DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం జిజిహెచ్ లో రోగులకు మరిన్ని సదుపాయాలు 

జిజిహెచ్ లో పార్కు కు కలెక్టర్  à°¶à°‚కుస్థాపన 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚): . .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌):

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగులకు మంచి సౌకర్యాలు అందించుటకు చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ప్రముఖ వైద్యులు డా. దానేటి శ్రీధర్

సామాజిక సేవలో భాగంగా రూ.5 లక్షలను జిజిహెచ్ ప్రాంగణంలో ఆహ్లాదకరంగా పార్కును ఏర్పాటుకు ఆర్ధిక సహాయం చేయుటకు ముందుకు రావడంతో పార్క్ నిర్మాణానికి జిల్లా

కలెక్టర్ శనివారం శంకుస్థాపన చేసారు. జి.ఎం.ఆర్ సంస్థ సీఎస్ఆర్ కార్యక్రమం క్రింద ఆధునీకరణ చేస్తున్న పురుషుల ఎముకల వార్డు పనులను పరిశీలించారు. పురుషులు, మహిళల

వార్డులలో ఆధునీకరణ చేసిన మరుగుదొడ్లను సంబంధిత వార్డుల ఇన్ ఛార్జి నర్సులు, పారిశుధ్య కార్మికులతో ప్రారంభింపజేసారు. వసతి గృహ విద్యార్థులకు సౌకర్యాలు

కల్పించుటలో భాగంగా వాషింగ్ మెషీన్ ల ఏర్పాటు చేసి వాటిని విద్యార్ధులకు అందజేసారు. జిజిహెచ్ కు వచ్చే రోగులకు ఆధునిక వసతుల కల్పన, ఆహ్లాదకరమైన వాతావరణం

ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామని కలెక్టర్ అన్నారు. సి.ఎస్.ఆర్ కార్యక్రమం క్రింద ఏర్పాటు చేసిన పనులను, మరుగుదొడ్లను సక్రమంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు.

సంబంధిత ఇన్ ఛార్జ్ అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ పరిశుభ్రంగా ఆహ్లాదంగా ఉండాలని అన్నారు. చుట్టు ప్రక్కల వాతావరణం చక్కగా

ఉండటం వలన రోగం సగం నయం అవుతుందని ఆయన చెప్పారు.
            à°ˆ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ à°¡à°¾.ఏ.కృష్ణవేణి, ఆర్.à°Žà°‚.à°“ à°¡à°¾.బి.సి.హెచ్.అప్పల నాయుడు,

వైద్యులు సునీల్ నాయక్, ప్రజా ఆరోగ్య శాఖ కార్యనిర్వాహక ఇంజనీరు పి.సుగుణాకర రావు, ఏపిఎంఐడిసి డిఇ ప్రసాద్, సంబంధిత విభాగాల వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam