DNS Media | Latest News, Breaking News And Update In Telugu

22, 23 తేదీల్లో సర్టిఫికెట్లను  వెబ్ లో అప్ లోడ్ చేయాలి

24 నుంచి  à°¦à°°à°–ాస్తుల పరిశీలన :  à°•à°²à°•à±à°Ÿà°°à± నివాస్  

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 21, 2019 (డిఎన్‌ఎస్‌):

జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు అర్హత పొందిన అభ్యర్ధులు 22, 23 తేదీల్లో తమ ధృవీకరణ పత్రాలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్

పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు అర్హత పొందిన అభ్యర్ధుల ధృవీకరణ పత్రాల పరిశీలనకు సంబంధించి స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా

కలెక్టర్ జిల్లా అధికారులతో కలెక్టర్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ  à°‰à°¦à±à°¯à±‹à°—ాలకు అర్హత పొందిన

అభ్యర్ధుల ధృవీకరణ పత్రాల పరిశీలన ఈ నెల 24 నుండి 26వ తేదీ వరకు ఉందని, ఇందుకు శివాని,శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు మునసబుపేటలోని గాయత్రి డిగ్రీ

కళాశాలలో ఉందని చెప్పారు. 
అర్హత పొందిన అభ్యర్ధులు తమ ధృవపత్రాలను ఈ నెల 22, 23 తేదీల్లో విధిగా గ్రామ సచివాలయ వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో తప్పనిసరిగా అప్ లోడ్

చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేసారు. ధృవీకరణ పత్రాల పరిశీలకు సంబంధించి సంబంధిత శాఖాధిపతులు తప్పనిసరిగా వారికి కేటాయించిన కళాశాలలకు హాజరుకావాలని, వారితో

ఐదుగురు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. సంబంధిత అధికారులు ప్రతీ రోజూ  à°‰à°¦à°¯à°‚ 10à°—à°‚.à°² నుండి మధ్యాహ్నం 1.00à°—à°‚.లోగా 25 మందిని, మధ్యాహ్నం 2.00à°—à°‚.à°² నుండి

సాయంత్రం 5.00గం.లలోగా 25 మందిని వెరశి 50 మంది అభ్యర్ధుల విద్యార్హతలను పరిశీలించాల్సి ఉందన్నారు. ఇందుకు తగిన విధంగా కళాశాలల్లో గదులను ఏర్పాటు చేయడం జరిగిందని

కలెక్టర్ వివరించారు. అధికారులు అర్హత పొందిన అభ్యర్ధుల వివరాలతో పాటు, తేదీల వారీగా కేటాయించిన అభ్యర్ధుల వివరాలను తమవద్ద సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. కాల్

లెటర్ లేకుండా కొంత మంది అభ్యర్ధులు వచ్చే అవకాశం ఉందని, అటువంటి వారికి వారి తేదీలను స్పష్టంగా తెలియజేసి అభ్యర్ధులను పంపించాల్సి ఉందన్నారు. ధృవీకరణ పత్రాలు

ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసుకోలేని అభ్యర్ధులు కూడా కాల్ లెటర్లను తీసుకొని వచ్చే అవకాశం ఉన్నందున అటువంటి వారికోసం డేటా ఎంట్రీ ఆపరేటర్లను సిద్ధంగా ఉంచుకోవా

లని, ఇందుకు అవసరమైన కంప్యూటర్, ప్రింటర్లను కళాశాలల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం  à°œà°°à°¿à°—ిందని కలెక్టర్ తెలిపారు. నోటిఫికేషన్ ఆధారంగా ఆయా పోస్టులకు

సంబంధించిన విద్యార్హతలను పరిశీలించాల్సి ఉందని, ఒరిజినల్ హాల్ టికెట్ మరియు కుల ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉందని, అయితే కొత్తగా మంజూరుచేసిన పత్రాలు

అవసరంలేదని స్పష్టం చేసారు. అభ్యర్ధి 4 నుండి 7వ తరగతి వరకు చదివిన స్టడీ సర్టిఫికేట్ల ను పరిశీలించడం ద్వారా నివాస ధృవీకరణం స్పష్టమవుతుందని, నాన్ లోకల్

అభ్యర్ధులు మాత్రం తప్పనిసరిగా నివాస ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉందని కలెక్టర్ చెప్పారు. బి.సి అభ్యర్ధులు నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ (తహశీల్దార్

నుండి మాన్యువల్ గా పొందిన సర్టిఫికేట్ కూడా సరిపోతుంది), క్రీడాకారులు, ఎక్స్ సర్వీసుమెన్ తమ సర్టిఫికేట్లను, దివ్యాంగులు సదరం నుండి పొందిన సర్టిఫికేట్లను

పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. ఈ ప్రక్రియలో అధికారులకు సందేహాలు తలెత్తితే సంబంధిత అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. జెరాక్స్

ప్రతులతో హాజరైన అభ్యర్ధులు ఈ నెల 26లోగా తమ ఒరిజినల్ ధృవీకరణ పత్రాలను సంబంధిత శాఖాధిపతులకు సమర్పించాల్సి ఉందని కలెక్టర్ స్పష్టం చేసారు.

ఈ సమావేశంలో

జిల్లాపరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి  à°œà±†. చక్రధర రావు, నగర పాలక సంస్థ కమిషనర్ à°Žà°‚.గీత దేవీ, జిల్లా పంచాయతీ అధికారి వి.రవి కుమార్, పంచాయతీ రాజ్ పర్యవేక్షక

ఇంజినీర్ ఎస్.రామ్మోహన్, జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్ర కళ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎం.చెంచయ్య, మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు డా. వి.వి. కృష్ణ మూర్తి,

సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె.వి.ఆదిత్య లక్ష్మి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు బి.జి.డి. ప్రసాద్, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు ఏ.ఈశ్వర రావు, ఉద్యాన శాఖ

సహాయ సంచాలకులు ఆర్.వి.వి.ప్రసాద్, పట్టు పరిశ్రమ సహాయ సంచాలకులు త్రినాథ్, ఇతర జిల్లా అధికారులు తదితరులు  à°ªà°¾à°²à±à°—ొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam