DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సాలకట్ల బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు

1600 కు పైగా సిసి కెమెరాలతో పర్యవేక్షణ :

ప్రత్యేక నిఘా బృందాలు, సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌: . .

గరుడసేవ నాడు 1000 మందితో à°­à°¦à±à°°à°¤ :. . .

రవాణా ఛార్జీల

స్థిరీకరణ : . . .. . .

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి). . .

తిరుపతి, సెప్టెంబర్ 11, 2019 (డిఎన్‌ఎస్‌):  à°ªà±à°°à°ªà°‚à°š ప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమలలో అతి ముఖ్యమైన

శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాదీ రంగరంగ వైభవంగా జరుగుతాయి. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మొత్తం 16 వాహనాలపై అఖిలాండకోటి బ్రహ్మాండ

నాయకుడు భక్తకోటికి దర్శనమిస్తాడు. ఈ ఉత్సవశోభను తిలకించేందుకు దేశం నలుమూలలతోపాటు విదేశాల నుండి కూడా లక్షల సంఖ్యలో భక్తులు

తరలివస్తారు.

బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులు ప్రశాంత వాతావరణంలో శ్రీవారి మూలమూర్తితోపాటు వాహనసేవలను దర్శించుకునేందుకు వీలుగా టిటిడి యంత్రాంగం

రెండు నెలల ముందు నుండే విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. ఏడాదికేడాది భక్తుల రద్దీ పెరుగుతున్న క్రమంలో అందుకు తగ్గట్టు టిటిడి సౌకర్యాలను

మెరుగుపరుస్తోంది. ప్రతి సామాన్య భక్తునికీ సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు

జరగకుండా బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు టిటిడి నిఘా, భద్రతా విభాగం పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.

1600కు పైగా సిసి

కెమెరాలతో పర్యవేక్షణ :

బ్రహ్మోత్సవాల్లో మొత్తం 1600కు పైగా సిసి కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం 585 సిసి కెమెరాలు ఉండగా, అదనంగా 1051 కెమెరాలను

ఏర్పాటు చేస్తున్నారు. తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాలైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ -1, 2, లోపలి, వెలుపలి కార్డన్‌, నాలుగు మాడ వీధులు తదితర ప్రాంతాల్లో à°ˆ సిసి కెమెరాల

నిఘా ఉంటుంది.

ప్రత్యేక నిఘా బృందాలు: . . .

భక్తులకు రక్షణ కల్పించేందుకు టిటిడి నిఘా సిబ్బందితో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ప్రత్యేకంగా

గరుడసేవతోపాటు బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజుల్లో వీరు వివిధ ప్రాంతాల్లో మఫ్టీలో విధుల్లో ఉంటారు. విజిలెన్స్‌, ఎస్టేట్‌, రెవెన్యూ అధికారులతో కూడిన ప్రత్యేక

స్క్వాడ్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో అధిక ధరలను అరికడతారు.

రవాణా ఛార్జీల స్థిరీకరణ: . . .

తిరుమల, తిరుపతి మధ్య

ప్రయివేటు ట్యాక్సీల్లో ప్రయాణించే భక్తులకు రవాణా ఛార్జీలను స్థిరీకరించారు. ఒక్కొక్కరికి రూ.70/-గా ఛార్జీ నిర్ణయించారు. ఆగస్టు 4న ప్రయివేటు ట్యాక్సీ

యజమానులు, డ్రైవర్లతో సమావేశం నిర్వహించి అధిక ఛార్జీలు వసూలు, మోతాదుకు మించి ప్రయాణికులను ఎక్కించడం, అధిక వేగం తదితర విషయాలపై స్పష్టమైన సూచనలిచ్చారు.

నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

గరుడసేవ నాడు 1000 మందితో à°­à°¦à±à°°à°¤ :. . . 

బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 4న జరుగనున్న గరుడసేవ

నాడు 1000 మందితో నాలుగు మాడ వీధుల్లో టిటిడి భద్రతా చర్యలు చేపట్టనుంది. వీరిలో 350 మంది నిఘా, భద్రతా సిబ్బంది, 150 మంది హోంగార్డులు, 200 మంది శ్రీవారి సేవకులు, 200 మంది స్కౌట్లు,

100 మంది ఎన్‌సిసి క్యాడెట్లు ఉన్నారు.

సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌: . . .

తిరుమలలోని మొత్తం సెక్యూరిటీ యంత్రాంగాన్ని సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ నుండి

పర్యవేక్షిస్తారు. విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆధీనంలో మొత్తం 15 సిబ్బంది మూడు షిఫ్టుల్లో 24 à°—à°‚à°Ÿà°² పాటు ఇక్కడ విధుల్లో ఉంటారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam