DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలు : జి.కె.ద్వివేది

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌):  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°µà±à°¯à°¾à°ªà±à°¤à°‚à°—à°¾ అక్టోబర్ 2 నాటికి గ్రామ, వార్డు

సచివాలయాలను ప్రారంభించాలని పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం సాయంత్రం

గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అక్టోబర్ 2న గ్రామ, వార్డు

సచివాలయాలను ప్రారంభించాల్సి ఉందని, అందుకు తగిన విధంగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ ఏర్పాట్లకై జిల్లా పంచాయతీ

అధికారి, జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వహణ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీచేసామని చెప్పారు. స్థానిక యం.పి.డి.ఓ, పంచాయతీ రాజ్, ఇంజినీరింగ్ విభాగం తదితర

అధికారుల సహకారాన్ని తీసుకోవాలని కోరారు. అక్టోబర్ 2à°¨ సచివాలయాలు ప్రారంభంకావాల్సి ఉన్నందున à°ˆ నెలాఖరుకే  à°—్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన అన్ని

ఏర్పాట్లు పూర్తికావాలని, à°ˆ విషయంలో కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించా లన్నారు.  గ్రామ, వార్డు సచివాలయ కార్యాలయాలను ఇప్పటికే ఎంపికచేయడం జరిగిందని, ఇంకనూ

ఎక్కడైనా చేయాల్సి ఉంటే వాటిని అద్దె ప్రాతిపదికన తక్షణమే తీసుకోవాలని అన్నారు. అలాగే ప్రతీ సచివాలయానికి విద్యుత్, కంప్యూటర్లు, యూపియస్, ఇంటర్నెట్,

బయోమెట్రిక్, ఐరిష్ , కలర్ ప్రింటర్, స్కానర్, లామినేషన్ మిషన్, స్టేషనరీ, స్టీలు బీరువాలు, మొబైల్ ఫోన్లు వంటివి ఏర్పాటుచేయాలని చెప్పారు. ప్రతీ సచివాలయంలో 10 మంది

సిబ్బంది ఉంటున్నందున వారికి అవసరమైన ఫర్నిచర్ అనగా 10 టేబుళ్లు, 10 కుర్చీలు, 11 గోద్రెజ్ స్టీలు బీరువాలను (ఫైళ్లను ఉంచేందుకు లాక్ తో ఉన్నవి ) సిద్ధం చేయాలని

చెప్పారు. ప్రజల సౌకర్యార్ధం మొబైల్ ఫోన్లను అందుబాటులో ఉంచాలని, సచివాలయాలకు వచ్చే  à°ªà±à°°à°œà°² కొరకు 20 కుర్చీలను ఏర్పాటుచేయాలని తెలిపారు. అక్టోబర్ 2 నాటికి

జిల్లాలోని మండల మరియు పురపాలక ప్రాంతం పరిధిలో  à°’à°• మోడల్ సచివాలయాలను ఏర్పాటు చేయాల్సి ఉందని, నవంబర్ 15 నాటికి జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేయాల్సి ఉందని ఆయన

స్పష్టం చేసారు. మోడల్ సచివాల యాలకు సంబంధించిన ఫొటోగ్రాఫ్స్ ను తమకు పంపించాలని సూచించారు. అక్టోబర్ 2న ఉదయం సచివాలయాలు ప్రారంభమవుతాయని, మధ్యాహ్నం సిబ్బందికి

శిక్షణ ఉంటుందని చెప్పారు. 3న గ్రామస్థాయిలో ఏర్పాటుచేసే సచివాలయాలపై గ్రామసభల నిర్వహణ ఉంటుందని, 4న ప్రతీ పంచాయతీ పరిధిలో అవగాహన సదస్సులు ఉంటాయని తెలిపారు.

సిబ్బందికి దశలవారీగా శిక్షణ ఇచ్చిన అనంతరం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు.

        జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ

జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ కార్యాలయాలను సిద్ధం చేసామని చెప్పారు. సిబ్బంది నియామకాలు జరిగిన వెంటనే కార్యకలాపాలు జరిగేవిధంగా అన్నిచర్యలు తీసుకోవడం

జరిగిందని తెలిపారు.  à°ˆ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి చక్రధరరావు, జిల్లా పంచాయతీ అధికారి బి.రవికుమార్, గ్రామీణ నీటిసరఫరా విభాగం

పర్యవేక్షక ఇంజినీరు టి.శ్రీనివాసరావు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 4, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam