DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాలల స్నేహపూర్వక జిల్లాగా శ్రీకాకుళం: గంటా  హైమావతి

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 20, 2019 (డిఎన్‌ఎస్‌): బాలల హక్కుల పరిరక్షణలో బాలల స్నేహపూర్వక జిల్లాగా

శ్రీకాకుళం అవతరించాలని, ఆ దిశగా అధికారులు కృషిచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ ఛైర్ పర్సన్ గంటా హైమావతి పేర్కొన్నారు. శుక్రవారం

స్థానిక  à°œà°¿à°²à±à°²à°¾ పరిషత్ సమావేశ మందిరంలో  à°¬à°¾à°²à°² హక్కుల పరిరక్షణ కొరకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో ఆమె సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. à°ˆ సందర్భంగా

మాట్లాడుతూ జిల్లాలో రిజిష్టర్ కాని పాఠశాలలు చాలావరకు ఉన్నాయని, వాటిలో ప్లేస్కూల్ పేరిట మోసపూరిత ప్రకటనలు ఇచ్చి పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాయని, అటువంటి

విద్యాసంస్థలను రద్దుచేయాలని                à°œà°¿à°²à±à°²à°¾ విద్యాశాఖాధికారిని ఆదేశించారు. అలా చేయడం వలన రాబోయే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. పుట్టినతేదీ ధృవీకరణ

పత్రాలు సకాలంలో ఇవ్వని కారణంగా జిల్లాలో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయనే విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇకపై బాల్యవివాహాలు చేసుకుంటున్న బాలబాలికల

పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలను కోరితే సంబంధిత యం.ఇ.ఓలు ఇవ్వాల్సిందేనని కమీషన్ ఛైర్ పర్సన్ అధికారులను ఆదేశించారు. బాలబాలికలు అనారోగ్యం పాలైన సమయంలో వారికి

 à°ªà°¾à° à°¶à°¾à°²à°²à±à°²à±‹ à°’à°• విశ్రాంతి గదిని ఏర్పాటుచేయాల్సి ఉందని, ఇందుకు ఎటువంటి నిధులు ఖర్చుచేయాల్సిన అవసరంలేదని, à°† పాఠశాలలోని à°’à°• తరగతి గదిని కేటాయించ వచ్చని

సూచించారు. అలాగే బాలికల రుతుక్రమ సమస్యల కొరకు ప్రత్యేకంగా à°’à°• గదిని కేటాయించాలన్నారు.  à°¬à°¾à°²à°² పరిరక్షణకు సంబంధించి ముఖ్యంగా మహిళల్లో అవగాహన

పెంపొందించాలని, ఇందుకు వెలుగు సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వెలుగు సిబ్బంది అవగాహన కల్పించినట్లయితే చాలా వరకు బాలల పరిరక్షణ విషయంలో సమస్యలు

ఉత్పన్నంకావని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో  à°ªà±à°°à°¸à°¾à°° మాధ్యమాల ప్రభావం కారణంగా బాలబాలికల్లో సహనం తగ్గుతుందని, తద్వారా పిల్లల మానసిక

స్థితిగతులు మారుతున్నాయని ఆమె చెప్పారు. ఇటువంటి వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించి వారి మానసిక పరివర్తనను పెంపొందించేలా ఉపాధ్యాయులు చర్యలు

తీసుకోవాలని ఆమె కోరారు. స్నేహపూర్వక వాతావరణం కల్పించినపుడే విద్యార్ధుల సమస్యలు ఉపాధ్యాయులతో పంచుకోగలరని, అటువంటి స్నేహపూర్వక వాతావరణాన్ని ఉపాధ్యాయులు

కల్పించాలని కోరారు. యాచకత్వం చేసే బాలబాలికలను గుర్తించి వారికి విద్యను అందించడం ద్వారా వారు అటువంటి వృత్తిని విడనాడి మంచి నడవడికను పొందగలరని ఆమె ఈ

సందర్భంగా సూచించారు. 6 సం.ల నుండి 18 ఏళ్ల లోపు బాలబాలికలకు నిర్భంధ విద్యను అందించడం ద్వారా ఎటువంటి సమస్యలు తలెత్తవని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి అనే

పథకానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు.ఈ విషయాన్ని తల్లితండ్రులకు వివరించి బాలబాలికలకు తప్పనిసరిగా విద్యను అందించేలా అధికారులు కృషిచేయాలని కోరారు.

 à°¤à±à°µà°°à°²à±‹ బాలబాలికల సమస్యల పరిష్కారం కొరకు ప్రత్యేకంగా à°’à°• బెంచ్ ను ఏర్పాటుచేయనున్నట్లు కమీషన్ చైర్ పర్సన్ పేర్కొన్నారు. మరో 2,3 మాసాల్లో దీన్ని

ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.ఆ బెంచ్ ద్వారా బాలబాలికల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించవచ్చని ఆమె స్పష్టం చేసారు. తద్వారా బాలల

స్నేహపూర్వక జిల్లాగా శ్రీకాకుళం అవతరించనుందని తెలిపారు. 

 à°ˆ కార్యక్రమంలో ఆం.ప్ర.రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ సభ్యులు పి.వి.వి.ప్రసాద్, అడిషనల్

ఎస్.పి జి.గంగరాజు, జిల్లా రెవెన్యూ అధికారి బి.దయానిధి, ఐ.సి à°¡à°¿ ఎస్ పధక సంచాలకులు అనంత లక్ష్మి, సి.డబ్ల్యు.సి చైర్మన్ నరసింహమూర్తి,  à°¸à°¾à°‚ఘిక సంక్షేమ శాఖ ఉప

సంచాలకులు కె.వి.ఆదిత్యలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి à°¡à°¾. à°Žà°‚ చెంచయ్య, జిల్లా  à°µà°¿à°¦à±à°¯à°¾à°¶à°¾à°–ాధికారి కుసుమ చంద్రకళ, ఏ.పి.ఎస్.డబ్ల్యు.ఆర్.స్కూల్స్ జిల్లా

సమన్వయ అధికారి వై.యశోదలక్ష్మి, à°¡à°¿.ఐ.à°’ à°¡à°¾.బి.జగన్నాథరావు, ఆర్.బి.సి.ఎస్   జిల్లా సమన్వయ అధికారి à°¡à°¾.కె.కృష్ణమూర్తి, మెప్మా పథక సంచాలకులు à°Žà°‚.కిరణ్ కుమార్, జిల్లా ఉప

విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మా , ఆర్.టి.సి.పి.అర్.ఒ బి.ఎల్.పి.రావు, వై.సి.బి డైరెక్టర్ ఎం.ప్రసాదరావు, ఇతర జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర సభ్యులు తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam