DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తాగు, సాగు నీటి కష్టాలు పై చర్యలు తీసుకోవాలి 

కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్యేలు అనంత, కేతిరెడ్డి 

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం)

అనంతపురం, సెప్టెంబర్ 11, 2019 (డిఎన్‌ఎస్‌) : అనంతపురం జిల్లా

తాడిపత్రి, సింగనమల నియోజకవర్గాలతో పాటు గుంతకల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తాగు, సాగు నీటి కష్టాలు తీర్చేలా చర్యలు తీసుకోవాలని అనంతపురం ఎమ్మెల్యే

అనంత వెంకట రామిరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ను ఆయన ఛాంబర్ లో కలిసి విన్నవించారు.

ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులను వివరించారు. సౌత్ కెనాల్, నార్త్ కెనాల్ కు నీటిని విడుదల చేయడం వల్ల తాగు, సాగు నీటి కష్టాలు తీరుతాయన్నారు.  à°†à°¯à°¾

నియోజకవర్గాల్లో ప్రస్తుతం చీనీ చెట్లు ఎండిపోతున్నాయని, బోర్లు అడుగంటిపోయినట్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నీరు లేకపోవడంతో ఉద్యాన పంటలు ఎండిపోయి

రైతులు ఆర్థికంగా నష్టపోతున్నట్లు తెలిపారు. జిల్లాకు ఏటా నీరు వస్తున్నా ఈ నియోజకవర్గాల్లో మాత్రం నీటి కష్టాలు పడుతూనే ఉండాల్సి వస్తోందన్నారు. వాస్తవ

ఆయకట్టు దారులకు నీరు అందని పరిస్థితి ఉందన్నారు. తక్షణం నీటి విడుదల చేయకపోతే తాగు,సాగు నీటికి ఇబ్బందులు వస్తాయని విన్నవించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam