DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పర్యాటక ఏర్పాట్లపై అప్రమత్తంగా ఉండాలి - కలెక్టర్ నివాస్ 

17 న పోషన్ అభియాన్ ర్యాలీ - సదస్సులు :

పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలి: శ్రీకాకుళం  à°•à°²à±†à°•à±à°Ÿà°°à± నివాస్ 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,

 à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚): . .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 16, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం జిల్లాలో పర్యాటక ఏర్పాట్లపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను

ఆదేశించారు. సోమ వారం సాయంత్రం మండల అధికారులతో జిల్లా కలెక్టర్ నివాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గోదావరి నది ఘటన దురదృష్టకరం అన్నారు. గోదావరి నదిలో

జరిగినటువంటి సంఘటనలు జిల్లాలో జరగరాదని అందుకు ప్రతి అధికారి అప్రమత్తగా ఉండాలని ఆదేశించారు. అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో

ఎక్కువగా జలవనరులు కలిగిన ప్రదేశాలు ఉన్నాయని కలెక్టర్ అన్నారు. ప్రమాదాలు అధికంగా ఆదివారం జరుగుతుంటాయనే విషయాన్ని గమనించాలని తెలిపారు. సెలవు దినాలు

కావడంతో పర్యాటకులు అధికంగా సందర్శిస్తారని పేర్కొన్నారు. పర్యాటకుల భద్రత, సురక్షిత విధానాలు పాటించాలని ఆదేశించారు. పర్యాటకులు వచ్చే ప్రదేశాలను

తహసీల్దార్లు, విఆర్ఓలు ముందుగా సందర్శించి పరిస్థితులను అంచనా వేయాలని పేర్కొన్నారు. అనుకూలంగా లేనప్పుడు ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించ రాదని స్పష్టం

చేసారు. జలవిహారం వంటి సమయాల్లో విధిగా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, లైఫ్ జాకెట్స్ ఉండాల్సిందేనని ఆయన తెలిపారు. జిల్లాలో నదులను పడవలపై దాటే గ్రామాలు ఉంటే

లైఫ్ జాకెట్స్ పడవలో ఉంచాలని ఆదేశించారు. ఆదేశాలను నిరంతరం అప్రమత్తతతో అమలు చేయాలని స్పష్టం చేసారు. విధుల్లో ఎటువంటి నిర్లక్ష్యంను సహించేది లేదని

హెచ్చరించారు. స్పందన వినతులను సకాలంలో నాణ్యమైన పరిష్కారం చేయాలని అన్నారు.పౌరసరఫరాలు, భూములకు సంబంధించిన ఆర్జీలను పరిష్కరించడం వలన ఎక్కువ ఆర్జీలు

పరిష్కారం అవుతుందని, పెండింగు తక్కువగా ఉంటాయని అన్నారు. తితిలి తుఫాను, వరద ప్రాంతాల్లో నష్ట పరిహారంను 1.23 లక్షల మందికి గతంలో అందించామని పేర్కొన్నారు. పూర్తి

అర్హులకు అందిందా లేదా అనే విషయాన్ని పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. 33 శాతం కంటే అధికంగా నష్టం జరిగి ఉంటే వారు పూర్తి అర్హులని పేర్కొంటూ ప్రభుత్వం

ప్రకటించిన కొత్త పరిహారాన్ని ఇప్పటికే నష్ట పరిహారం పొందిన వాస్తవ లబ్ధిదారులకు మాత్రమే లభిస్తుందని తెలిపారు. జాబితాలో కొత్త లబ్ధిదారులను చేర్చుటకు అవకాశం

లేదని స్పష్టం చేసారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ క్షేత్ర స్థాయి అధికారులతో కలసి జాబితాలు తహశీల్దార్లు వారం రోజుల్లో పరిశీలించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి

దీనిని నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. జిల్లాలో గల 835 గ్రామ సచివాలయాలు అక్టోబరు 2వ తేదీ నాటికి సిద్ధం చేయాలని అన్నారు. రేషన్ కార్డ్, పింఛను, ఎల్.ఇ.సి

కార్డ్ జారీకి అవకాశం ఉండేటట్లు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. హౌసింగ్ వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ కు

వంగరలో హాజరు కాకుండా రాజాం నుండి ఎం.పి.డి.ఓ హాజరు కావడం పట్ల షోకాజ్ నోటీసు జారీ చేయాలని జెడ్పీ సి.ఇ.ఓ కు ఆదేశాలు జారీ చేసారు. వీడియో కాన్ఫరెన్స్ కు హాజరుకాని

అధికారులకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు.

పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలి :. . .

                ప్రస్తుత పరిస్థితుల రీత్యా జిల్లాలో పారిశుద్ధ్య డ్రైవ్

ప్రారంభం కావాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో జ్వరాలు ప్రభలుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పి.హెచ్.సి ల్లో మధ్యాహ్నం వైద్య శిబిరాలు

నిర్వహించి ప్రజలకు వైద్య సేవలు అందించాలని, ఆరోగ్యంపట్ల అవగాహన కల్పించాలని ఆదేశించారు.

సెప్టెంబర్ 17 న పోషన్ అభియాన్ ర్యాలీ - సదస్సులు :

     

 à°®à°‚గళవారం పోషన్ అభియాన్ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టాలని ఆదేశించారు. ఐసిడిఎస్ ఇతర సంబంధిత శాఖలు భాగస్వామ్యం కావాలని ఆదేశించారు.

ప్రజల్లో ఆరోగ్య అలవాట్లు, తీసుకోవలసిన ఆహార పదార్థాల జాబితా  à°¤à°¯à°¾à°°à± చేసి ప్రజలకు తెలియజేయాలని అన్నారు. ఆరోగ్య శ్రీకాకుళం నెలకొల్పుటకు ప్రతి అవాకాశాన్ని

సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జీవన శైలి మార్పుతో బి.పి., మధుమేహం, థైరాయిడ్ వంటి వ్యాధులు సులభంగా నివారించవచ్చని వాటిపై అవగాహన అవసరమని అన్నారు. పోషన్

అభియాన్ కార్యక్రమం క్రింద మంగళ వారం ఉదయం 7 గంటల నుండి 7 రోడ్లు కూడలి నుండి ఆర్ట్స్ కళాశాల వరకు అవగాహనకు ర్యాలీ జరుగుతుందని, అనంతరం సిల్వర్ జుబిలీ

ఆడిటోరియంలో సమావేశం జరుగుతుందని చెప్పారు.

ఈ వీడియో కాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్ డా కె. శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, జిల్లా

పరిషత్ సిఇఓ జె. చక్రధర రావు, ఆర్డీఓ ఎం.వి.రమణ, కెఆర్సీ ఎస్డీసి సీతారామయ్య, డీపీఓ వి.రవి కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ టి.శ్రీనివాసరావు, గృహ నిర్మాణ సంస్థ పిడి

వేణుగోపాల్, ఏపీఎంఐపి పిడి ఏ.వి.ఎస్.వి.జమదగ్ని,   ఉద్యానవన శాఖ ఏడి ఆర్.వి.వి.ప్రసాద్, ఐసిడిఎస్ పిడి జి.జయదేవి, డిఐఓ à°¡à°¾ బి.జగన్నాథ రావు, పంచాయతీ రాజ్ ఎస్.à°‡ తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam