DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అనంత ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందిస్తాంఎమ్మెల్యే అనంత

మేం అధికారంలోకి వచ్చే సమయానికి అస్తవ్యస్త పాలన

ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్లు వేరు కుంపట్లే కారణం 

కార్పొరేషన్‌ను అవినీతిమయం

చేశారు

కమీషన్లపై ఉన్న ధ్యాస పనులు పూర్తి చేయడంపై ఏదీ?

పాలనను గాడిలో పెడతాం: ఎమ్మెల్యే అనంత

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్

అనంతపురం)

అనంతపురం, సెప్టెంబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌) : అనంతపురం నగర ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందిస్తామని ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి అన్నారు. కూడేరు మండలం

ముద్దలాపురం సమీపంలో ఉన్న నీటి పంపింగ్‌ పథకాన్ని, ఫిల్టరేషన్‌ పాయింట్‌ను శనివారం కలెక్టర్‌ సత్యనారాయణ, నగర పాలక సంస్థ కమిషనర్‌ ప్రశాంతితో కలిసి ఎమ్మెల్యే

పరిశీలించారు. ముందుగా ఫిల్టరేషన్‌ పాయింట్‌ వద్ద ఎరేటర్‌లో నీటిని గ్లాస్‌లలో తీసుకుని పరిశీలించారు. ఆలం, క్లోరినేషన్, సున్నం మిశ్రమాలు సరిగా కలుపుతున్నారో?

లేదో? నిశితంగా చూశారు. ఫిల్టర్‌ బెడ్స్‌ పనితీరును ఈఈ మల్లికార్జునను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. క్లారిఫ్లాక్యులేటర్లను సరిగా శుభ్రం చేస్తున్నారా? అని అధికారులను

ప్రశ్నించారు. అక్కడే నీటిని తీసుకుని పరిశీలించగా నగరానికి సరఫరా అవుతున్న నీటి కంటే కాస్త మెరుగ్గా ఉండడంతో ఎందుకు రంగుతో కూడిన నీరు ప్రజలకు చేరుతోందని

అడిగారు. ఎక్కడ లోపం ఉందని ప్రశ్నించారు. అనంతరం నగరానికి చేరుకుని రహమత్‌నగర్‌ ఐటీఐ మిట్ట వద్ద ఉన్న వాటర్‌ ట్యాంక్‌లో నీటిని పరిశీలించారు. ఫిల్టరేషన్‌

పాయింట్‌ వద్ద నీటిని, ఇక్కడి నీటిని పోల్చి చూస్తే సుమారు 7 శాతం తేడా ఉన్నట్లు గుర్తించి ఎందుకిలా జరుగుతోందని ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి నగర పాలక సంస్థ

అధికారులను ప్రశ్నించారు. మట్టిశాతం ఎక్కువగా ఉన్న కారణంగా నీరు రంగు మారిందని చెప్పడంతో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటిలో పాలి అల్యూమినియం

క్లోరైడ్‌ను కలపితే సమస్య అధిగమించవచ్చని, అయితే à°† ద్రావణం రాజమండ్రిలో లభిస్తుందని అధికారులు చెప్పారు. దీంతో తక్షణం అక్కడి నుంచి తీసుకొచ్చేలా చర్యలు

తీసుకోవాలని సూచించారు. రెండ్రోజుల్లో సమస్య గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ నగర ప్రజలకు తాగునీటి సమస్య

లేకుండా చేస్తామని అన్నారు. కొన్ని రోజులుగా నీరు రంగు మారి, మట్టితో కూడి వస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. ఎందుకిలా జరుగుతోందో

తెలుసుకోవడానికే కలెక్టర్‌ సత్యనారాయణ, కమిషనర్‌ ప్రశాంతితో కలిసి ఫిల్టరేషన్‌ పాయింట్‌ను పరిశీలించామన్నారు. ఫిల్టరేషన్‌ పాయింట్‌ వద్ద నీరు బాగున్నా

నగరానికి మాత్రం సరిగా సరఫరా కావడం లేదని, లోపాలు సరిచేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిందని, అనంతపురం నగర పాలక సంస్థ పాలక వర్గం గడువు రెండు

నెలల క్రితమే ముగిసిందన్నారు. తాము అధికారంలోకి వచ్చే సమయానికి కార్పొరేషన్‌లో అస్తవ్యస్థ పాలన ఉండేదన్నారు. à°—à°¤ ప్రభుత్వంలో ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్లు కుంపట్లు

పెట్టుకుని అభివృద్ధిని విస్మరించారన్నారు. ఉద్యోగులు కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరించారని, బాధ్యతగా పని చేయలేదన్నారు. కార్పొరేషన్‌ను

అవినీతిమయం చేశారని విమర్శించారు. ఛిద్రమైన రోడ్లు, అధ్వానంగా ఉన్న పారిశుద్ధ్యాన్ని తమకు అప్పగించినట్లు చెప్పారు. ప్రస్తుతం నిజాయితీగా ఉన్న కమిషనర్‌

ప్రశాంతి వచ్చారని, త్వరలోనే పాలనను గాడిలో పెడతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఏపీఎంపీడీ పథకం పనులు రెండేళ్లలో పూర్తి కావాల్సి ఉన్నా కాలేదని, గడువు

పెంచుకున్నా పనులు మాత్రం ముందుకుసాగలేదన్నారు. పైప్‌లైన్లను ఎలా పడితే అలా వేయడంతో రోడ్లన్నీ పాడయ్యాయన్నారు. à°—à°¤ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు

ఇబ్బందులు పడుతున్నారని, పాడైన రోడ్లలో గుంతలు పూడ్చడానికి టెండర్లు పిలుస్తున్నట్లు తెలిపారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు మాత్రం ప్రయోజనం

చేకూర్చలేదని మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో గోడలపై రంగులు వేయడం, బాగున్న డివైడర్ల స్థానంలో కొత్తవి వేసుకుని బిల్లులు చేసుకోవడమే సరిపోయిందన్నారు.

ప్రజాప్రతినిధులు కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారని విమర్శించారు. గాడితప్పిన వ్యవస్థను బాగు చేస్తామని స్పష్టం చేశారు. నగరంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా

మంచినీటిని సరఫరా చేస్తామని, భవిష్యత్‌ తరాలకు కూడా ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. కలెక్టర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ కొన్ని రోజులుగా నగరానికి రంగు మారిన నీరు

వస్తుండడంతో తాము పరిశీలించామన్నారు. à°ˆ నీరు తాగడానికి ఇబ్బంది లేదని, కానీ చూడడానికి రంగు మారడంతో ప్రజలు సైకలాజికల్‌à°—à°¾ ఆందోళన చెందడం జరుగుతోందన్నారు.

ఎలాంటి ఇబ్బంది లేకుండా శుద్ధి చేసిన నీటిని అందిస్తామని చెప్పారు. నగర పాలక సంస్థ కమిషనర్‌ ప్రశాంతి మాట్లాడుతూ నీటి విషయంలో ప్రజల నుంచి

ఫిర్యాదులొస్తున్నాయన్నారు. ప్రస్తుతం పరిస్థితి కాస్త మారిందని, క్లోరినేషన్‌ బాగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఫిల్టరేషన్‌ పాయింట్‌ వద్ద ప్రత్యేక

దృష్టి పెట్టేలా అధికారులను నియమించామని చెప్పారు. ప్రజలు నీటి సరఫరా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏవైనా ఇబ్బందులు వస్తే నగర పాలక సంస్థ

కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ల్యాబ్‌కు నీటిని తీసుకొస్తే పరిశీలిస్తామన్నారు. క్లోరిన్‌ లెవల్‌ బాగుందా? లేదా? అన్నది ప్రథమ ప్రాధాన్యతగా తీసుకుని

ప్రజలకు శుద్ధజలాలు అందిస్తామని చెప్పారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 4, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam