున్నామని కమీషనర్ వివరించారు. పంపిణీ చేస్తున్న బస్తాలను తిరిగి తీసుకుని

వాటిని రీసైక్లింగు చేయుటకు ఆలోచిస్తున్నామని అన్నారు. ఒక బస్తా ఒకసారి మాత్రమే ప్యాకింగుకు వినియోగించగలమని స్పష్టం చేసారు. పర్యావరణ హితంగా ఉండాలని

యోచిస్తున్నామని చెప్పారు. బియ్యాన్ని రీసైక్లింగు చేయరాదనేది కేంద్ర ప్రభుత్వ నిబంధన ఉందని అన్నారు. వాలంటీర్లు ఒక పైసాకూడా రవాణా ఛార్జీగా పెట్టాల్సిన

అవసరం లేదని, ప్రతి క్లష్టరుకు రూ.5 వందల చొప్పున నిధులను మంజూరు చేసామని కమీషనర్ స్పష్టం చేసారు. క్లష్టర్ లో అవసరమగు మేరకు నిధులను ఖర్చు చేయవచ్చని చెప్పారు. వసతి

గృహాలకు, మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యమైన బియ్యం పంపిణీ ప్రారంభించామని అన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన పథకం దిగ్విజయం అయిందని

కమీషన్ అన్నారు. జిల్లాలో మంచి ఫలితాలు వచ్చాయని, జిల్లా యంత్రాంగం కలెక్టర్ జె నివాస్ నేతృత్వంలో మార్గదర్శకంగా పనిచేసిందని ప్రశంసించారు. అన్ని జిల్లాల

అధికార యంత్రాంగం శ్రీకాకుళం జిల్లా వైపు చూస్తోందని చెప్పారు. ప్రజలు బాగా సహకరించారని, వాలంటీర్ల సేవలు బాగున్నాయని అన్నారు. ప్రజల నుండి సానుకూల ధృక్ఫధం

వచ్చిందని అన్నారు. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. దేశంలో భారీ ఎత్తున చేపడుతున్న కార్యక్రమం అన్నారు. వాలంటీర్లు ఇంటి వద్దకే బియ్యం తీసుకువస్తున్నప్పుడు చిన్న

చిరునవ్వుతో పలకరిస్తే కష్టం అంతా మరచిపోతారని కమీషనర్ అన్నారు.

నేను తిన్నాను ... నాకు నచ్చింది . :.కమీషనర్

సీతంపేట మండలం బొంది గ్రామంలో నాణ్యమైన

బియ్యంతో చేసిన అన్నాన్ని స్వయంగా తిన్నానని, నాకు నచ్చిందని కమీషనర్ శశిధర్ తెలిపారు.

అక్టోబరు 2 నుండి 72 గంటల్లో రేషన్ కార్డు :  

అక్టోబరు 2వ తేదీ నుండి

గ్రామ సచివాలయాలు ఏర్పడతాయని అప్పటి నుండి 72 గంటల్లో రేషన్ కార్డు మంజూరుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కమీషనర్ చెప్పారు. వారం రోజుల్లో ఇందుకు అవసరమగు

సాఫ్ట్ వేరుపై తుది నిర్ణయం చేస్తామని అన్నారు. తల్లిదండ్రుల రేషన్ కార్డుల నుండి బయటకు వచ్చిన వారు కూడా రేషన్ కార్డు పొందవచ్చని చెప్పారు. రేషన్ కార్డుకు

దరఖాస్తు చేసుకుంటున్న సమయంలోనే లబ్దిదారుడు అర్హత కలిగి ఉన్నాడా లేదా అనేది స్క్రీన్ పై చూపిస్తుందని ఆయన అన్నారు. రేషన్ కార్డు మంజూరు విధానాన్ని సులభతరం

చేస్తున్నట్లు కమీషనర్ చెప్పారు. గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు మంచి సేవలు దగ్గరలో అందాలనేది ముఖ్య మంత్రి ఆలోచన అన్నారు. తెల్ల రేషన్ కార్డులు వద్దని స్వయంగా

ఎవరైనా వదులుకుంటే అందుకు స్వాగతిస్తున్నామని అన్నారు. కొత్త కార్డులకు దాదాపు 30 వేల వరకు దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.
          మీడియా ప్రతినిధుల సమావేశంలో

పౌరసరఫరాల సంస్ధ మేనేజింగ్ డైరక్టర్ ఏ.సూర్యకుమారి, జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, సహాయ కలెక్టర్ ఏ.భార్గవ తేజ, జిల్లా రెవిన్యూ

అధికారి బలివాడ దయానిధి, పౌరసరఫరాల సంస్ధ జిల్లా మేనేజర్ ఏ.కృష్ణారావు, జిల్లా పౌరసరఫరాల అధికారి ఏ.నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam