DNS Media | Latest News, Breaking News And Update In Telugu

2019 ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు. తెలుగుదేశానికే రావాలి : జాతీయ అధ్యక్షుడు. చంద్రబాబు పిలుపు

2019 ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు. తెలుగుదేశానికే రావాలి :. టీడీపీ. జాతీయ అధ్యక్షుడు. చంద్రబాబు పిలుపు

విజయవాడ, మే : రానున్న 2019 ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు. తెలుగు దేశం

అభ్యర్థులే గెలిచేలా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళవారం మహానాడు ముగింపు సభలో అయన

అధ్యక్ష ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ 36 ఏళ్లుగా ఎప్పుడూ చూపించని ఉత్సాహాన్ని చూపించారని, దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత విస్తృతంగా చర్చలు

జరిగిన సందర్భాలు లేవన్నారు. ఈ సంవత్సరంలో సైకిల్ యాత్రలు, దళితతేజం, జన్మభూమి, నవనిర్మాణ దీక్ష, ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం, ధర్మపోరాట సభలు పెట్టడాం జరిగిందని,

 à°®à°¨ పార్టీకి ఉండే బలం 70 లక్షల మంది సైన్యం, అందరం  à°¸à°®à±ˆà°•à±à°¯à°‚à°—à°¾ పనిచేస్తే..మనల్ని ఎదుర్కునే సత్తా ఏ పార్టీకీ లేదని తెలిపారు. 
తెలుగుదేశం జాతీయ రాజకీయల్లో..

నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీయే1, ఎన్డీయే2.. ప్రభుత్వాల్లో కీలక బాధ్యత వహించామని, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలను ఏకం చేసి దేశంలో నేషనల్ ఫ్రంట్ ద్వారా

వీపీ.సింగ్ ను ప్రధాన మంత్రిగా చేసిన ఘనత మనదేనన్నారు. 1984లో 35 మంది ఎంపీలతో దేశంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర మనం పోషించామని, ఆరోజు బీజేపీకి రెండు సీట్లే వచ్చాయి.  à°†

రోజు ఎన్డీయేలో ఎన్నో పదవలు ఇస్తామని అన్నారు, కానీ, మాకు పదవులు ముఖ్యం కాదు..దేశ అభివృద్ధి, రాష్టాభివృద్ధి ముఖ్యమని బయట నుంచి సహకరిస్తామని సంపూర్ణ మద్దతు

ఇచ్చిన పార్టీ ఇదేనన్నారు.  2014 లో కూడా పదవుల కోసం ఎన్డీయేలో చేరలేదు – రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ అన్యాయం చేసింది – బీజేపీ అయినా న్యాయం చేస్తుందని ఎన్నికల

కంటే ముందే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు.  
1978లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యానని, సమైక్యాంధ్రలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నానని 10 ఏళ్లు ప్రతిపక్ష

నాయకుడిగా ఉన్నాను – ఇప్పుడు నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను – 24 ఏళ్లు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను – ఇన్నేళ్లలో ఎవరూ వేలు ఎత్తి చూపనటువంటి పరిపాలన

ఇచ్చామని తెలియచేసారు. సుమారు  27 ఏళ్ల కంటే ముందు..కుటుంబం కోసం రాజకీయాల్లో ఆధారపడకూడదని అలోచించాను. – అందుకే à°’à°• చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాను – 26 ఏళ్లు నా

భార్య కష్టపడి à°† కంపెనీని à°’à°• స్థాయికి తీసుకొచ్చింది – 9 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం వ్యక్తిగత ఆస్తులను ప్రకటిస్తున్నాను – వ్యాపారం చూసుకోవాలని ఉంటే

వ్యాపారానికి వెళ్లమని, రాజకీయాల్లోకి రావాలని ఉంటే à°°à°‚à°¡à°¿ కానీ...ఎన్టీఆర్ కు, నాకు ఎక్కడా చెడ్డపేరు తీసుకురావద్దని లోకేశ్ కు చెప్పాను – తనే ఆలోచించుకుని

రాజకీయాల్లోకి వచ్చాడు –  à°°à°¾à°œà°•à±€à°¯à°¾à°²à±à°²à±‹ ఉన్న మనం ప్రజల కోసం బతకాలి తప్పా..కుటుంబం కోసమో, కొంతమంది వ్యక్తుల కోసమో కాదు – వారసత్వ రాజకీయాల గురించి కానీ,

భవిష్యత్తులో ఏమి అవుతుందో అని నేను మాట్లాడడం లేదు – సమర్ధత ఉంటే నాయకులు రాణిస్తారు – à°’à°• మామూలు కుటుంబంలో పుట్టి..నిరంతర శ్రమతో à°ˆ స్థాయిలో

ఉన్నానన్నారు. 

2022కి మూడు అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలని నిర్ణయించుకున్నాం -2029కి దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలనే లక్ష్యాన్ని

నిర్ణయించుకున్నామన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam