DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఫైనాన్స్ ఇవ్వలేం - సెల్ఫ్ ఫైనాన్స్ తెచ్చుకోండి ? :జి వి ఎల్ 

ఆర్టీఏ చట్టం, జి ఎస్ à°Ÿà°¿ చట్టం ఇందుకే తెచ్చారా? 

ఉద్యోగాలు ఇవ్వలేం- వ్యాపారం చెయ్యండి 

కేంద్రాన్ని ఇరకాటం లో పెట్టిన జివిఎల్ 

విశాఖ ప్రెస్

మీట్ లో GVL సంచలన వ్యాఖ్యలు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) : . . . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 26, 2019 (డిఎన్‌ఎస్‌) : కేంద్రం దగ్గర నిధుల్లేవుట, జనం నుంచి 
పన్నుల రూపంలో

భారీగా దోచుకుని ఆర్ధికంగా బలోపేతం కావచ్చు అనే రీతిలో జివిఎల్ నర్శింహారావు తేల్చి చెప్పేసారు. గురువారం నగరం లోని బీజేపీ పార్టీ కార్యాలయం లో నిర్వహించిన

విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ రెండో సారి నరేంద్ర మోడీ కేంద్రంలో ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అనే ప్రశ్నకు ఆయన

చెప్పిన సమాధానం కేంద్రాన్ని, ప్రధానంగా బీజేపీ ని ఇరకాటంలో పెట్టె విధంగా మారింది. 

పన్నులు పెంచింది ఇందుకేనా?

కేంద్రం వద్ద నిధులు లేవు ట, జనం నుంచి

భారీగా పన్నులు వసూలు చేసుకోమంటూ ఆర్ టి ఏ చట్టం, జి ఎస్ టి చట్టం లాంటివి అమలు లోకి తీసుకువచ్చినట్టు సూచనప్రాయంగా తెలిపారు. కేంద్రం ఇటీవల ప్రవేశ పెట్టిన

ఆర్టీఏ చట్టం ద్వారా బైక్ లు నడిపే వారికి హెల్మట్, లైసెన్సు తదితర పత్రాలు ఇతర  à°²à±‡à°• పొతే భారీగా వెయ్యి  à°¨à±à°‚à°šà°¿ పది వేల రూపాయల భారీగా పన్నులు వడ్డించేందుకు

రాష్ట్రాలకు లైసెన్సులు ఇచ్చేసింది. సామాన్యుల నెల జీతమే ఐదు వేలు లోపు ఉంటుంది కదా, పదివేల ఫైన్ కట్టలేదంటే, తప్పదు కట్టితీరాల్సిందేనంటూ హుకుం జారీ చేసేసినంత

పనీ చేసారు. పైగా ఇదంతా జనానికి తెలియడం కోసమేనంటూ సూక్తులు వల్లించారు. ఇదే పద్దతిలో జీఎస్టీ కూడా తయారయ్యింది. ఒకే పని ఒకే పన్ను అంటూ ప్రారంభించిన జీఎస్టీ

రాష్ట్రానికి వేరుగా, కేంద్రానికి వేరుగా అంటూ భారీగా పన్నులు బాదేస్తున్నారు.  
కేంద్రం చట్టం చేసింది ట. .. పన్ను వసూలు చెయ్యాలో వద్దో రాష్ట్రాలు

తేల్చుకోవాలి అంటూ  à°œà°¿à°µà°¿à°Žà°²à± ప్రవచనము చెప్పేసారు. వీళ్ళు పెట్టిన ఆర్టీఏ చట్టాన్ని వీళ్ళ పార్టీ ( బీజేపీ ) అధికారం లో ఉన్న రాష్ట్రాలే పూర్తిగా

వ్యతిరేకించాయి. 

ముద్రా రుణాలు ఇస్తారట ? అసలు ఇస్తున్నారా?

కేంద్రం చేతిలో ఉద్యోగాలు లేవని, సొంతంగా వ్యాపారాలు చేసుకోడానికి ముద్ర రుణాలు ఇస్తామని

ప్రకటించారు. గత ఐదేళ్ల క్రితం మొదలు పెట్టిన ముద్ర రుణాలు ఎంత మందికి ఇచ్చారో చెప్పమంటే చేతులెత్తేశారు. పైగా ప్రస్తుతం ముద్ర లోను లు ఇస్తున్నాం అంటూ ప్రెస్

మీట్ లో ప్రకటించేసారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని శాఖలు, పరిశ్రమల్లో కొలువులు ఉండవుట . ..  à°¸à±Šà°‚à°¤ వ్యాపారం చెయ్యడానికి రుణాలు ఇస్తారుట. అసలు ఎంతమందికి à°ˆ ముద్ర

లోను లు ఇస్తున్నారు అనే విషయం జివిఎల్ కి తెలియక పోవడం గమనార్హం. అందరూ వ్యాపారం చేసేస్తే కొత్తగా ఉద్యోగాల్లోకి చేరేవారు ఎవ్వరు?

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam