DNS Media | Latest News, Breaking News And Update In Telugu

190 దేశాలలో గిరిజన ఉత్పత్తుల అమ్మకాలు

కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 13, 2019 (డిఎన్‌ఎస్‌) : ట్రైఫెడ్ ద్వారా దేశంలోని

గిరిజన ప్రాంతాలలో ఉత్పత్తి చేసిన వస్తువులను 190 దేశాలలో విక్రయిస్తున్నట్లు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్ తెలిపారు. శుక్రవారం బీచ్ రోడ్

లోని à°’à°• హోటల్లో ఏర్పాటు చేసిన జాతీయ గిరిజన ఉత్సవ్ ఆది మహోత్సవ్- 2019ను ఆమె ప్రారంభించారు.  à°ˆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా à°ˆ

ఉత్పత్తుల విక్రయం జరుపుతున్నట్లు తెలిపారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా నేటికీ గిరిజనుల పరిస్థితులు పూర్తిగా మెరుగుపడలేదు అన్నారు. రెండు రెక్కల

సాయం ఉంటేనే పక్షి ఎగర గలుగుతుందని, అదేవిధంగా భార్యాభర్తలు ఇరువురూ సంపాదిస్తేనే కుటుంబం గడుస్తుందని చెప్పారు. అందుకే తమ సంస్థ గిరిజన స్త్రీలకీ తోడ్పడే

విధంగా అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. గిరిజన సమాజంలో నైపుణ్యం, కళాతృష్ణ, కష్టపడి పనిచేసే లక్షణాలు మెండుగా ఉన్నాయన్నారు. ఇవన్నీ తెలిసిన మోడీ వన్-

ధన్ పథకాన్ని ప్రారంభించారు అన్నారు. 7 వేల వన్ ధన్ సంఘాల ద్వారా 45 వేల కోట్ల రూపాయలు ఆదివాసీల ఆర్థిక అభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్లో గిరిజనుల జీవన స్థితిగతులను గూర్చి అధికారుల ద్వారా తాను తెలుసుకున్నానని ఎన్ని అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టినా ఇప్పటికీ పరిశుభ్రమైన

తాగునీరు, విద్యుత్తు, ఆర్థిక స్థితి ఇంకా చాలా మందికి అందుబాటులో లేవు అన్నారు. మహిళా సాధికార అభివృద్ధికి గాను ప్రధాని ఆర్థికమంత్రిగా మహిళను నియమించడం

సంతోషించదగ్గ విషయం అని చెప్పారు. ప్రధాని చర్యల ఫలితంగా కాశ్మీర్లో లడక్ ప్రాంత ప్రజలు ఎంతో సంతోషంతో ఉన్నారని, తన లడక్ పర్యటనలో ఈ విషయం తెలిసిందన్నారు.

ఆంధ్రప్రదేశ్లో గిరిజనుల అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ట్రైఫెడ్ చైర్మన్ రమేష్ చంద్ర మీనా మాట్లాడుతూ సబ్ కా సాత్ సబ్కా కళ్యాణ్ సబ్కా

వికాస్ నినాదంతో ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని అన్ని రంగాలలో, బడుగు బలహీన వర్గాల వారికి ప్రయోజనం కలిగే విధంగా అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారు అని

తెలిపారు. ఇటువంటి ఉత్సవాల మూలంగా ఈ రాష్ట్రం లోని గిరిజనులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. పాడేరు శాసనసభ్యురాలు కే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గిరిజన ఉత్సవం

ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలలో గిరిజనుల కళలను తెలుసుకొనే అవకాశం కలిగిందన్నారు. ట్రైఫెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంగీత మహేంద్ర సంస్థ చేపడుతున్న

అభివృద్ధి పథకాలను గురించి వివరించారు. ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు పీవీ ఎన్. మాధవ్, మాజీమంత్రి పెద్దింటి జగన్ మోహన్ రావు, జి సి సి ఎం డి టి.బాబూరావునాయుడు

తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి రేణుకా సింగ్ ఎగ్జిబిషన్, అమ్మకాలు ప్రారంభించారు. దింసా, కోందు, కొమ్ము నాట్య కళాకారులతో కలిసి నాట్యం చేశారు.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam