DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దోపిడీ నేతలను కాపాడేందుకే టీడీపీ చలో ఆత్మకూరు 

ఆత్మకూరుకు వస్తాం....అంతా వివరిస్తాం : వైకాపా 

కోడెల, యరపతినేని, జీవీని తీసుకొస్తే వాస్తవాలు తెలుస్తాయి

మంత్రి మోపిదేవి, వైకాపా  à°Žà°‚పీ,

 à°Žà°®à±à°®à±†à°²à±à°¯à±‡à°²à± ,

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . . 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 11, 2019 (డిఎన్‌ఎస్‌) : ప్రతిపక్ష పార్టీ తమ దోపిడీ నేతలను కాపాడుకునేందుకే

చంద్రబాబు నాయుడు చలో ఆత్మకూరు కార్యక్రమం పెట్టుకున్నారని మంత్రి మోపీదేవి వెంకటరమణ మండిపడ్డారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ

పల్నాడులో అంతా ప్రశాంతంగానే ఉందని, తమ బృందం ఆత్మకూరుకు వస్తుందని, అక్కడ జరిగింది అంతా  à°µà°¿à°µà°°à°¿à°¸à±à°¤à°¾à°®à°¨à°¿ తెలిపారు.  à°šà°‚ద్రబాబు కూడా తమ వెంట దోపిడీ నేతలను తీసుకు

వస్తే వాళ్ళ అసలు బండారం బయట పడుతుందని ఎద్దేవా చేసారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించిన పార్టీ ఒక్క తెదేపా అని. ఆరోపించారు. వినుకొండలో వైసీపీ మద్దతుదారులు

అప్పట్లో తెదేపా నాయకుల దెబ్బకి ఊర్లు వదిలి వెళ్ళాపోయారని, హత్యా రాజకీయాలకు తెరలేపి గ్రామాలకు గ్రామాలను ఖాళీచేయించిన ఘనత తెదేపాకే దక్కుతుందన్నారు.

తెదేపా 5 ఏళ్ళ పాలనలో అవినీతి, అక్రమాలు, హత్యారాజకీయాలు జరిగాయి. స్పీకర్గా ఉండి కోడెల కుటుంబం, మైనింగ్ డాన్ యరపతినేని శ్రీనివాసరావు చేసిన అరాచకాలు అన్ని

ఇన్నీ కావని అవినీతి, అక్రమాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే పునరావాస కేంద్రాల డ్రామాలకు తెర లేపారని ఆరోపించారు. మంచిని చెడుగా..చెడుని మంచిగా మల్చుకునే

రాజకీయ జిత్తుల మారి చంద్రబాబు అని విమర్శించారు. తెదేపా పాత పద్దతిలోనే కొనసాగాలనుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. à°ˆ సమావేశం లో  à°Žà°®à±à°®à±†à°²à±à°¯à±‡

అంబటి. రాంబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తదితరులు పాల్గొన్నారు. 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam